pawan challenges ysrcp in no confidence motion against center జగన్ సవాల్ కు ప్రతిసవాల్ విసిరిన జనసేనాని పవన్

Pawan kalyan says ysrcp to issue no confidence motion against center

pawan kalyan, janasena, press meet, press conference, ysrcp, ys jagan, challenge, PM Modi, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan says he takes up the challenge with YS Jagan and asks him to give no confidence motion, where he will bring 80 members strength in this regard.

జగన్ సవాల్ కు ప్రతిసవాల్ విసిరిన జనసేనాని పవన్

Posted: 02/19/2018 07:04 PM IST
Pawan kalyan says ysrcp to issue no confidence motion against center

వైసీపీ అధినేత జగన్ సవాల్ ను స్వీకరిస్తున్నానని సినీనటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాన్ అన్నారు. జగన్ బలమైన నాయకుడని, ప్రజాబలం వున్న నాయకుడిగా దమ్ము, ధైర్యం,తెగింపు వున్న నేతగా తనకు తెలుసునని, అలాంటి నాయకుడు రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కేంద్రందో పోరాటానికి కూడా సన్నధం కావాలని పవన్ కల్యాన్ అన్నారు. మార్చి 4వ తేదీలోపు ఒక్క ఎంపి వున్నా సరే వారు అవిశ్వాసం పెట్టవచ్చునని, అన్నారు. అవిశ్వాస తీర్మాణాన్ని మార్చి 4లోపు ఇచ్చిన పక్షంలో తాను అందుకోసం రోడ్డుపై వచ్చేందుకు కూడా సిద్దమేనని అన్నారు.

ఇందుకు వైసీపీ నేతలు అంగీకరిస్తే తాను మార్చి 4న ఢిల్లీకి వస్తానని, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటుగా అన్ని జాతీయ పార్టీల నేతలను కలుస్తానని, వారి మద్దతు కూడా కోరతానని అన్నారు. అవిశ్వాస తీర్మానం పెడితే 40 మంది కాదు కనీసం 80 మంది మద్దుతు లభిస్తుందని కూడా చెప్పారు. ఈ క్రమంలో ఎంపీల మద్దతు కూడగట్టుకునేందుకు ఇటు తెలంగాణతో పాటు అటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్తానని పనవ్ చెప్పారు. అయితే ఈ క్రమంలో తనకు టీడీపీ మిత్రులని వాదనలు వస్తున్నాయి కదా.. వారి వైఖరి ఏంటో కూడా ఈ అవిశ్వాస తీర్మాణంతో తేలిపోతుందని పవన్ అన్నారు.

మార్చి 5న పార్లమెంటు ముందుకు అవిశ్వాస తీర్మాణం రావాలని ఆయన వైసీపీ పార్టీకి ప్రతిసవాల్ విసిరారు. అయితే రాష్ట్ర ఎంపీలను చూస్తుంటే ప్రధాని నరేంద్రమోడీకి బయపడుతున్నట్లుగా వుందని అన్నారు. ఇక పార్లమెంటు అంటే ప్రజాస్వామ్య దేవాలయమని అన్నారు. ఇలాంటి చోట విచిత్ర వేషాధారణలు, ప్లకార్డులు పట్టుకుని సభ్యుల దృష్టిని అకర్షించడం, సభలో గందరగోళానికి కారణం కావడం సబబు కాదని అన్నారు. హుందాగా తమ సమ్యసలను సభ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవడమే ఉత్తమ మార్గమని పవన్ సూచించారు. ఇక ఈ క్రమంలో వచ్చే క్రెడిట్ అంతా వైసీపీ పార్టీయే తీసుకోవాలని తనకు ఎలాంటి క్రెడిట్ అవసరం లేదని వపన్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  press meet  press conference  ysrcp  ys jagan  challenge  PM Modi  politics  

Other Articles