jana reddy slams assembly speakers decision గవర్నర్ పరిధిలోని అంశంపై స్పీకర్ నిర్ణయమా.?

Congress mla s suspension and expell is a blackday in democracy

ESL Narasimhan, Governor Narasimhan, uttam kumar reddy, jana reddy, mallu batti vikramarka, shabbir ali, swamy goud, congress, congress MLAs, Congress MLCs, komatireddy venkat reddy, Sampath, Telangana, Telangana Legislative Assembly, Telangana Legislative Council, council chairman, swamy goud eye injured, budget session, Narasimhan budget speech, swamy goud, congress, komatireddy venkat reddy, Telangana News, Telangana politics

Komatireddy Venkat reddy and sampath expulsion and mla's suspension is a black day in the history of democracy says tpcc chief uttamkumar reddy.

ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు.. ఇక న్యాయపోరాటం

Posted: 03/13/2018 01:21 PM IST
Congress mla s suspension and expell is a blackday in democracy

అసెంబ్లీలో మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ఫై కాంగ్రెస్‌ సభ్యులు దాడి చేశారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. చివరి బడ్జెట్ సమావేశంలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన విధానాన్ని తాము తూర్పారబడతామని భావించిన కేసీఆర్ సర్కార్ కావాలని తమ గొంతు నొక్కాడానికే తమపై లేనిపోని అరోపణలు చేసి.. వాటినే తీర్మాణాలుగా అమోదించి.. తమను బలవంతంగా అసెంబ్లీ నుంచి గెంటేశారని ఉత్తమ్ ఆరోపించారు. ప్రభుత్వ తీరుపై తాము న్యాయపోరాటం చేస్తామని చెప్పారు.

తెలంగాణ శాసనసభ స్పీకర్ నియంతృత్వ ధోరణితో వ్యవహరించి.. ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడాన్ని తాము న్యాయస్థానంలో ఎదుర్కొంటామని అన్నారు. సీఎల్పీ సభ్యుడి, మండలి ఫక్ష నేతలను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేయడం వెనుక కుట్ర, కుతంత్రాలు వున్నాయని అరోపించారు. తమ శాసనసభలో స్పీకర్‌ కనీసం తమ వాదన వినకుండానే సస్పెన్షన్ వేటు వేయడం దారుణమన్నారు. లోక్ సభలో కేసీఆర్ కూతురు నిజామాబాద్ ఎంపీ కవిత.. తమపై సస్పెన్షన్ వేటు వేస్తున్న సమయంలో ఏం చేస్తుందో తెలుసుకోవాలన్నారు. అమెకు ఓ న్యాయం.. కాంగ్రెస్ సభ్యులకు మరో న్యాయమా..? అని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి అదేశానుసారమే తాను అస్పత్రిలో చేరానని స్వామిగౌడ్ చెప్పారని.. కావాలని ముఖ్యమంత్రి కాంగ్రెస్ పై కుట్రపూరితంగా వ్యవహరించారని అరోపించారు. సభలో మార్షల్స్ ను సభ్యుల కన్నా అధిక సంఖ్యలో దింపి.. వారితో తమను బయటికి గెంటించడం వెనుకు ప్రభుత్వం దురుద్దేశ్యం వుందని అన్నారు. గతంలో హరీశ్‌రావు శాసనసభలో ప్రవర్తించిన తీరు కేసీఆర్‌ మరిచిపోయారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగేళ్లుగా నిర్ణయం తీసుకోని స్పీకర్‌... తమపై మాత్రం నిమిషాల్లోనే నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. పార్టీ మారకపోతే కేసులు పెడతాం లేదంటే సస్పెండ్ చేస్తామని సందేశం ఇస్తున్నారా..? అంటూ కేసీఆర్ సర్కారును ఉత్తమ్ ప్రశ్నించారు.

శాసన మండలి చైర్మన్ కంటి కార్నియాకు దెబ్బ తగిలిందని, ఇది చాలా ప్రమాదకరమైన దాడి అని అంగలార్చుతున్న ప్రభుత్వం.. దాడి జరిగిన నేపథ్యంలో వెంటనే స్వామిగౌడ్ ను అస్పత్రికి తరలించకుండా.. ఎందుకు తాత్సరం చేసిందని ఉత్తర్ ప్రశ్నించారు. దాడి జరిగిన తరువాత 15 నిమిషాల పాటు గవర్నర్ ప్రసంగించారని, ఆ తరువాత అయనను సాగినంపిన తరువాత స్వామిగౌడ్ ను అస్పత్రికి తరలించారని.. కార్నియాకు నిజంగా దెబ్బతగిలితే ఇదెలా సాధ్యమని ఉత్తమ్ ప్రశ్నించారు. దాడి ఘటన కేసీఆర్ ఆడించిన నాటకమని దుయ్యబట్టారు.

శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ అంటే తమకు కూడా గౌరమవేనని, అయితే అయనకు నిజంగా గాయమైవుంటే.. ఆ వీడియోను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. ఇది ప్రభుత్వం చేస్తున్న కుట్రల తప్ప మరోటి కాదని విమర్శించారు. స్వామిగౌడ్ ఒకవైపు కూర్చుంటే మరో వైపు ఉన్న కంటికి ఎలా దెబ్బ తగిలిందని ఆయన నిలదీశారు. అయినా ఇదే అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాలను టీఆర్ఎస్ ఎన్ని పర్యాయాలు అడ్డుకోలేదని..? అయినా అప్పటి తమ ప్రభుత్వం వారి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసిందా..? అని ఉత్తమ్ ప్రశ్నించారు.

గవర్నర్ ఫరిధిలోని అంశంపై స్పీకర్ నిర్ణయమేంటీ.?

శాసనమండలి చైర్మన్ పై దాడి ఘటనలో ఏ సంబంధం లేని తనపైనా స్పీకర్‌ వేటు వేయడం షాక్‌ గురిచేసిందని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత జానారెడ్డి అన్నారు. స్పీకర్ నిర్ణయం అప్రజాస్వామికం, సంప్రదాయానికి విరుద్ధమని మండిపడ్డారు. తెలంగాణ సర్కారు తీరు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని ఆక్షేపించారు. ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేయాలని చూస్తోందని ఇది తెలంగాణ అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజని అభివర్ణించారు. నిరసన తెలిపే నైతిక హక్కు సభ్యులకు ఉంటుందని, అయినా ఇది గవర్నర్ పరిధిలోని అంశమని, దీనిపై స్పీకర్ ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు.

అయినా తమ సభ్యులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సముచితం కాదని అన్నారు., స్పీకర్‌ తమ వివరణ వినకుండానే నిర్ణయం తీసుకుని సభ్యులను సస్పెండ్ చేయడం ఇది ప్రభుత్వం అడిస్తున్న డ్రామాగానే ఆయన పేర్కోన్నారు. బడ్జెట్‌లో లోపాలను ఎత్తి చూపుతామన్న ఆందోళనతోనే ముందుగానే తమను సభ నుంచి గెంటేశారని ఆరోపించారు. చర్చ లేకుండానే బడ్జెట్‌ను ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా రేపు మండల కేంద్రాల్లో నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించినట్లు జానారెడ్డి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles