yogendra yadav and chalasani meets pawan kalyan పవన్ కల్యాన్ ను కలసిన యోగేంద్ర, చలసాని

Yogendra yadav and chalasani meets pawan kalyan

AP Special status, Janasena, Pawan Kalyan, chalasani srinivas, yogendra yadav, special package, special status, andhra pradesh, swaraj abhiyaan, union budget alloctions, Arun Jaitley, PM Modi

Power Star, Janasena President Pawan kalyan invited swaraj abhiyaan leader yogendra yadav and special status sadhana samiti president chalasani srinivas who came to meet him in JSP party office

పవన్ కల్యాన్ ను కలసిన యోగేంద్ర, చలసాని

Posted: 02/15/2018 09:04 PM IST
Yogendra yadav and chalasani meets pawan kalyan

జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు పవర్ స్టార్ పవన్ కల్యాన్ ను స్వరాజ్ అభియాన్ నేత, ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ కార్యనిర్వాహక సభ్యుడు యోగేంద్ర యాదవ్ కలిశారు. ఇవాళ పవన్ పిలుపు మేరకు హైదరాబాద్ కు వచ్చిన ఆయన జనసేన పార్టీ కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యోగేంద్రకు పవన్ సాదర స్వాగతం పలికారు. ఇటీవల అనంతపురం జిల్లాలో తాను జరిపిన పర్యటన వివరాలను ఆయన పవన్ కు వివరించారు.

ఢిల్లీ వాసిని అయిన తనకు ఆంధ్రప్రదేశ్ అంటే పచ్చటి పొలాలు, గోదావరి, కృష్ణ నదులతో కళకళలాడుతుందని మాత్రమే తెలుసని, అయితే అనంతపురం జిల్లాను చూసిన తరువాత తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని యోగేంద్ర చెప్పారు. అనంతపురం జిల్లా కరవు, నిరుద్యోగం, ఆకలి బాధలు, నేతన్నల కష్టాలు చూసి తాను చలించిపోయానని చెప్పారు. బుందేల్ ఖండ్ మాదిరిగానే అనంతపురం జిల్లా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు జనసేన అధినేత పవన్ కల్యాన్ ను కలుసుకున్నారు. పవన్ చొరవతో ఏర్పాటైన జాయింట్ ఫాక్ట్స్ ఫైండింగ్ కమిటీ (జేఎఫ్ సీ)కు ఆయన సంఘీభావం ప్రకటించారు. రేపు హైదరాబాద్ లో జరగనున్న జేఎఫ్ సీ తొలి సమావేశానికి తమ సమితి ప్రతినిధులతో కలిసి హాజరవుతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ఎంత ఇచ్చిందో, ఎంత ఖర్చయిందో, ఇంకా రావాల్సింది ఎంత ఉందో లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉందని చలసాని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles