Wife Saves Husband Life after Battle with Mob | భర్త ప్రాణాల కోసం కర్ర చేతబట్టిన భార్య.. వీడియో వైరల్

Woman saves husband life in haryana

Haryana, Yamuna Nagar, Wife Fight, Husband Life, Stick Fight, Viral Video, Haryana Wife Save Husband Life

Woman saves her husband who was being beaten up by a group of men in Haryana's Yamuna Nagar. Woman Stick Fight Video went Viral.

ITEMVIDEOS: భర్త కోసం మహిళ సాహసం

Posted: 02/22/2018 03:42 PM IST
Woman saves husband life in haryana

కొందరు దుండగులు తన భర్తను చంపేందుకు యత్నించారు. సాయం కోసం ఆమె ఆర్తనాదాలు చేసింది. కానీ, ఎవరూ స్పందించకపోవటంతో భార్యే నేరుగా రంగంలోకి దిగింది. హర్యానాలో చోటు చేసుకున్న ఘటన వివరాల్లోకి వెళ్లితే..

యమునా నగర్ లో కొందరు దుండగులు ఓ వ్యక్తిని కర్రలతో చితకబాదుతున్నారు. ఇంతలో అదిగమనించిన బాధితుడి భార్య ఆర్తనాదాలు చేసింది. ఎవరూ ముందుకు వచ్చే ధైర్యం చేయకపోవటంతో తానే కర్రలతో రంగంలోకి దిగింది. ఈ క్రమంలో వాళ్లు ఆమెపై కూడా దాడికి పాల్పడ్డారు.

అయినప్పటికీ చెక్కుచెదరకుండా ఆమె పోరాడి చివరకు వారిని పరిగెత్తించింది. భర్త స్పృహ కోల్పోగా.. అతని పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్ని రోజులుగా యూపీలో కూడా ఇలాంటి తరహా ఘటనే ఒకటి చోటు చేసుకుంది. భర్తపై దాడి చేస్తున్న వారిని అడ్డుకునేందుకు ఓ భార్య తుపాకీతో రంగంలోకి దిగి.. నిందితులను పరుగులు పెట్టించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles