Topless protesters call for change duringWomen’s Day మహిళా దినోత్సవం రోజున.. మహిళల అర్థనగ్న అందోళనలు..

Topless protesters call for change during international women s day

Topless protesters call, protesters call for topless agitation, womens call for change, for change during, change during International womens day, International Womens day, spain, trending, viral videos

In Spain, women went on a nationwide strike and held hundreds of rallies, closing many main roads and squares. Their protests included marches at which they chanted slogans such as "we continue to fight regardless of the cost!" and "long live the women's struggle".

ITEMVIDEOS: మహిళా దినోత్సవం రోజున.. మహిళల అర్థనగ్న అందోళనలు..

Posted: 03/09/2018 12:01 PM IST
Topless protesters call for change during international women s day

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తమకు సంబంధించిన రోజని, ప్రపంచవ్యాప్తంగా మహిళలు సభలు, సమావేశాలతో ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకుంటున్న తరుణంలో.. స్పెయిన్ లో మాత్రం మహిళా సంఘాలు ఇదే రోజును పురస్కరించుకుని వినూత్న తరహాలో అందోళనకు దిగాయి. తమకు సమాన హక్కులు, విధులు, ఉద్యోగ, ఉపాది అవకాశాలు, సమాన వేతనాలు, సమాన షిప్టులు కల్పించాలని డిమాండ్ చేస్తూ స్పెయిన్ వ్యాప్తంగా మహిళా లోకాన్ని అందోళన బాట పట్టించాయి.

ఒకరు కాదు ఇద్దరు కాదు ఈ రెండు ప్రధాన మహిళా సంఘాల అధ్వర్యంలో ఏకంగా దేశవ్యాప్తంగా అందోళన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమాలలో భాగంగా అనేక వేల మంది అర్థనగ్నంగా అందోళనలో పాల్గోని తమ నిరసపను వ్యక్తం చేశారు. దీంతో అనేక కూడళ్లు ప్రధాన రహదారులు నిరసనకారులతో నిండిపోయాయి. మహిళల ఉద్యమం కొనసాగుతుంది.. అరునూరైనా ఓ మహిళా ఉద్యమించు.. మహిళల ఐక్యత వర్థిల్లాలి అంటూ నినాదాలు స్పెయిన్ వ్యాప్తంగా ప్రతిధ్వనించాయి.

ఈ మేరకు నిరసనకారులు టాప్ లెస్ గా రోడ్డపైకి వచ్చి ప్లకార్డులు చేతబట్టి వారిని ప్రదర్శిస్తూ రోడ్లపై ర్యాలీలు నిర్వహించారు. తమకు కూడా పురుషులతో పాటుగా సమాన హక్కులు కల్పించాలని స్పెయిన్ లోని మహిళా లోకం.. తమ రెండు ప్రధాన మహిళా సంఘాల అధ్వర్యంలో గత కొన్ని దశాబ్దాలుగా ఉద్యమిస్తున్నారు. అయితే వారి ఉద్యమాలను అక్కడి ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అణిచివేస్తున్న క్రమంలో మహిళాదినోత్సవాన్ని పరుస్కరించుకుని వినూత్నంగా అర్థనగ్న అందోళనకు మహిళలు నడుంచుట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles