Telangana govt presents budget 2018-19 with Rs. 1,74,453 Cr రూ. 1,74,453 కోట్లతో తెలంగాణ బడ్జెట్.. ద్రవ్యలోటు 29 వేల కోట్లు..

Telangana govt presents budget 2018 19 with rs 1 74 453 cr

Telangana Government, Telangana budget, Etela Rajender, Telangana Budget 2018, telangana schemes, telangana irrigation projects, telangana new panchayat bill, telangana micro irrigation, shadi mikarak, kalyana Lakshmi schemes, double bedroom houses, land assingment to landless dalits, child welfare schemes, misson bhagiratha, mission kakatiya

Telangana finance minister Etela Rajender today presented the state budget for 2018-19 with a total of Rs 1,74,453 crore. Revenue expenditure for the current financial year is Rs 1,25,464 crore.

రూ. 1,74,453 కోట్లతో తెలంగాణ బడ్జెట్.. ద్రవ్యలోటు 29 వేల కోట్లు..

Posted: 03/15/2018 12:02 PM IST
Telangana govt presents budget 2018 19 with rs 1 74 453 cr

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత గత రెండేళ్లుగా అభివృద్దిలో శరవేగంగా దూసుకుపోతుందని అర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. తమ ప్రభుత్వం అభివృద్దితో పాటు పేద, బలహీన వర్గాల అభివృద్దికి కట్టుబడి వుందని అన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు బడ్జెట్ కాబట్టి.. ఈ బడ్జెట్ లో అన్నివర్గాల ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేశామని చెప్పారు. ఈ సారి తమ బడ్జెట్ ప్రజాకర్షకంగా వుంటుందని ధీమా వ్యక్తం చేసిన ఈటెల.. వరుసగా ఐదోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టడం సంతోషంగా వుందని అన్నారు.

అణాగారిన తెలంగాణ వాసులను అభ్యున్నతి వైపు నడింపించే దిశగా తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు సాగుతుందని, ఇందుకు రాష్ట్రంలో పెరిగిన రొండెంకెల జీడీపీయే నిదర్శనమి చెప్పారు. 2013-14లో సమైక్య రాష్ట్రంలో కేవలం 5.4గా వున్న జీడీజీ.. ఈ ఏడాది 10.4 శాతంగా వుంటుందని అశాభావం వ్యక్తం చేశారు. నూతన పారిశ్రామిక విధానంతో తయారీ రంగంలో కూడా వృద్దిని సాధించామని అన్నారు. ఇక విభజించిన రాష్ట్రంలో అంధకారమే అని నోళ్లు మూతపడేలా విద్యుత్ రంగంలో శరవేగంగా అభివృద్ది చెందామని, వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్ సరఫారాతో సాగు విస్తీర్ణం పెరిగిందని ఈటెల పేర్కోన్నారు.

ఈ క్రమంలో్ ఈ వార్షిక బడ్జెట్ మొత్తం రూ. రూ.1,74,453కోట్లుతో ప్రవేశపెట్టిన ఈటెల.. రెవన్యూ వ్యయం రూ.1,25,454 కోట్లు వుందన్నారు. రెవెన్యూ మిగులు రూ.5,520కోట్లుగా వుండగా, ద్రవ్యలోటు మాత్రం రూ.29,077 కోట్లుగా అంచనా వేశామని చెప్పారు. అయితే జీడీపిలో ద్రవ్య లోటు 3.45శాతంగా వుందని చెప్పారు. అయితే తయారీ రంగం, పారిశ్రామిక రంగం, సాగు విస్తీర్ణం, మాంసం ఎగుమతి నేపథ్యంలో రాష్ట్ర అధాయం కూడా గణనీయంగా పెరిగిందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర అదాయం రూ.73,751కోట్లుగా వుందని, అయితే తలసరి అదాయం కూడా లక్షా 75 వేలకు పెరిగిందని ఈటెల పేర్పోన్నారు.

* తెలంగాణ మొత్తం బడ్జెట్‌.. రూ.1,74,453కోట్లు

* రెవెన్యూ వ్యయం.. రూ.1,25,454 కోట్లు

* రెవెన్యూ మిగులు రూ.5,520కోట్లు

* ద్రవ్యలోటు అంచనా.. రూ.29,077కోట్లు

* జీడీపీలో ద్రవ్య లోటు 3.45శాతం

* రాష్ట్ర ఆదాయం రూ.73,751కోట్లు

* కేంద్రం వాటా రూ.29,041కోట్లు



కేటాయింపులు ఇలా..

* పంటల పెట్టుబడి మద్దతుకు రూ.12వేల కోట్లు
* రైతు బీమా పథకానికి రూ.500 కోట్లు
* వ్యవసాయ యంత్రీకరణకు రూ.522కోట్లు
* పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధికి రూ.15,563కోట్లు
* బిందు తుంపర సేంద్యానికి రూ.127కోట్లు
* నీటి పారుదల రంగానికి రూ.25వేల కోట్లు
* రెండు పడకగదుల ఇళ్లకు రూ.2,643కోట్లు
* గురుకులాలకు రూ.2,283కోట్లు
* ఆర్‌ అండ్‌ బీకి రూ.5,575కోట్లు

* అర్చకుల జీతభత్యాలకు - రూ. 72 కోట్లు
* హోంశాఖకు - రూ. 5,790 కోట్లు
* పౌరసరఫరాల రంగానికి - రూ. 2,946 కోట్లు
* చేనేత, జౌళి రంగానికి రూ.1200 కోట్లు
* పరిశ్రమల శాఖకు రూ.1,286కోట్లు
* విద్యుత్‌ రంగానికి రూ.5,650కోట్లు
* ఐటీ శాఖకు రూ.289కోట్లు
* పురపాలక శాఖకు రూ.7,251కోట్లు
* గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.1500కోట్లు
* పట్టణాభివృద్ధికి రూ.1000కోట్లు
* యాదాద్రి అభివృద్ధికి రూ.250కోట్లు
* వేములవాడ ఆలయ అభివృద్ధికి రూ.100కోట్లు
* భద్రాద్రి ఆలయ అభివృద్ధికి రూ.100కోట్లు
* బాసర, ధర్మపురి ఆలయాల అభివృద్ధికి రూ.50కోట్ల చొప్పున కేటాయింపు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana Government  budget  Etela Rajender  Telangana Budget 2018  telangana schemes  KCR  KTR  TRS  

Other Articles