cbi, ed raids at mumbai PNB branches పంజాబ్ నేషనల్ బ్యాంకులపై సీబీఐ, ఈడీ దాడులు

Cbi ed raids at mumbai punjab national bank branches

Banking, Business, CBI, PNB scam, Fraud, Punjab National Bank, Axis Bank, Allahabad Bank, Nirav Modi, Gitanjali Gems, Gili India, Nakshatra

The CBI and Enforcement Directorate conducts raids at Punjab National Bank following the Rs 11,400 crore scam at one of its Mumbai branches and even at Gitanjali Gems after reports of its involvement in the fraud case.

పంజాబ్ నేషనల్ బ్యాంకులపై సీబీఐ, ఈడీ దాడులు

Posted: 02/15/2018 11:17 AM IST
Cbi ed raids at mumbai punjab national bank branches

దేశీయ రెండవ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజ సంస్థగా పేరొందిన పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణం వెలుగు చూసిన నేపథ్యంలో.. ముంబైలోని ఆ బ్యాంకుకు చెందిన పలు శాఖలలో సీబిఐ, ఈడీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ముంబై బ్రాంచ్ లో సుమారు రూ.11,300 కోట్ల మేర మోసపూరిత లావాదేవీలు జరిగినట్టు స్వయంగా అదే బ్యాంకు యాజమాన్యం అంగీకరిస్తూ.. బాంబే స్టాక్ ఎక్సేంజ్ కు సమాచారం అందించడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. తమ బ్యాంకులో మోసపూరిత, అనధికారిక లావాదేవీలు కొందరు ఖాతాదారుల ప్రయోజనాల కోణంలో జరిగినట్టు గుర్తించామని పేర్కొంది.

ఈ లావాదేవీల ఆధారంగా ఆయా ఖాతాదారులకు విదేశాల్లో రుణాలు జారీ అయినట్టు వివరించింది. దీనిపై దర్యాప్తు జరిపి నిందితులను పట్టుకునేందుకు వీలుగా దర్యాప్తు ఏజెన్సీలకు నివేదించామని, స్వచ్ఛమైన, పారదర్శక బ్యాంకింగ్ సేవలకు కట్టుబడి ఉన్నామని పంజాబ్ నేషనల్ బ్యాంకు యాజమాన్యం తెలిపింది. అయితే ఈ కుంభకోణంలో గీతాంజలి జెమ్స్ సంస్థకు సంబంధమున్నట్లు వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఈ సంస్థను నడుపుతున్న బిలియనీర్, నిరవ్ మోడీ.. గీతాంజలి జెమ్స్ సహా, గిల్లి ఇండియా, నక్షత్రా పేర్లతో కూడా బ్యాంకు నుంచి రుణాలను తీసుకుని వాటిని గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు దారిమళ్లించాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

రుణాలను జారీ చేయడంలో దేశంలోనే నాలుగోస్థానంలో వున్న పంజాబ్ నేషనల్ బ్యాంకు.. సత్యం రామలింగరాజుకు చెందిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం తరువాత గీతాంజలి జెమ్స్ సంస్థ చేసిన ఈ కుంభకోణమే పెద్దది. సత్యం రామలింగరాజు సత్యం కంప్యూటర్స్ పేరు రూ.9 వేల కోట్ల కుంభకోణం జరపిన విషయం పాఠకులకు తెలిసిందే.

ఆర్థిక శాఖ కీలక అదేశాలు:

పీఎన్బీ బ్యాంకులో భారీ కుంభకోణం వెలుగుచూసిన నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీచేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు సహా దేశంలోని అన్ని బ్యాంకులు వెంటనే స్టేటస్‌ రిపోర్టును అందించాలని ఆదేశించింది. పెద్ద పెద్ద అవినీతి తిమింగలాలు తప్పించుకోవడానికి వీలులేదని, ఇదే సమయంలో నిజాయితీ రుణగ్రహీత వేధించబడవద్దని ఆర్థిక మంత్రిత్వ శాఖ అన్ని బ్యాంకులకు సీరియస్‌ ఆదేశాలు జారీచేసింది. వెంటనే స్టేటస్‌ రిపోర్టును తమకు అందించాలని తెలిపింది.  ముంబై శాఖలో ఈ మోసపూరిత లావాదేవీలు జరిగినట్టు పేర్కొన్న పీఎన్బీ.. నిరవ్ మోదీపై పేరును కూడా తెరపైకి తీసుకురావడంతో.. అయనను సీబిఐ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles