Kamal Haasan to launch political outfit tomorrow కమలహాసన్ పార్టీ ప్రకటనకు ముహూర్తి ఖరారు..

Kamal haasan to launch political party with state wide tour

kamal haasan, kamal haasan tour, kamal haasan political party, kamal haasan politics, Delhi CM. arvind kejriwal, Kerala CM, Pinarayi Vijayan, Bihar CM, Nitish kumar, rajinikanth, tn politics

Veteran Tamil actor Kamal Haasan will kick off his state-wide tour on Wednesday with the launch of his political party and its “guiding principles” in Madurai, Tamil Nadu.

కమలహాసన్ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారు..

Posted: 02/20/2018 02:27 PM IST
Kamal haasan to launch political party with state wide tour

విశ్వవిఖ్యాత నటుడు కమలహాసన్ రాజకీయ అరంగేట్రానికి ముహూర్తం ఖారరైంది. గత కొంత కాలంలో రాష్ట్ర రాజకీయాలలో నెలకొన్న స్థబ్దత కారణంగా తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు చేప్పిన కమలహాసన్ బుధవారం రోజున తన పార్టీని లాంఛనంగా అవిష్కరించనున్నారు. రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ స్టెటస్ కోను సహించలేక, ప్రజలకు చేకూరాల్సిన లబ్ది చేకూర్చే దిశగానే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. మధురైలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో కమలహాసన్ తన పార్టీ పేరు, జెండాను, పార్టీ విధానాలను వెల్లడించనున్నారు.

ఇందులో భాగంగా ఆయన తన పార్టీ అవిష్కరణకు ముందుగానే రాష్ట్రంలో పర్యటించనున్నారు. రేపు ప్రారంభం కానున్న ఆయన పర్యటనలో ముందుగా ఆయన తన జన్మభూమి. సొంతగ్రామమైన రామనాథపురం చేరుకోనున్నారు. అక్కడి నుంచి ఆయన దుండిగల్, శివగంగ జిల్లాలో పర్యటించనున్నారు. ఆ తరువాత మధురై సభా వేదికకు సాయంత్రం ఆరు గంటలకు చేరకోనున్నారు. కాగా, ఈ సభకు ఢిల్లీ ముఖ్యమంత్రి అప్ అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్ కూడా హజరుకానున్నారు. తాజాగా జరిగిన ఆయన సీఎస్ పై దాడి నేపథ్యంలో ఆయన ఏలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది వేచి చూడాల్సిందే.

కాగా, కమల్ అహ్వానం నేపథ్యంలో రావాల్సి వున్నా.. అనివార్యకారణాల వల్ల రాలేకపోతున్నానని చెప్పిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.. తన వీడియో సందేశాన్ని మాత్రం పంపుతున్నట్లు ఆయన అధికార కార్యాలయవర్గాలు వెల్లడించాయి. ఇక కమల్ అహ్వానం అందినప్పటికీ ఈ విషయమై ఇంకా ఎలాంటి స్పందనను వెలువరించలేదు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. ఇదిలావుండగా, ప్రజల సమస్యలను, ఇబ్బందులను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకే తాను రాష్ట్ర పర్యటనను చేస్తున్నట్లు కమల్ హాసన్ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles