cpi narayana fires on minister manikyala rao అమాత్యుడి వెంట్రుక వ్యాఖ్యలపై నారాయణ ఫైర్..

Cpi narayana fires on minister manikyala rao

narayana, cpi, national secretary, BJP, TDP, chandrababu, special status, special package, Manikyala Rao, tonsure, PM Modi, politics

CPI party national secretaty Narayana fires at BJP MLA and AP Minister Manikyala Rao for his comments comparing andhrites with hair.

ఐదు కోట్ల అంధ్రులను వెంట్రుకలతో పోల్చుతారా: నారాయణ ఫైర్

Posted: 02/20/2018 03:14 PM IST
Cpi narayana fires on minister manikyala rao

బీజేపీ నేత, ఆంధ్రప్రదేశ్ అమాత్యుడు పైడికొండల మాణిక్యాలరావు చేసిన సంచలన వ్యాఖ్యలు సిపీఐ జాతీయ కార్యదర్శి సభ్యుడు నారాయణ తిప్పికోట్లారు. ఐదు కోట్ల మంది అంధ్రులను అవమానించేలా అమాత్యులు వ్యాఖ్యానించడం ఆయనకు, ఆయన పదవకి హుందతనాన్ని తీసుకురాదని అన్నారు. రాష్ట్ర ప్రగతి కోసం ఓ వైపు అన్ని పార్టీలు ఏకం కావాల్సిన సమయంలో బీజేపి నేతగా మాత్రమే అలోచించే అమాత్యులు., స్వార్థ రాజకీయాల కోసం అభివృద్దిని పన్నంగా పెడతారా..? అని మండిపడ్డారు.

అంధ్రప్రదేశ్ వాసులను వెంట్రుకలతో పోల్చడం దారుణమని ఆయన తీవ్రస్థాయిలో అగ్రహాన్ని వ్యక్తం చేశారు. వెంట్రుకలతో పోల్చిన బీజేపితో టీడీపీ ఇంకా కలసి తిరగడం దారుణమని పేర్కోన్నారు. ఇక అంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడు కోవడానికి చివరి అస్త్రం మాత్రమే మిగిలిందని, ఇప్పుడైనా అధికార టీడీపీ మేల్కోనాలని ఆయన హితవు పలికారు. ఇంకా సమయం ఆసన్నమైనప్పుడు చూద్దం.. చివరి అస్త్రంగా దానిని ప్రయోగిద్దామని మీనమేషాలు లెక్కిస్తే అది అటు కేంద్రంలోని బీజేపితో పాటు అధికార టీడీపీకి కూడా నష్టమేనని, ఇక అంధ్ర రాష్ట్ర అభివృద్ది కుంటుపడినట్లేనని దుయ్యబట్టారు.

రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తే.. ఆయనే ముందుగా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాణాన్ని ప్రవేశపట్టాలని నారాయణ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు కల్లబొల్లి మాటలతో కాలయాపన చేస్తూ ప్రజలను మభ్యపెట్టే పరిస్థితులకు స్వస్తి పలకాలని సూచించారు. ఇటు అంధ్రప్రదేశ్ తో పాటు అటు తెలంగాణకు కూడా కేంద్రం అన్యాయం చేసిందని ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలో అయన జాతీయ పార్టీలను కూడా తూర్పారబట్టారు. కాంగ్రెస్ ది రీటైల్ అవినీతి అయితే బీజేపిది హోల్ సేల్ అవినీతి అని నారాయణ విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narayana  cpi  national secretary  BJP  TDP  chandrababu  special status  special package  Manikyala Rao  tonsure  PM Modi  politics  

Other Articles