allari naresh heroine makes man arrest అల్లరి నరేష్ హీరోయినంటే కామెడీయా..? ఇది చూడండీ..

Allari naresh heroine makes man arrest for urinating on her car

allari naresh heroine police complaint, gujarati actress police complaint, tollywood actress police complaint, actress, heroine, Payal, Monal Gajjar, Kamlesh Patel, Gulbai Tekra, Gujarat University, allari naresh, tollywood, crime

allari naresh heroine makes a man kamlesh patel arrest for uriniating on her car tyre at a shoping comples in gulbai tekra of ahmedadbad

ITEMVIDEOS: అల్లరి నరేష్ హీరోయిన్ అంటే మజాకా.? కటకటాలు లెక్కెట్టాల్సిందే

Posted: 03/10/2018 02:24 PM IST
Allari naresh heroine makes man arrest for urinating on her car

తెలుగు చిత్రసీమలో కమేడియన్ హీరోగా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్.. అటు తాను నటించిన పలు యాక్షన్ చిత్రాలలో కూడా విభిన్నమైన పాత్రను పోషించి ప్రేక్షకుల హృదయాలను నిలిచిపోయాడు. నటకిరీటి రాజేంద్రప్రసాద్ నుంచి హస్యవారసత్వాన్ని పునికిపుచ్చుకున్న నరేష్.. ఈ మధ్య సరైన కథలను ఎంపిక చేసుకోవడంలో తడబాడుకు గురవుతున్నాడు. ఈ విషయాన్ని పక్కన బెడితే నరేష్ సరసన సుడిగాడు, బ్రదర్ అఫ్ బొమ్మాళి చిత్రాలలో నటించిన మోనల్ గజ్జర్ తాను చిత్రాలలోనే హస్యాన్ని పండిస్తాను తప్ప.. బయట ఎలాంటి చిన్న తప్పు జరిగినా సహించనని చెప్పకనే చెబుతుంది.

సరిగ్గా మహిళ దినోత్సవం రోజున అహ్మదాబాద్ లో శివారల్లోని గుల్ బాయ్ తెక్రీ ప్రాంతంలో గల ఓ షాపింగ్ మాల్ లో తన సోదరి పాయల్ నిర్వహించే బ్యూటీ పార్లర్ కు వెళ్లింది. తీరా బయటకు వస్తున్న వేళ, బయట పార్క్ చేసిన కారుపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేయడాన్ని చూసింది. వద్దని వారిస్తున్నా వినకుండా సదరు వ్యక్తి తన పని పూర్తి చేశాడు. దీంతో తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేసిన గుజ్జర్.. అతనితో వాగ్వాదానికి దిగింది. అయితే సదరు వ్యక్తి కూడా అమెకు ధీటుగానే బదులిస్తూ అసభ్యపదజాలాన్ని వినియోగించాడు.

దీంతో చేసేది లేక సదరు వ్యక్తిపై పోలీసులకు పిర్యాదు చేసింది. దీంతో రెండు రోజులు పాటు దర్యాప్తు జరిపిన పోలీసులు అతన్ని ఇవాళ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే నటి పిర్యాదు చేసిన రోజునే కేసు నమోదు చేసిన పోలీసులు సదరు వ్యక్తి స్థానిక కాంప్లెక్స్ లో స్టేషనరీ దుకాణాన్ని నిర్వహిస్తాడని తెలిపారు. దీంతో కమలేష్ పై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 110, 117, 294 (బీ) కింద కేసు రిజిస్టర్ చేసి న్యాయస్థానంలో హజరుపర్చారు. కాగా, షాపింగ్ కాంప్లెక్స్ లోని టాయిలెట్లు పనిచేయకపోవడంతోనే ఖాళీగా ఉన్న స్థలంలో తాను మూత్రవిసర్జన చేశాడనని విచారణలో కమలేష్ చెప్పడం గమనార్హం.

Gujarat university police arrest Kamlesh Patel who abused to @Gajjarmonal on last night when she asking him when pee on road side. Police take strict action against him .@ahmedabadmirror @ahmedabadpolice @AbadDailyNews pic.twitter.com/tSirwW73rC

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kamlesh Patel  Monal Gajjar  tollywood  heroine  gujarati  actress  ahmedabad  crime  

Other Articles

 • Ex jd lakshmi narayana resigns rumours on joining janasena

  జనసేనలోకి లక్ష్మీనారాయణ.. పదవికి రాజీనామా..

  Mar 22 | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదా కోసం రాష్ట్రంలో ఓ వైపు అలజడి రగలిస్తున్న సమయంలో తన రాష్ట్రం కోసం ఏదైనా చేయాలన్న సంకల్పమున్న వ్యక్తి, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, మహారాష్ట్ర అదనపు డీజీగా వున్న... Read more

 • Actor sivaji explodes sensational news on bjp

  ITEMVIDEOS: బీజేపిపై నటుడు శివాజీ సంచలన అరోపణలు..

  Mar 22 | సినీహీరో శివాజీ బీజేపి పేరు ఎత్తకుండా ఆ పార్టీపై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా తామే అధికారంలో వుండేలా ఎక్కడికక్కడ అపరేషన్ చేపడుతున్నారని, ఇందుకు వేల కోట్ల రూపాయలను కూడా ఖర్చపెడుతున్నారని అరోపించారు.... Read more

 • Lok sabha adjourned for 5th day without discussion on no trust motion

  డైలీ సీరియల్ ను తలపిస్తున్న అవిశ్వాస ఎపిసోడ్

  Mar 22 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడంతో పాటు విభజన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై అధికార టీడీపీ, విపక్ష టీడీపీ పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాణం డైలీసీరియల్ ఎపిసోడ్... Read more

 • Giant billboard shows porn in makati city centre

  ఔవ్వ.! బిల్ బోర్డుపై అరనిమిషం పాటు.. బూతు వీడియో..

  Mar 22 | దేశరాజధానిగా బాసిల్లుతున్న నగరం.. నిత్యం రద్దీగా వుండే ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. రోడ్డుపై వెళ్లే ప్రయాణికులకు సూచనలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన పెద్దని బిల్ బోర్డులలో ప్రసారమైన అసభ్యకర, అశ్లీల దృశ్యాలే ఇందుకు... Read more

 • Cabinet clears ayushman bharat national health protection mission

  ‘‘ఆయుష్మాన్ భారత్’’ తొలి అడుగేసిన మోడీ సర్కార్..!

  Mar 22 | పేద ప్రజలకు ఉచిత ఆరోగ్యబీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించిన నరేంద్రమోడీ ప్రభుత్వం అదిశగా తొలి అడుగు వేసింది. పేద ప్రజలకు అందించే ఉచిత అరోగ్య బీమా పథకాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు... Read more

Today on Telugu Wishesh