railway underground bridge constructed in record time 4 గంట్లలో.. అండర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి.. ఇదీ రైల్వే ఘనత..

Scr railway officials constructed railway underground bridge in record time

south central railway record, underground railway bridge, masaipet tragedy, nanded passenger hit school bus, veldurthi railway bridge, medak railway bridge, record time railway bridge construction, south central railway, under ground bridge, masaipet, veldurthy, medak, telanagana

Its the dedication, sincere efforts of south central railway officials who has taken up the task of railway under ground bridge at masaipet village railway crossing of velduthi mandal in medak district, where 16 school childredn had lost their lifes at unmanned crossing, in record time of just four hours.

4 గంట్లలో.. అండర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి.. ఇదీ రైల్వే ఘనత..

Posted: 03/10/2018 12:31 PM IST
Scr railway officials constructed railway underground bridge in record time

మన ఘనకీర్తిని చాటుకోవడంలో మనం వేస్తున్న వెనుకంజ కారణంగా.. ప్రపంచలో అనేక విషయాలను తామే ముందుగా కనుగొన్నామని విదేశాల శాస్త్రవేత్తలు గొప్పలకు పోతుంటే ఔరా నిజమేనా అని నోళ్లు వెళ్లబెట్టడం తప్ప మరేం చేయడం లేద మనం. అయితే భూమికి సూర్యుడికి వున్న దూరాన్ని తులసీదాసు తన హనుమాన్ చాలిసీలో చెప్పినా.. దానిని హిందువులు పఠించినా.. అది చాలీసాలో భాగమనే అనుకుంటున్నారు తప్ప.. ఒక్కసారి దానిని విషదీకరించుకుని చూస్తే.. పరదేశ శాస్త్రవేత్తలు మనకన్నా ఎంత వెనుకబడ్డారో తెలిసిపోతుంది.

ఇక చైనావాళ్లు కేవలం 24 గంటల్లో వంతెన నిర్మాణం చేశారని.. సింగపూర్ వాళ్లు మరోలా చేశారని ఘనకీర్తిని చాటుకోవడంతో వినడం మాత్రమే మనవంతుగా మిగులుతున్న తరుణంలో మనమేమి తక్కువ కాదనన్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కూడా తమ పనితో ఘనతను సాధించారు. అయితే ఉర్థూలో సామెత చెప్పినట్లు ఘర్ కా ముర్గీ దాల్ బరాబర్.. అన్నట్లు మనవాళ్ల ఘనతను మనమే ప్రచారం చేసుకోవడంలో విఫలం అవుతున్నాం. ఈ ఘనతను జాతీయ, దేశీయ మీడియా పెద్ద పెద్ద అక్షరాలతో చూపడంలో శ్రద్ద చూపడం లేదు. అయితేనేం మన రైల్వే అధికారులు మాత్రం నాలుగు గంటల వ్యవధిలో అండర్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేశారు.

మెద‌క్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద ఘనత చోటుచేసుకుంది. ఇందుకోసం రైల్వే అధికారులు 1.65 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ సందర్భంగా రైల్వే అధికారులు, సిబ్బందికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. నాలుగేళ్ల క్రితం 2014 జూలై 24న రైలు ప్రమాదంలో 16 మంది చిన్నారులు ప్రయాణిస్తున్న బస్సును వేగంగా వచ్చిన నాందేడ్ ప్యాసింజర్ రైలు ఢీకోనడంతో.. ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఇంకా ఇక్కడి వారి గుండెలను గాయపరుస్తూనే వుంది.

ఈ నేపథ్యంలో వంతెన నిర్మాణం పనులు చేపట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే ఇంజనీర్ మోతిలాల్ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిల చొరవతో అండర్ గ్రౌండ్ వంతెన పూర్తయిందని హర్షం వ్యక్తం చేశారు. దీంతో స్థానికులు ఇకపై ఎలాంటి రైలు ప్రమాద అందోళన లేకుండా హాయిగా రాకపోకలు సాగించడానికి వీలు కల్పించబడినట్లైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : south central railway  under ground bridge  masaipet  veldurthy  medak  telanagana  

Other Articles

 • Pawan kalyan about ttd and ruby diamond controversy

  శ్రీవారి ఆభరణాలు, టీటీడీపై జనసేనాని ఏమన్నారంటే..

  Jun 21 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. టీడీపీ సర్కార్ ప్రజలకు రక్షణదారుగా కాకుండా భూఆక్రమణదారుగా వ్యవహరిస్తుందని వరుస విమర్శలతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో... Read more

 • Ktr salutes fan for his love with emoji in a tweet

  అభిమానికి కేటీఆర్ వందనం.. అభిమానానికి ఫిదా.!

  Jun 21 | సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుండే తెలంగాణ ఐటీ, మునిసిపల్ శాఖల మంత్రి కేటీఆర్ తాజాగా ఓ అభిమాని చేసిన పనికి ఫిదా అయ్యాడు. ఏకంగా ట్విట్టర్ వేదికగా ఆయనకు వందనం చేస్తున్నట్లు నమస్కార... Read more

 • Mp cm says ajay singh allegations are height of cheapness

  కుమారులపై మాజీ సీఎం భార్య పిర్యాదు.. పోలీసు కేసు..

  Jun 21 | కన్నతల్లిని వేధించారన్న అరోపణలపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత అర్జున్ సింగ్ కుమారుడు అజయ్ సింగ్ పై పోలీసు కేసు నమోదైంది. తన తల్లిని వేధించడంతో పాటు అమెను ఇంటి నుంచి గెంటివేయించారని అర్జున్... Read more

 • Number missing in indonesia ferry disaster jumps again to 192

  ఇండోనేషియాలో పడవ ప్రమాదం.. 192 మంది గల్లంతు..

  Jun 21 | ఇండోనేషియాలో సంభవించిన పెను ప్రమాదంలో గల్లంతైన వారి సంఖ్య 192కు చేరింది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు స్వయంగా ప్రకటించారు. సుమత్రా దీవిలోని పర్యాటక కేంద్రమైన తోబా సరస్సులో సోమవారం జరిగిన పడవ ప్రమాదంలో... Read more

 • No change in petrol and diesel prices even if falls under gst

  ఇంధనాన్ని జీఎస్టీ ఊరిస్తున్నా.. ఉరట మాత్రం కల్ల..?

  Jun 20 | పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డు స్థాయిని అందుకుని అల్ టైం హైలో కొనసాగిన నేపథ్యంలో కానీ లేక వరుసగా పెట్రో ధరలు పెరుగుతున్న క్రమంలో కానీ కేంద్ర ఇంధన శాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన్... Read more

Today on Telugu Wishesh