Horrific moment lion pounces on girl and tries to attack ITEMVIDEOS: అమ్మాయిపై పంజా విసిరిన మృగరాజు..

Horrific moment lion pounces on girl and tries to attack

lion attacks girl child, children in lion enclosure, saudi girl in lion enclosure, jeddah festival in saudi, children lion jeddah, lion, children, girl child, lion enclosure, festival, jeddah, horriffic incident in saudi, viral video, video viral

Horrifying moment a girl is attacked by a lion after dozens of children are allowed into its cage in Saudi Arabia and the animal goes wild Children had entered lion enclosure during festival in Jeddah, Saudi Arabia.

ITEMVIDEOS: అమ్మాయిపై పంజా విసిరిన మృగరాజు..

Posted: 03/10/2018 10:35 AM IST
Horrific moment lion pounces on girl and tries to attack

పవిత్రమైన పండగ పర్వదినాన ఓ చిన్నారికి భయానక అనుభవం ఎదురైంది. పిల్లలో వన్యజీవులంటూ భయం లేకుండా చేసేందుకు సౌదీ అరేబియాలోని జిద్దా పండగ పర్వదినం రోజున ప్రత్యేకమైన ఏర్పాట్లు, కట్టుదిట్టమైన భద్రతల నడుమ విద్యార్ధులను.. ఎన్ క్లోజర్ల మధ్య స్వేచ్చగా వుండే వన్యప్రాణుల మధ్యకు పంపుతారు. ఈ ఎన్ క్లోజర్లలో సింహాలు, పులులను ప్రదర్శనకు పెడతారు. దీంతో వాటిని చూసేందుకు పిల్లలు అధిక సంఖ్యలో వచ్చి తమ ముచ్చట తీర్చకుంటారు.

ఇలా ఓ సింహాన్ని చూసి ముచ్చటపడి దానిచుట్టూ తిరిగి విసుగు తెప్పించిన ఓ చిన్నారిపై ఆ సింహానికి కోపం వచ్చినట్లువుంది. తనతనే చెలగాటాలు అడుకుంటారా అన్నట్లుగా అగ్రహంతో ఊగిపోయింది, అయినా తన ట్రైయినర్ తన పక్కనే వున్నాడన్న భయంతో కొంత సహనాన్ని ప్రదర్శించింది. అప్పటికే ఆ చిన్నారి ఊరుకోకుండా.. దాని వైపునకు రెండు చేతులూ చూపిస్తూ, అది ఏమీ చేయలేదన్నట్లుగా దానిని రెచ్చగొట్టింది.

ఇంకేముంది.. విసుగెత్తిపోయిన సింహం ఆ అమ్మాయిని పట్టుకుని, దాడి చేయబోయింది. దీంతో, అక్కడున్న పిల్లలంతా భయంతో వణికిపోయి కేకలు వేశారు. ఒక్కసారిగా అక్కడ భీతావాహ వాతావరణం అలుముకుంది. వెంటనే రంగంలోకి దిగిన ట్రైనర్ ఆ సింహాన్ని పక్కకు లాగడంతో ప్రమాదం తప్పింది. ఆ పిల్లలను ఎన్‌క్లోజర్‌లోకి పంపిన ట్రైనర్‌ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను మీరూ చూడండి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lion  children  girl child  lion enclosure  festival  jeddah  viral video  video viral  

Other Articles