V K Sasikala’s husband M Natarajan dies aged 74 శశికళకు పతివియోగం.. జైల్లోనే కన్నీళ్లపర్యంతం..

Vk sasikala s husband m natarajan dies of chest infection in chennai

V K Sasikala, M Natarajan, Husband, AIADMK, TTV Dinakaran, PaneerSelvam, Palani sami, Tamil Nadu, politics

M Natarajan, husband of jailed AIADMK leader V K Sasikala, died at 1:30am on Tuesday, a release from Gleneagles Global Health City

శశికళకు పతివియోగం.. జైల్లోనే కన్నీళ్లపర్యంతం..

Posted: 03/20/2018 08:18 AM IST
Vk sasikala s husband m natarajan dies of chest infection in chennai

తమిళనాడు చిన్నమ్మగా పేరొంది.. అక్రమాస్థుల వ్యవహారంలో బెంగుళూరులోని పరప్పనా అగ్రహార జైలులో శిక్షను అనుభవిస్తున్న వికే శశికళకు పతి వియోగం సంక్రమించింది. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న శశికళ భర్త ఎం.నటరాజన్ (73) సోమవారం అర్ధరాత్రి 1.30 నిమిషాలకు చికిత్స పోందుతూ అసుపత్రిలోనే కన్నుమూశారు. ఈ మేరకు చెన్నైలోని గ్లెనీగల్స్ గ్లోబల్ హెల్త్ సిటీ అస్పత్రి వర్గాలు విడుదల చేసిన ఓ ప్రెస్ నోట్ లో పేర్కోనింది.

గత కొన్ని నెలలుగా ఆయన మూత్రపిండాలు, ఛాతి ఇన్ ఫెక్షన్ సమస్యతో బాధపడుతున్న ఆయన గత అక్టోబరులో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నారు. మార్చి 16న అనారోగ్యంతో చెన్నైలోని గ్లోబల్ ఆసుపత్రిలో చేరిన ఆయన పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆయన ప్రాణాలను కాపాడుకునేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయని గ్లోబల్ హెల్త్ సిటీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ షణ్ముగ ప్రియన్ తెలిపారు.

1975లో శశికళను వివాహం చేసుకోవడానికి ముందు నటరాజన్ పీఆర్వోగా పనిచేశారు. విద్యార్థిగా ఉన్నప్పుడు హిందీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. జయలలితకు రాజకీయ సలహాదారుగానూ పనిచేశారు. భర్త నటరాజన్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలియడంతో శశికళ బెంగుళూరు జైలులోనే కన్నీళ్ల పర్యంతమైంది. ఇక ఆయన అర్థరాత్రి వేళ మరణించారన్న వార్తతో అమె తరపున న్యాయవాదులు అమెకు పెరోల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : V K Sasikala  M Natarajan  Husband  AIADMK  TTV Dinakaran  PaneerSelvam  Palani sami  Tamil Nadu  

Other Articles