Actress lashes out at chennai traffic police యమకింకరులను తలపిస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. నటి ఫైర్

Actress lashes out at chennai traffic police after pregnant s death

Gayatri Sai, actress gayatri sai, kollywood actress gayatri sai, mani ratnams heroine, anjali actress, chennai traffic police, social media, viral news

Actress and Chennai citizen Gayatri Sai, who was seen in films like Mani Ratnam’s Anjali, seems to be unhappy with a recent run-in with the traffic policemen of the city. Highlighting a recent encounter that she had with the cops who demanded money for no mistake of hers, she took to her social media handle and posted about the issue

యమకింకరులను తలపిస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. నటి ఫైర్

Posted: 03/12/2018 10:54 AM IST
Actress lashes out at chennai traffic police after pregnant s death

తమిళనాడు ట్రాఫిక్ పోలీసులంటే.. అక్కడి ప్రజల్లో భయాందోళన రేకెత్తుంది. హెల్మెట్ ధరించకుండా వెళ్తున్న యువకులపై లాఠీలతో కొట్టిన గాయపర్చిన ఘటన మర్చిపోకముందే... రెండు రోజుల క్రితం హెల్మెట్ ధరించలేదని ఓ గర్భిణి మహిళతో పాటు వెళ్లున్న అమె భర్తను వెంబడించి.. వారు ప్రమాదానికి గురైయ్యేలా చేసి.. చివరకు గర్బిణి స్త్రీని పోట్టనబెట్టుకున్నారు. అయితే ఇలాంటి ఘటనలపై అక్కడి ప్రభుత్వం కూడా కేవలం స్పెన్సెన్షన్ చర్యలకు మాత్రమే ఉపక్రమించడంతో.. దాంతో వారు మరో వారంలోనో.. లేక పక్షంలోనే మళ్లి విధుల్లో చేరి తమ నిరంకుశ పంథాను కొనసాగిస్తున్నారు.

తమ అతిచర్యల వల్ల అమాయకులు ప్రాణాలు మంటగలుస్తున్నాయన్న విషయాన్ని తెలుసుకున్న తరువాత కూడా వారిలో కించిత్ మార్పు కూడా కానరావడం లేదు. తాము తలచుకుంటే ఏమైనా చేస్తామన్నట్లుగా ట్రాఫిక్ పోలీసులు తీరు కొనసాగుతుంది. తాజాగా చెన్నై ట్రాఫిక్ పోలీసుల తీరుపై సినీ నటి సాయి గాయిత్రి కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను ట్రాఫిక్ రూల్స్ పాటించినప్పటికీ.. అకారణంగా పోలీసులు తనను అపి డబ్బులు డిమాండ్ చేశారని ఫైర్ అయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

చెన్నైలో ఇంటి నుంచి బయటకు వెళ్తున్న సమయంలో కారణం లేకుండా ట్రాఫిక్ కానిస్టేబుల్ తన కారును ఆపారని సాయి గాయత్రి తెలిపింది. సిగ్నల్ క్రాస్ చేశావంటూ 300 రూపాయలు డిమాండ్ చేశారని పేర్కొంది. దీంతో తాను ‘మీ పేరు చెప్పండి’ అని అడగడంతో ‘సర్లే 100 ఇవ్వు’ అని డిమాండ్ చేశారని తెలిపింది. దీంతో మళ్లీ తాను ‘నీ పేరేంటో చెప్పు’ అని అడగడంతో ‘మీరెవరు మేడమ్’ అని అడిగాడని చెప్పింది. ‘కారణం లేకుండా వేధింపులకు గురవుతున్న చెన్నై పౌరురాలిన’ని తాను చెప్పడంతో క్షమించమని చెప్పి వెళ్లమన్నాడని సాయి గాయిత్రి తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles