young woman misbehaves with traffic si in kadapa చలానాను చించి ఎస్ఐపైకి విసిరిన యువతి

Young woman misbehaves with traffic si in kadapa

young woman, triple riding, driving license, misbehave, challan, traffic police, traffic si venkateshwarlu, kotireddy circle, police department, si rash behaviour, latest updates, latest news

young woman misbehaves with traffic si in kadapa after she was caught triple riding without any drving licence, she tares challan issued by police and throws it on traffic si.

నా బండినే అపి ఫైన్ వేస్తావా..? ఎస్ఐపై యువతి దురుసు ప్రవర్తన

Posted: 03/14/2018 04:51 PM IST
Young woman misbehaves with traffic si in kadapa

రోడ్డుపై వాహనంపై వెళ్తుంటే ఆ వాహనానికి సంబంధించిన అన్ని డాక్యూమెంట్లు వున్నాయా..? లేదా..? ముఖ్యమైన డ్రైవింగ్ లైస్సెన్స్ వుందా లేదా..? అంతకన్నాముందు తలకు హెల్మెట్ వుందా.? అన్ని సమకూర్చుకుని వెళ్తాం. అలా ఏ ఒక్కటి లేకపోయినా.. ట్రాఫిక్ పోలీసులు కనిపించగానే మెల్లిగా సైడ్ అయిపోతాం. కానీ ఇక్కడ ఓ యువతి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా స్పందించింది. మా వాళ్లు కూడా పోలీసులే.. ఖబర్డార్ అంటూ ఏకంగా ఎస్ఐకే వార్నింగ్ ఇచ్చింది. ఇంతకీ ఆ యువతి చేసిన నేరమేంటి అంటారా..?

అమె వద్ద డ్రైవింగ్ లైసెన్సు లేకపోయినా దర్జాగా రోడ్డుపైకి వచ్చేసింది. కనీసం తలకు హెల్మెట్ కూడా పెట్టుకోకుండా బిజీగా వుంటే కూడలి వద్దకు చేరుకుంది. ఇక అంతకుమించి తన వాహనం వెనుక మరో ఇద్దరు స్నేహితురాళ్లను కూర్చోబుట్టుకుని మరీ త్రిబుల్‌ రైడింగ్‌ చేసింది. అలా చేస్తూ ఏకంగా కడప నగర కోటిరెడ్డి సర్కిల్‌ వద్దకు చేరుకుంది. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు దీనిని గమనించి వారిని నిలువరించారు. హెల్మెట్ లేకుండా ఎందుకు రోడ్డుపైకి వచ్చారని యువతిని ప్రశ్నించారు.

సరే ముందు డ్రైవింగ్ లైసెన్సు చూయించండీ అని అడ్డగా, తన వద్ద తన వద్ద లేదని చెప్పింది. దీంతో చిరెత్తుకోచ్చిన ఎస్‌ఐ.. యువతిని హెల్మెట్ రహిత డ్రైవింగ్, డ్రైవింగ్ లైన్సెన్సు లేకుండా వాహనాన్ని నడపడం సహా త్రిబుల్ రైడింగ్ చేసిన నేరాల కింద జరిమానా విధించి చలానాను యువతికి అందజేశాడు. దీంతో ఒక్కసారిగా ఆ యువతి ఎస్ఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తన బండినే ఆపి జరిమానా వేస్తావా.. అంటూ చలానాను చించి పోలీసుల ముఖంపై విసిరేసింది. దీంతో ఎస్‌ఐ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు.
 
అయితే ట్రాఫిక్ ఎస్ వెంకటేశ్వరరావు తమతో దురుసుగా ప్రవర్తించాడని యువతి అరోపిస్తుంది. హెల్మెట్ లేదని అడిగిన ఎస్ఐ.. డ్రైవింగ్ లైసెన్సు లేకుండా త్రిబుల్‌ రైడింగ్‌ చేస్తావా.. అంటూ తనపై దాడి చేశఆడని, అరోపించింది. అంతేకాకుండా కానిస్టేబుళ్లతో తన వాహనాన్ని పోలిస్ స్టేషన్ కు తరలించారని చాలానా రాసినప్పుడు దానిని కట్టాలంటే తమ వాహనాన్ని తమకు ఇవ్వకుండా పోలిస్ స్టేషన్ కు తరలించడమేంటని యువతి ప్రశ్నించింది. ఎస్ఐ దాడి చేయడంతోనే అగ్రహంతో తాను చలానాను చించివేశారని పేర్కోన్నట్లు తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles