Modi Gets No Room In India's Best Star Hotel ప్రధాని మోడీకి మైసూరు స్టార్ హోటల్ షాక్..!

Pm modi gets no room in india s best star hotel lalitha mahal

Narendra Modi, Mysuru Hotel, Modi Mysuru Meeting, Lalitha Mahal Palace, wedding reception, No rooms for PM, Hotel Radisson Blu, PM Modi, politics

PM Modi and his entourage were stunned as they did not get accomodation at the one of the best star hotel Lalitha Mahal Palace in Mysuru. The district administration later made alternative arrangements at Hotel Radisson Blu, where he stayed overnight.

ప్రధాని మోడీకి మైసూరు స్టార్ హోటల్ షాక్..!

Posted: 02/20/2018 11:30 AM IST
Pm modi gets no room in india s best star hotel lalitha mahal

ఆయన దేశ ప్రధాన మంత్రి.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి.. మూడు దశాబ్దాల తరువాత బ్రహ్మాండమైన మెజారిటీతో ప్రధానిగా పగ్గాలు చేపట్టిన వ్యక్తి నరేంద్రమోడీ. ఒక చాయ్ వాలాగా తాను ప్రచారం చేసుకుని దేశ అత్యున్నత పదవిని చేపట్టిన సామాన్యుడు. అయితే అతను దేశంలోనే కాదు విదేశాల్లోనూ పర్యటిస్తారు. అక్కడ ప్రసిద్ది చెందిన హోటళ్లలో ఆయనకు బస కూడా ఏర్పాటు అవుతుంది. ఇక అయనను ప్రసన్నం చేసుకున్నేందుకు దేశంలోని వ్యాపారవేత్తలతో పాటు విదేశాలకు చెందిన ప్రముఖులు కూడా క్యూ లైన్లో వేచివుంటారు.

అయితే దేశప్రధానే స్వయంగా మీ హోటల్ లో బస చేస్తారని, ఆయను మంచి అతిథ్య ఇవ్వాలని అడిగితే.. ఎంతటివారైనా కాదంటారా.? కలసివచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బావిస్తారు తప్ప. కానీ అలాంటి పరాభవమే జిల్లా అధికారులకు ఎదురైంది. ప్రధానికి అయన సెక్యూరిటీ సిబ్బందికి బస ఏర్పాటు చేయాలని వెళ్లి అడిగిన జిల్లా అధికారులకు ఆ స్టార్ హోటల్ షాక్ ఇచ్చింది. తమ హోటల్ లో ప్రధానితో పాటు ఆయన సెక్యూరిటీకి బస ఏర్పాటు చేసేందుకు తగిన సంఖ్యలో గదులు ఖాళీ లేవని ఖరాఖండీగా చెప్పేంది. ఈ ఘటన కర్ణాటక లోని మైసూర్ లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. ప్రధాని నరేంద్రమోడీ అధికార పర్యటన నేపథ్యంలో కర్ణాటకలోని మైసూరుకు వస్తున్నారని సమాచారం అందుకున్న జిల్లా యంత్రాంగం.. ఆయన ఒక రోజు రాత్రి ఇక్కడే వుంటారని సమాచారం అందుకోవడంతో.. ఆయన అతిథ్యం కోసం, బస కోసం మైసూర్‌ లోని ఉన్నత ప్రమాణాలు కలిగిన స్టార్ హోటల్ గా పేరొందిని లలితా మహల్ ప్యాలెస్ ను యాజమాన్యాన్ని సంప్రదించారు. అయితే తమ హోటల్ లోని గదులన్నీ ఓ వివాహం రిసెప్షన్‌ కోసం ఇదివరకే బుక్‌ అయ్యాయని హోటల్ సిబ్బంది జిల్లా యంత్రాంగానికి చెప్పారు.

అయితే తమ హోటల్ లో కేవలం మూడు గదులు మాత్రమే ఖాళీగా వున్నాయిని అవి ప్రధాని, ఆయన భద్రతా సిబ్బందికి వసతి సౌకర్యం కల్పించేందుకు సరిపోవని హోటల్‌ యాజమాన్యం స్పష్టం చేసింది. లలితా మహల్ ప్యాలెస్ యాజమాన్యం సున్నిత తిరస్కారంతో డొలాయమానంలో పడ్డ జిల్లా యంత్రాంగం.. మైసూరులోని మరో స్టార్ హోటల్ రెడిషన్ బ్లూ లో ప్రధాని మోడీ, అయన భద్రతా సిబ్బందికి బసను ఏర్పాటు చేశారు. ఆ తరువాత లలితా మహల్ ప్యాలెస్ యాజమాన్యం నుంచి ప్రధానికి వసతి సౌకర్యాన్ని కల్పించలేనందుకు చింతిస్తున్నామన్న ప్రకటన వెలువడింది. ప్రధాని పర్యటన సమయంలోనే వివాహ రిసెప్షన్‌ ప్రారంభమైందని దీంతోనే తాము బస ఏర్పాటు చేయలేకపోయామని, అయితే ఆ సమయంలో కేవలం మూడు రూములే ఖాళీగా ఉన్నాయని, భద్రతా కారణాల రీత్యా ప్రధానికి ఏమాత్రం సరిపోవన్న బావనను వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles