Five trekkers killed as fires engulf forests in TN పెను విషాదం: ఐదగురిని బలితీసుకున్న కార్చిచ్చు..

Five trekkers killed as fires engulf forests in tamil nadu

Forest Fire Tamil Nadu, Students Trapped In Forest Fire, Theni District, IAF Relief Operations, Kurengini Hills Fire, Students Rescued, Nirmala Sitharaman, Fire, Tamil Nadu, Theni, Theni Trek, Tamil Nadu forest fire, Tamil Nadu Trekkers, Trekkers killed

Tragedy struck a group of trekkers in southern Tamil Nadu, as forest fires killed at least five girls and left many others injured in Kolukkumalai area close to Kurangini in Theni district.

పర్వతరోహకులను బలితీసుకున్న కార్చిచ్చు.. పెను విషాదం

Posted: 03/12/2018 11:08 AM IST
Five trekkers killed as fires engulf forests in tamil nadu

వీకెండ్ లో స్నేహితులతో కలసి పర్వత రోహణ చేసేందుకు వెళ్లిన విద్యార్థుల బృందంలో పెను విషాదం అలుముకుంది. తమిళనాడులోని తేని జిల్లా కురంగణి ప్రాంతంలో పర్వతారోహణ శిక్షణ కోసం విద్యార్థుల బృందంలోని ఐదుగురిని కార్చిచ్చు బలితీసుకుంది. అప్పటి వరకు ఎంతో అహ్లాదంగా, అనందంగా గడిపిన విద్యార్థులను అకస్మాత్తుంగా కార్చిచ్చు చుట్టుముట్టే సరికి.. ఒక్కసారిగా హాహాకారాలు అకాశానంటాయి. మంటలను గమనించిన విద్యార్థులు పలువురు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లగా, మరికోందరు ఘటనపై స్థానిక అధికారులు సమాచారం అందించారు.

దీంతో రంగంలోకి దిగిన రెస్కూ సిబ్బంది హెలికాప్టర్ సాయంతో 15 మంది విద్యార్థులను రక్షించింది. కాగా శరవేగంగా వ్యాపించిన మంటలకు ఐదుగురు విద్యార్థినులు అగ్నికి ఆహుతయ్యారు. మున్నార్ ప్రాంతంలోని సూర్యనెల్లికి చెందిన 37 మంది విద్యార్థినులు రెండు బృందాలుగా తేని జిల్లా కురంగణి అటవీ ప్రాంతంలో పర్వతరోహణకు వచ్చారు. వారు ట్రెక్కింగ్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా కార్చిచ్చు రేగడంతో వారంతా మంటల్లో చిక్కుకున్నారు. కాగా, ఈ ప్రాంతంలో వెలుతురు తక్కువగా ఉండడంతో సహాయ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడినట్టు మదురై సర్కిల్ కన్జర్వేటర్ ఆర్కే జగేనియా తెలిపారు.

మంటలు వేగంగా నలువైపులా వ్యాపిస్తుండడంతో అటవీ సిబ్బంది, సమీప గ్రామాల ప్రజలు అక్కడికి చేరుకుని సహాయ చర్యల్లో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్, రెవిన్యూ శాఖ ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి వారు తిరిగి బోధి చేరుకుని చెన్నైకి తిరుగు ప్రయాణం కావాల్సి ఉండగా అంతలోనే ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం ట్రెక్కింగ్ ప్రారంభం కాగా శనివారం కేరళవైపు అడవుల్లోకి చేరుకున్నారు. ఆదివారం కురంగణి నుంచి విద్యార్థులు ట్రెక్కింగ్ ప్రారంభించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Fire  Tamil Nadu  Theni  Theni Trek  Tamil Nadu forest fire  Tamil Nadu Trekkers  Trekkers killed  

Other Articles