PM modi snubbing LK Advani at public event goes viral అద్వానీపై ప్రతీకారం తీర్చుకున్న ప్రధాని మోడీ.?

Pm modi snubbing lk advani at public event goes viral

advani, modi, tripura, bilap dev hyderabad news, india news, social news, latest news

Prime Minister Narendra Modi and several other senior BJP leaders including LK Advani, Murli Manohar Joshi, party president Amit Shah had participated in the swearing-in ceremony of Biplab Deb as Tripura Chief Minister.

ITEMVIDEOS: అగ్రనేత అద్వానీపై ప్రతీకారం తీర్చుకున్న ప్రధాని మోడీ.?

Posted: 03/10/2018 05:31 PM IST
Pm modi snubbing lk advani at public event goes viral

రోజులు మారినప్పుడు ఎంతటి దిగ్గజాలైనా సర్దుకుపోవడం తప్పదేమో? బీజేపీకి ఒకప్పుడు అన్నీ తానే అయిన పార్టీ కురువృద్ధుడు ఎల్.కె.అద్వానీకి తాజాగా ఇలాంటి అనుభవమే ఎదురైంది. త్రిపుర కొత్త సీఎంగా విప్లవ్ కుమార్ దేవ్ శుక్రవారంనాడు ప్రమాణస్వీకార కార్యక్రమం ఇందుకు వేదిక అయింది. ప్రధాని మోదీ స్వయంగా పాల్గొన్న ఈ వేడుకకు పార్టీ దిగ్గజాలు అద్వానీ, మురళీ మనోహర్ జోషి, త్రిపుర మాజీ సీఎం మానిక్ సర్కార్ తదితరులు హాజరయ్యారు.
 
ఎంతవాడు కానీ ప్రేమానురాగాలకు, పగ ప్రతీకారాలకు అతీతుడు కాదన్న విషయం ఈ ఘటనతో స్పష్టమైంది. బీజేపి కురువృద్ద నేత ఎల్కే అద్వానీపై.. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతీకారం తీర్చుకున్నారు. అదేంటి అంటారా..? నిజమండీ..? ప్రధానికి అద్వానీ అంటే సాక్షత్తు గురువుతో సమానమని స్వయంగా ఆయనే సార్వత్రిక ఎన్నికలకు ముందు పలు సందర్భాలలో ప్రకటించినా.. ప్రస్తుతం మాత్రం గురువును మించిన శిష్యుడు కావడంతో.. ఆయన చేసిన చర్యలకు ఇప్పుడు ప్రధాని మోడీ పదిమందిలో ప్రతీకారం తీర్చుకుంటున్నారు. అదేంటో అర్థం కాలేదుగా,.

వివరాల్లోకి వెళ్తే.. అగర్తలాలో ప్రధాని నరేంద్రమోడీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గోనందుకు స్టేజ్ పైకి రాగానే ఆయనకు స్వాగతం పలికేందుకు అందరూ లేచి నిలబడ్డారు. అందరి నమస్కారాలకూ ప్రతి నమస్కారంతో స్పందిస్తూ వచ్చిన మోదీ....అద్వానీ నమస్కారం చేసినప్పటికీ ఆయన వైపు కన్నెత్తి కూడా చూడకుండా విసవిసా వెళ్లిపోయారు. అయితే అద్వానీ పక్కనే ఉన్న మాజీ ముఖ్యమంత్రి మానిక్ సర్కార్ తో మాత్రం పలు నిమిషాల పాటు నవ్వుతూ కరచాలనం చేశారు. బీజేపి పార్టీకి పెద్దదిక్కుగా వున్న కురువృద్ద నేత అద్వానీని పట్టించుకోకపోవడంపై పలువురు నెటిజన్లు స్పందించారు. కొందరు బాహాటంగానే ఎండగట్టారు.

తన రాజకీయ గురువునే మోదీ అవమానించడం ఆయన 'దురహంకారాన్ని' చాటుతుందని కొందరు విమర్శించగా, గతంలో అద్వానీ ప్రసంగాల సమయంలో మోదీ మైక్రోఫోన్ పట్టుకున్న ఫోటోను మరో నెటిజిన్ పోస్ట్ చేశారు. అయితే మోదీ ఇలా ఎందుకు చేశాడా..? అంటే సరిగ్గా ఐదేళ్ల క్రితం మధ్యప్రదేశ్ ఎన్నికల సమయంలో జరిగిన పరాభావానికి ఇది ప్రతీకారమని పలువురు అంటున్నారు. అప్పటికే బీజేపి ప్రధాని అభ్యర్థిగా ఖరారైన మోడీ.. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గోన్న సందర్భంగా వేదికపై వున్న అద్వానినీ చూసి కాళ్లకు నమస్కరించగా, దానిని అద్వానీ లక్ష పెట్టలేదు.

అయితే అందుకు ప్రతీకారంగానే ఇప్పుడు మోడీ కూడా ఈ చర్యలకు పాల్పడ్డారని పలువురు అంటున్నారు. అయితే అద్వానీ లాంటి నేత ప్రధాని పదవిపై అశపడిన నేపథ్యంలో మధ్యలో వచ్చి పదవిని తన్నుకుపోయిన మోదీపై అద్వానికి కొంత కోపం వుంటటం సహజమని, కానీ ప్రధాని మాత్రం ఇలా గురువును పట్టించుకోకుండా పరాభవించి.. దేశానికి ఎం సందేశమిస్తారని పలువురు నెట్ జనులు ప్రశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : advani  modi  tripura  bilap dev hyderabad news  india news  social news  latest news  

Other Articles

Today on Telugu Wishesh