JanaSena Condemns Attack on Mahaa News Staff | మహాన్యూస్ సిబ్బంది పై దాడి.. స్పందించిన పవన్

Pawan condemns attack on media

JanaSena Party, Pawan Kalyan, Mahaa News Attack, Press Note, CPI Rama Krishna, Pawan Kalyan on Media Attack, JanaSena on Media Attack

Pawan Kalyan Condemns Attack on Mahaa News Channel Staff. In a statement Pawan says attack was Undemocratic. Apart that CPI Rama Krishna Met Pawan in JanaSena Office.

మీడియాపై దాడి.. ఖండించిన పవన్

Posted: 02/22/2018 04:06 PM IST
Pawan condemns attack on media

మీడియాపై దాడిని అప్రజాస్వామిక చర్యగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. ప్ర‌ముఖ తెలుగు న్యూస్ ఛానెల్ మ‌హాన్యూస్ సిబ్బంది, వాహనాలపై విజయనగరంలో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిని ఖండిస్తూ పవన్ కల్యాణ్ ప్రెస్‌నోట్ విడుదల చేశారు.

'మహాన్యూస్ చర్చ కార్యక్రమం నిర్వహిస్తోన్న సీఈవో మూర్తి, సిబ్బందిపై దాడికి ప్రయత్నించడాన్ని జనసేన పార్టీ ఖండిస్తోంది. మహా న్యూస్ వాహనాలను ధ్వంసం చేయడం అప్రజాస్వామికం. విజయనగరంలో జరిగిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ప్రజాస్వామ్యంలో ఇది మంచి పరిణామం కాదని, మీడియా స్వేచ్ఛను ప్రతి ఒక్కరు కాపాడాలని జనసేన విజ్ఞప్తి చేస్తోంది' అని పవన్ పేర్కొన్నారు.

పవన్ ను కలిసిన రామకృష్ణ

మరోవైపు సీపీఐ కార్యదర్శి కే రామకృష్ణ పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. జనసేన కార్యాలయంలో వీరిద్దరూ భేటీ అయి తాజా రాజకీయ పరిణామాల గురించి చర్చించుకున్నారు.
జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ (జేఎఫ్‌సీ) సమావేశం నిర్వహించిన అనంతరం జరిగిన వివిధ పరిణామాలపై పవన్‌తో రామకృష్ణ మాట్లాడారు. వచ్చేనెల 1న తాము గుంటూరులో నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశానికి రావాల్సిందిగా పవన్ కల్యాణ్‌ను రామకృష్ణ కోరారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles