promises not fulfilled will impact next generations హామీలు నిలుపుకోకపోతే. దేశఐక్యతకే విచ్ఛిన్నం: పవన్

Not fulfilling election promises will show impact on next generations

AP Special status, Janasena, Pawan Kalyan, chalasani srinivas, special package, special status, andhra pradesh, swaraj abhiyaan, union budget alloctions, Arun Jaitley, PM Modi, pawan kalyan, janasena, union budget, Undavalli Arun Kumar, Jaya Prakash Narayan, JAC, JFC, andhra pradesh, politics

Power Star, Janasena President Pawan kalyan talks to media on completion of day 1 of JFC Meeting, says the union government assurances not fulled will show impact on nest generations.

ITEMVIDEOS: హామీలు నిలుపుకోకపోతే. దేశఐక్యతకే విచ్ఛిన్నం: పవన్

Posted: 02/16/2018 05:59 PM IST
Not fulfilling election promises will show impact on next generations

జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు పవర్ స్టార్ పవన్ కల్యాన్ ఆంద్రప్రదేశ్ కు జరిగిన అన్యాయం విషయంలో నిజనిర్థారణ కమిటీని ఏర్పాటు చేసి ఇవాళ తొలిసారిగా కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తాను పార్టీ పెట్టడానికి ప్రధాన కారణం రాష్ట్ర విభజనలో జరిగిన అన్యాయమేనని అన్నారు ఈ సమావేశంలో పాల్గోన్నవారికి ఉన్నంత జ్ఞానం, సబ్జెక్ట్‌ ‌గానీ తనకు లేవని అన్నారు. అయితే రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పట్ల చలించే హృదయం ఉందని అన్నారు. తప్పు జరుగుతున్నప్పుడు దాని మూలంలోకి వెళ్లలేను కానీ, దాన్ని ఎందుకు సరిచేయరని అడగాలని తన గొంతు లేస్తుందని అన్నారు.

అందరూ రాజకీయ లబ్ది కోసం మాట్లాడుతున్నారు కానీ, వాస్తవాలను సరిగా చెప్పడం లేదన్న అభిప్రాయం తనలో కలిగిందని అన్నారు. మోదీ ప్రధాని అభ్యర్థిగా ఉన్నప్పుడు గాంధీనగర్ లో ఆయనను కలిశా. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేశం తనకు భద్రత కల్పిస్తుందనే నమ్మకంతో ప్రజలు బతుకుతారని అన్నారు. అయితే రాష్ట్ర విభజన చేసినప్పుడు ఓ పద్ధతి, పాడూ లేకుండా మరో రాష్ట్ర ప్రజలను వెళ్లిపోండి అన్నారు. ఇక్కడ ప్రజల ప్రమేయం అస్సల్లేదని అన్నారు. పాలకులు చేసిన తప్పులకు ప్రజలు శిక్ష అనుభవించాలా అని ప్రశ్నించారు.

తన ఫామ్ హౌజ్ లో పనిచేస్తున్న ఓ కుటుంబం 50ఏళ్ల కిందటే ఇక్కడికి వచ్చిందని.. వారిక కుటుంబంలోని వ్యక్తి చనిపోగా.. మృతదేహాన్ని ఖననం చేయడానికి తీసుకెళ్తే ‘నువ్వు ఆంధ్రా వాడివి. ఇక్కడ పూడ్చడానికి వీళ్లేదు’ అని అన్నారు. వాళ్లకు ఏం చేయాలో తోచలేదు. తనకు తెలిసిన స్నేహితుల ద్వారా వాళ్లకు చెప్పించి అంత్యక్రియలు చేయించాను. ఇలాంటి సమస్య ప్రతీ బస్తీలో ఉంటుందని అన్నారు. పాలకులు చేసిన తప్పులకు పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నాని అన్నారు. ఈ పరిణామాలు దైనందికంగా పనులు చేసుకునివారి జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని కనబరుస్తున్నాయని అన్నారు.

‘‘రాష్ట్రం విడిపోయిన తర్వాత అంధ్రాకు చెందిన చాలా మంది ఉపాధ్యాయులు ఇక్కడ ఉండిపోయారని, అయితే ‘ఏరా రాష్ట్రం వచ్చినా మీ రాష్ట్రానికి పోలేదా?’ అని ఎవరైనా నిలదీస్తారేమోనని తాము నిత్యం భయపడుతున్నామని వారు తనతో చెప్పారని అన్నారు. దీంతో వారి పరిస్థితి రెంటికి చెడ్డరేవడిలా మారిందని అన్నారు. దీంతో అంధ్రరాష్ట్ర పౌరులలో అగ్రహర రగిలిపోయిందని అన్నారు. తాము దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులమా.. మేము వాళ్ల మాదిరిగా దేశానికి పన్నులు చేల్లించడం లేదా..? అన్నప్రశ్నలు ఎదురవుతున్నాయని అన్నారు.

ఆక్వా ఫుడ్‌ పార్క్‌ సమస్య ఉత్పన్నమైనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్కడి యువతను పట్టించుకోలేదని అన్నారు. అయితే తాను అక్కడికి వెళ్లినప్పుడు అక్కడి యువత తనతో మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మా మాట వినడం లేదు. ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు. ఏదో ఒకసారి వినేసి వెళ్లిపోతారు‘ మాకు అతివాదం శరణ్యమా అన్న భావన కలుగుతుందని వారు అవేదన వ్యక్తం చేశారని అన్నారు. అలాంటిది.. బాధ్యతతో వ్యవహరించాల్సిన కేంద్రం ఇచ్చిన మాటను వెనక్కి తీసుకుంటే వచ్చే పరిణామాలు దేశ సమగ్రతకు భంగం కలిగించేలా ఉంటాయని పవన్ అభిప్రాయపడ్డారు.

కేంద్రం మాట తప్పితే దాని ప్రభావం రాబోయే తరాలపై ఖచ్చితంగా పడుతుందని, అది ఎటు దారితీస్తుందో తెలియదని జనసేనాని అందోళన వ్యక్తం చేశారు. ఇది దేశ సమగ్రతకు కూడా భంగం కలిగించవచ్చునని.. దీని వల్ల అతివాదం, తీవ్రవాదాలు పెరుగుతాయన్నారు. ఇప్పటికే దేశంలో ఉత్తరాది, దక్షిణాది పౌరులమంటూ వీడిపోవాల్సి వస్తుందని, దీనికి యువత అతివాదం తోడైతే వేర్పాటు వాదానికి బలమైన వాతావరణం ఏర్పడుతుందని ఇది దేశ భద్రతకే సవాలు అని పవన్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles