Atheist Kamal Follows Subha Muhurtham for Party Launch | నాస్తికుడైన కమల్.. పార్టీ ప్రారంభం కోసం ఏం చేశాడంటే...

Kamal follows muhurtham for party launch

Kamal Haasan, Political Party, Launched, Makkal Needhi Mayyam, Atheist, Muhurtham

Actor Kamal Haasan who is well Known as Actor now turns as Politician. He is Atheist but, Follows Muhurtham for Party Launch recently.

కమల్ అలాంటివి అస్సలు నమ్మడు, కానీ...

Posted: 02/22/2018 06:05 PM IST
Kamal follows muhurtham for party launch

సొంత పార్టీతో దేశం చూపును తనవైపునకు తిప్పుకున్న నటుడు కమల్ హాసన్ మక్కళ్ నీది మయ్యమ్ పార్టీతో రాణించేందుకు సిద్ధమైపోయాడు. తాను జనంలోంచి వచ్చిన నేతను, తలైవాను కాదని.. జనాల్లో ఒకడినని మధురై నుంచి రాజకీయ శంఖం పూరించేశాడు. అయితే పీపుల్స్ జస్టిస్ పార్టీ ద్వారా బరిలోకి దిగిన ఆయన పక్కా ముహూర్తం ప్రకారమే రంగంలోకి దూకారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

కమల్ నిజానికి నాస్తికుడు. పైగా ద్రవిడ సిద్ధాంతాలను తూచా తప్పకుండా పాటిస్తానని ప్రకటించారు కూడా. దేవుళ్లు, ముహూర్తాలపై ఏమాత్రం నమ్మకం లేని ఆయన పార్టీని మాత్రం శుభముహూర్తం ప్రకారమే ప్రకటించినట్టు తెలుస్తోంది. కమల్ బుధవారం పార్టీని ప్రకటించినప్పుడు భరణి నక్షత్రం ఉంది. ఆ నక్షత్రంలో పుట్టినవారు ధరణిని ఏలుతారన్నది తమిళుల విశ్వాసం.

ఇక కమల్ కూడా దీనిని విశ్వసించే ఆ నక్షత్రంలో ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. దీనికి తోడు బుధవారం తిథి షష్టి కూడా ఆయనకు కలిసి వచ్చిందంటున్నారు. ఈ రెండూ సరిగ్గా కుదరడం వల్లే కమల్ తన పార్టీ ప్రకటనకు బుధవారాన్ని ఎంచుకున్నారని అంటున్నారు. ఏది ఏమైనా కమల్ చేసిన ఈ పని గురించే ఇప్పుడు చర్చించుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles