JFC second day meeting: Padmanabhaiah to preside meeting పద్మనాభయ్య అధ్యక్షతన జేఎఫ్సీ రెండో రోజు సమావేశాలు

Jfc second day meeting padmanabhaiah to preside meeting

Joint Fact finding Committee Meeting under the leadership of Power Star, Janasena President Pawan kalyan to start in daspalla hotel, former union home secretary Padmanabhaiah to preside today's meeting.

Joint Fact finding Committee Meeting under the leadership of Power Star, Janasena President Pawan kalyan to start in daspalla hotel, former union home secretary Padmanabhaiah to preside today's meeting.

ITEMVIDEOS: పద్మనాభయ్య అధ్యక్షతన జేఎఫ్సీ రెండో రోజు సమావేశాలు

Posted: 02/17/2018 09:59 AM IST
Jfc second day meeting padmanabhaiah to preside meeting

జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు పవర్ స్టార్ పవన్ కల్యాన్, లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సహా పలు రాజకీయ పార్టీ నేతలు, ప్రజా సంఘాలు, మేధావులతో ఇవాళ రెండో రోజు జాయింగ్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ సమావేశం నగరంలోని దసపల్లా హోటల్ లో ప్రారంభంకానుంది. సమావేశానికి హాజరుకానున్న ప్రముఖులు ఇవాళ ఆంద్రప్రదేశ్ కు జరిగిన అన్యాయం విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం వుందని సమాచారం.

రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ఏమిటీ, నిధులు ఎన్ని..? ఇప్పటి వరకు కేంద్రం విడుదల చేసిన నిధులు ఎన్ని..? అన్న విషయంలో ప్రముఖులు రెండో రోజైన ఇవాళ అథ్యయనం చేయనున్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై తొలిసారిగా జనసేన పార్టీ అధినేత పవన్ ప్యాకేజీ విషయంలో ఎక్కడో, ఎవరో అబద్దాలు అడుతున్నారని, వాటిని కనుగొనేందుకు నిజనిర్థారణ కమిటీని ఏర్పాటు చేసి సమావేశంలో అన్ని అంశాలను కూలకుశంగా చర్చిస్తున్న విషయం తెలిసిందే.

జేఎఫ్‌సీ రెండోరోజు సమావేశం హోటల్ దస్‌పల్లాలో మరికొద్దిసేపట్లో ప్రారంభంకానుంది. ఇవాళ జరగనున్న జేఎఫ్సీ సమావేశాలకు కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య అధ్యక్షత వహించనున్నారు. రాష్ట్రానికి రెవెన్యూ లోటు, పోలవరం ప్రాజెక్టు పనులు, రాజధాని నిర్మాణం, కేంద్ర సంస్థల ఏర్పాటు, పన్ను రాయితీలు, మౌలిక సదుపాయాల కల్పన, విశాఖ రైల్వే జోన్, రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి ఇలా అనేక కీలక అంశాలపై ఇవాళ సమావేశంలో ప్రముఖులు చర్చించనున్నారు.

ఇదిలా ఉండగా వ్యక్తిగత పనుల కారణంగా లోక్ సత్తా అద్యక్షుడు జయప్రకాష్ నారాయణ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రెండో రోజు సమావేశాలకు హాజరు కావటం లేదని సమాచారం. కాగా, జేఎఫ్సీ రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశమని, ఏపీకి జరిగిన అన్యాయం విషయంలో వారం రోజుల్లో వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతామని జయప్రకాష్ నారాయణ్ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles