Ready to die for AP Actor Sivaji on BJP Attack | కుక్కలాగా ఇల్లిల్లూ తిరిగా.. హోదా కోసం చావడానికి సిద్ధం : నటుడు శివాజీ

Bjp workers attack on actor sivaji

Actor Sivaji, AP Special Status, BJP Workers Attack, TV9 Live Show, Debate, Vijayawada, BJP Attack Sivaji

BJP Workers Attack on Actor Sivaji in a Live Debate over AP Special Status. After Attack Sivaji talks to Media. Ready to die for AP on Special Status Issue he added.

ITEMVIDEOS: హీరో శివాజీపై బీజేపీ కార్యకర్తల దాడి

Posted: 02/21/2018 11:07 AM IST
Bjp workers attack on actor sivaji

టాలీవుడ్ నటుడు, ప్రత్యేక హోదా ఉద్యమకారుడు శివాజీపై దాడి చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. విజయవాడలో మంగళవారం సాయంత్రం ఓ టీవీ చానల్ ఆధ్వర్యంలో జరిగిన చర్చలో హోదాపై ఆయన ప్రసంగిస్తుండగా.. ఒక్కసారిగా దూసుకొచ్చిన బీజేపీ కార్యకర్తలు ఆయనపై భౌతికదాడికి దిగారు. హోదా కోసం ఆయన గట్టిగా ప్రశ్నిస్తున్న వేళ, అక్కడే ఉన్న బీజేపీ నేతలు, కార్యకర్తల్లో అసహనం పెరగడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.

చర్చ సాగుతున్న వేళ "మోదీ జీరో... మోదీ జీరో" అంటూ శివాజీ నినాదాలు చేశారు. ఆ సమయంలో బీజేపీ కార్యకర్తలు కల్పించుకుని "శివాజీ డౌన్ డౌన్" అని నినాదాలు చేశారు. శివాజీ ఆగ్రహంతో ప్రజలు మిమ్మల్ని ఇంకా మాట్లాడనిస్తున్నారు. ఇంకా ఇదే పరిస్థితి ఉంటే తరిమి కొడతారని హెచ్చరించారు. ఆపై బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా శివాజీపై పడటంతో, అక్కడే ఉన్న ప్రజా సంఘాలు, ప్రజలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో బీజేపీ నేతలు రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారని కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పద్మ వ్యాఖ్యానించడంతో ఆమెపైనా దాడి ప్రయత్నం జరిగింది.

‘దాడులు చేసినా నా పోరాటం ఆగదు’

విభజనతో నష్టపోయిన ఏపీకి హోదా, రైల్వే జోన్ లతో పాటు పలు ఫ్యాక్టరీలు, విద్యాసంస్థలను తాము అధికారంలోకి వస్తే ఇస్తామని బీజేపీ చెప్పిన మాటలను నమ్మి 2014 ఎన్నికల్లో తాను ఆ పార్టీకి మద్దతిచ్చానని అన్నారు. "నాపై ఎగబడినా వెనక్కు పోయే మనిషిని కాను. నామీద జరిగే దాడి తెలుగువాడి మీద జరిగే దాడిగా గుర్తుంచుకోండి. ఇదే భారతీయ జనతా పార్టీ కోసం 2014లో కుక్కలాగా ఇల్లిల్లూ తిరిగి ఓట్లడిగా నేను. మోదీ మా ప్రాంతానికి ప్రత్యేక హోదా ఇచ్చి... ఈ రాష్ట్రాన్ని... (ఆ సమయంలో బీజేపీ కార్యకర్తలు మరోసారి ఆందోళనకు దిగారు) సోదరా... నేనూ బీజేపీలో ఉన్నవాడినే. ఆరోజు మీరెవరూ లేరు. ఇవాళ మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నారు. ఏమైనా చేయండి. నామీద దాడి చేయండి చంపండి. కానీ నా చావుకోసమైనా తెలుగువాళ్లంతా ఒక్కటై తిరగబడతారు" అని బీజేపీపై నిప్పులు చెరిగారు.

తాను మరణిస్తే, తనవంటివారు వంద మంది పుడతారని, వారి ఆగ్రహానికి బీజేపీ నాశనమవుతుందని హెచ్చరించారు. హోదాపై తన వాదనేంటో బీజేపీ నాయకులు తెలియజేయాలని, అంతే తప్ప ప్రశ్నించేవారిపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. గతంలో భారతీయ జనతా పార్టీకి ఇలా దాడులు చేసే సంస్కృతి లేదని, ఇప్పుడు కొత్తగా ఆ సంస్కృతిని తీసుకు వచ్చారని విమర్శించారు.

విజయవాడలో ఆర్ఎస్ఎస్ సోదరులతోనూ తనకు పరిచయాలు ఉన్నాయని, గతంలో ఎన్నడూ క్రమశిక్షణ తప్పని వారు ఇప్పుడు ఇలా ఎందుకు అసహనాన్ని పెంచుకుంటున్నారని ప్రశ్నించారు. ఇదా భారతీయ జనతా పార్టీ? ఇలాగేనా మీరు చేసేది? దమ్ముంటే, మీకు చేతనైతే బీజేపీ వాదనను ప్రజలకు వివరంగా చెప్పాలని, చెప్పలేకుంటే తప్పు ఒప్పుకోండని శివాజీ కోరుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles