Interest Tweets Between Kamal and KTR | కేటీఆర్ గారూ.. భవిష్యత్తులో మా కోసం కూడా కాస్త సమయం కేటాయించండి

Kamal invites ktr for party launch

Kamal Haasan, Minister KTR, Political Party Launch, Tweet Conversation,

Kamal Haasan Invites Telangana Minister KTR for Party Launch. But, KTR says he is unable to attend and wish him all the Best.

కేటీఆర్ కు కమల్ ఆహ్వానం

Posted: 02/21/2018 03:03 PM IST
Kamal invites ktr for party launch

తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలో ఆయనకు చేసే ట్వీట్లపై ఆయన స్పందించే దాఖలాలే ఎక్కువ. ఇదిలా ఉండగా తమిళనాడులో నేడు కమల్ హాసన్ రాజకీయ పార్టీ లాంఛ్ కు సంబంధించి సందడి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కేటీఆర్ ను కూడా ఆహ్వానించారు.

దీనికి కేటీఆర్ స్పందిస్తూ.. ఈ కార్యక్రమానికి తాను రాలేకపోతున్నానని, కొత్త ఇన్సింగ్స్ ప్రారంభించిన కమల్ కు అంతా మంచి జరగాలని ఆశిస్తున్నానని, నిజ జీవిత ‘నాయకుడు’ కూడా విజయవంతమవ్వాలని కోరుకుంటున్నానని కేటీఆర్ తన ట్వీట్ లో బదులు ఇచ్చారు. ఇందుకు స్పందించిన కమల్..‘థ్యాంక్యూ కేటీఆర్ జీ. మీ రాకను మిస్సవుతున్నాం. భవిష్యత్తులో జరిగే మా కార్యక్రమాలకు మీరు హాజరై వాటికి మరింత శోభను తీసుకు వస్తారని భావిస్తున్నా. ఎంతో బిజీగా ఉండే మీరు, దయచేసి మాకు కూడా కొంత సమయం కేటాయించండి’ అని కమల్ విజ్నప్తి చేశాడు.

కొత్త శకం కోసం తప్పకుండా అంటూ కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. కాగా, నేటి సాయంత్రం మధురలో జరగబోయే సభ కోసం ముఖ్యనేతలు తమిళనాడుకు చేరుకుంటుండటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles