Telangana council chairman swamy goud eye injured అదుపు తప్పిన విపక్షాల అగ్రహం.. స్వామీగౌడ్ కంటికి గాయం..

Telangana council chairman swamy goud eye injured

ESL Narasimhan, Governor Narasimhan, swamy goud, congress, komatireddy venkat reddy, Telangana, Telangana Legislative Assembly, Telangana Legislative Council, council chairman, swamy goud eye injured, budget session, Narasimhan budget speech, swamy goud, congress, komatireddy venkat reddy, Telangana News, Telangana politics

During the governor’s address, Congress MLA Komatireddy Venkat reddy threw his headphones away, opposing the governor’s speech. Unfortunately, the headphones struck Legislative Council Chairman (and TRS MLC) Swamy Goud, and his eye got injured.

అదుపు తప్పిన విపక్షాల అగ్రహం.. స్వామీగౌడ్ కంటికి గాయం..

Posted: 03/12/2018 12:28 PM IST
Telangana council chairman swamy goud eye injured

తెలంగాణ రాష్ట్ర 2018-19 బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభలో విఫక్ష సభ్యుల అగ్రహం అదుపు తప్పింది. తొలిరోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తున్న సమయంలో.. విపక్ష సభ్యులు ప్రసంగానికి అడ్డుకునే ప్రయత్నం చేశారు. గవర్నర్ ఫ్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం అబద్దాలను జోప్పించిందని వారు అగ్రహాన్ని వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. గడిచిన మూడున్నరేళ్లుగా రైతుల సమస్యలను పరిష్కరించడంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైనా.. గవర్నర్ మాత్రం బంగారు తెలంగాణ వైపు అడుగులు వేస్తుందని చెప్పడాన్ని కాంగ్రెస్ సభ్యులు అక్షేపించారు.

అన్నదాతల ఆత్మహత్యలు ఏడాదికేడాది పెరుగుతున్న.. వారి కుటుంబసభ్యుల అక్రందనలు మిన్నంటుతున్నా వాటిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అగ్రహంతో నినాదాలు చేసిన కాంగ్రెస్.. ఒక దశలో సభలోని పోడియం వైపు దూసుకోచ్చే ప్రయత్నం చేశారు. అయితే వారిని మార్షల్స్ అడ్డకునే ప్రయత్నం చేయడంతో అగ్రహించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. వారిని వెనక్కు నెట్టి మరీ పోడియం వద్దకు వచ్చిన నిరసన కొనసాగిస్తూ నినాదాలు చేశారు.

ఈ క్రమంలో గీతారెడ్డి బడ్జట్ ప్రతులను చించివేసి.. పోడియం వైపు విసిరారు. అదే సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితర సభ్యులు మైకులు విరిచేసి, హెడ్ సెట్లను తీసి పోడియం వైపు విసరారు. అయితే అనూహ్యంగా ఒక హెడ్ సెట్ గవర్నర్ పక్కనే కూర్చుని వున్న శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి తగిలింది. దీంతో గాయపడిన స్వామిగౌడ్ ను హుటాహుటిన సరోజినీ దేవి కంటి అస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు అసెంబ్లీ సిబ్బంది. ఈ దాడిని తీవ్రంగా పరిగణిస్తున్న కేసీఆర్ సర్కారు.. దీనిపై సీరియస్ గా వ్యవహరించాలని భావిస్తున్నట్లు సమాచారం.

కాగా, గవర్నర్ నరసింహన్ ప్రసంగం ముగిసిన తరువాత కూడా కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేస్తూ అసెంబ్లీలోనే చాలాసేపు ఉండిపోయారు. ఈ ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసిందని, అవినీతిమయమైందని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఇదిలావుండగా, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటే తీవ్ర చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ హెచ్చరికలు జారీచేసినా.. కాంగ్రెస్ సభ్యులు గందరగోళం సృష్టించారని, ఏకంగా మండలి చైర్మన్ వైపుకు మైక్ సెట్ విసిరి గాయపర్చారని.. దీంతో అసెంబ్లీ ఫూటేజీని పరిశీలించిన కేసీఆర్ సర్కార్.. వారిపై మంగళవారం అసెంబ్లీలో చర్యలు తీసుకుని సభ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Pawan kalyan about ttd and ruby diamond controversy

  శ్రీవారి ఆభరణాలు, టీటీడీపై జనసేనాని ఏమన్నారంటే..

  Jun 21 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. టీడీపీ సర్కార్ ప్రజలకు రక్షణదారుగా కాకుండా భూఆక్రమణదారుగా వ్యవహరిస్తుందని వరుస విమర్శలతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో... Read more

 • Ktr salutes fan for his love with emoji in a tweet

  అభిమానికి కేటీఆర్ వందనం.. అభిమానానికి ఫిదా.!

  Jun 21 | సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుండే తెలంగాణ ఐటీ, మునిసిపల్ శాఖల మంత్రి కేటీఆర్ తాజాగా ఓ అభిమాని చేసిన పనికి ఫిదా అయ్యాడు. ఏకంగా ట్విట్టర్ వేదికగా ఆయనకు వందనం చేస్తున్నట్లు నమస్కార... Read more

 • Mp cm says ajay singh allegations are height of cheapness

  కుమారులపై మాజీ సీఎం భార్య పిర్యాదు.. పోలీసు కేసు..

  Jun 21 | కన్నతల్లిని వేధించారన్న అరోపణలపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత అర్జున్ సింగ్ కుమారుడు అజయ్ సింగ్ పై పోలీసు కేసు నమోదైంది. తన తల్లిని వేధించడంతో పాటు అమెను ఇంటి నుంచి గెంటివేయించారని అర్జున్... Read more

 • Number missing in indonesia ferry disaster jumps again to 192

  ఇండోనేషియాలో పడవ ప్రమాదం.. 192 మంది గల్లంతు..

  Jun 21 | ఇండోనేషియాలో సంభవించిన పెను ప్రమాదంలో గల్లంతైన వారి సంఖ్య 192కు చేరింది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు స్వయంగా ప్రకటించారు. సుమత్రా దీవిలోని పర్యాటక కేంద్రమైన తోబా సరస్సులో సోమవారం జరిగిన పడవ ప్రమాదంలో... Read more

 • No change in petrol and diesel prices even if falls under gst

  ఇంధనాన్ని జీఎస్టీ ఊరిస్తున్నా.. ఉరట మాత్రం కల్ల..?

  Jun 20 | పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డు స్థాయిని అందుకుని అల్ టైం హైలో కొనసాగిన నేపథ్యంలో కానీ లేక వరుసగా పెట్రో ధరలు పెరుగుతున్న క్రమంలో కానీ కేంద్ర ఇంధన శాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన్... Read more

Today on Telugu Wishesh