PM Modi is global leader in fake Twitter followers ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్ ఫాలోవర్ల గుట్టు రట్టు..

About 2 5 crore of pm modi s 4 crore twitter followers are fake audit

modi twitter followers total, fake twitter followers, what is fake follower, donald trump, Narendra Modi, Pope Francis, Narendra Modi Twitter, Narendra Modi Twitter followers, Twiplomacy, how fake followers work on twitter, trump twitter followers, pope francis twitter, king salman twitter follower, twitter audit fake followers, trending news, viral news, latest news

Prime Minister Narendra Modi has many credentials to his name, but his most talked about credential of being the most followed Indian leader on Twitter with 41 million followers should be underplayed given that more than 60% of his followers are fake

ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్ ఫాలోవర్ల గుట్టు రట్టు.. ఆ బాటలోనే..

Posted: 03/14/2018 05:55 PM IST
About 2 5 crore of pm modi s 4 crore twitter followers are fake audit

నిజం నిప్పులాంటిది.. అది కాసింత సేపు ఉనికిని చాటుకోలేకపోయినా.. నిలకడ మీద మాత్రం వెలుగులోకి వస్తుందని పెద్దలు పలుమార్లు చెప్పారు. ఇక దేశానికే దిశానిర్దేశం చేసే బాధ్యతను తమ భుజస్కంధాలపై మోస్తున్న వ్యక్తులు కూడా ఈ విషయంలో తప్పుడు మార్గాలను అన్వేషిస్తున్నారని గుట్టును రట్టు చేసింది అడిట్ సంస్థ. దేశయువతకు సన్మార్గంలో నడవాలని చెప్పే స్థాయి వ్యక్తులు.. తప్పుడు మార్గాలను అచరించి.. దేశానికి ఎలాంటి సందేశమిస్తున్నారన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

సోషల్ మీడియాలో అందులోనూ ట్విట్టర్ లో తన ఫాలోవర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకునేందుకు అక్రమమార్గాలను అన్వేషించిన వారిలో దేశాలకు చెందిన అగ్రనేతలు కూడా వున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ జాబితాలో ఫోప్ ఫ్రాన్సిస్ నుంచి మన ప్రధాని నరేంద్రమోడీ వరకు అనేక మంది వుండటం కలకలం రేపుతుంది. అత్యధిక మంది ఫాలోవర్లు వున్న ప్రధానిగా రికార్డులకెక్కిన ప్రధాని నరేంద్రమోడీ ట్విట్లర్లో వున్న ఫాలోవర్లలో 60శాతం మంది ఫాలోవర్లు నకిలీలేనని తేల్చేశారు. ట్విట్టర్ అకౌంట్ల ఫాలోవర్ల సంఖ్యను అడిట్ చేసే సంస్థ ట్విప్లోమసీ తన తాజా అధ్యయనంలో ఈ వివరాలను వెల్లడించింది.

డిజిటల్ వ్యూహాన్ని అభివృద్ధి చేసుకోవడంలో అంతర్జాతీయంగా పలు సంస్థలు, ప్రభుత్వాలకు సహకారం అందించే సంస్థ ‘ట్విప్లోమసీ’ నేతలకు ట్విట్టర్ లో వున్న ఫాలోవర్ల సంఖ్య తప్పుగా పేర్కొంది. నేతలకు వున్న ఫాలోవర్లలో నకిలీలు కూడా ఉనికిని చాటుకుంటున్నారని గుట్టును రట్టు చేసింది. ప్రధాని మోదీకి మొత్తం 40,993,053 మంది ఫాలోవర్లు ఉండగా... అందులో 24,799,527 ఫాలోవర్లు నకిలీలేనని ట్విప్లోమసీ పేర్కొంది. కేవలం 16,191,426 మంది మాత్రమే అధికారిక ఫాలోవర్లు ఉన్నట్టు తేల్చింది.
 
అయితే ఫేక్ పాలోవర్లు బెడద ప్రధానికే పరిమితం కాలేదు.. ఏకంగా  కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్, పోప్ ఫ్రాన్సిస్, రాజు సల్మాన్ ల అకౌంట్లలోనూ నకిలీ ఫాలోవర్లు ఉన్నట్టు గుర్తించిందీ అడిట్ సంస్థ.  ఈ నివేదిక ప్రకారం... ట్రంప్‌కి ట్విటర్లో ప్రస్తుతమున్న 48,939,948 మంది ఫాలోవర్లలో 35,980,870 మంది మాత్రమే జెన్యూన్ ఫాలోవర్లు ఉన్నారు. మిగతా 12,445,604 మంది ఊరూపేరు లేని వాళ్లే. కాగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌కి ట్విటర్లో మొత్తం 3,696,460 ఫేక్ ఫాలోవర్లు ఉండగా... 1,715,634 మంది అధికారిక ఫాలోవర్లు ఉన్నారు. ఇక పోప్ ఫ్రాన్సిస్‌కు కూడా ట్విటర్లో మొత్తం 59 శాతం ఫేక్ ఫాలోవర్లే ఉన్నట్టు నివేదిక వెల్లడించడం విశేషం.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles