26/11 Mastermind Hafiz Saeed a Terrorist declares Pakistan ముంబై పేలుళ్ల కుట్రదారు హఫీజ్ సయ్యీద్ ఉగ్రవాదే: పాక్

Under global pressure pakistan declares hafiz saeed a terrorist

Jaish-e-Mohammad, Jamaat-ud-Dawah, Hafiz Saeed, Mamnoon Hussain, 26/11 Mumbai blasts mastermind, United Nations, UN Security Council, pakistan, president, terrorism

Pakistan President Mamnoon Hussain signed an ordinance that brings all individuals and organisations banned by the United Nations Security Council under the ambit of the amended Anti-Terrorism Act.

ముంబై పేలుళ్ల కుట్రదారు హఫీజ్ సయ్యీద్ ఉగ్రవాదే: పాక్

Posted: 02/13/2018 03:11 PM IST
Under global pressure pakistan declares hafiz saeed a terrorist

అంతర్జాతీయంగా ఉగ్రవాద స్వర్గధామ దేశంగా అపకీర్తిని మూటగట్టుకుంటున్న పాకిస్తాన్.. ప్రపంచ దేశాల నుంచి వస్తున్న డిమాండ్ నేపథ్యంలో ఎట్టకేలకు భారతదేశ అర్థిక రాజధాని ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాత్ ఉల్ దవా అధినేత హఫీజ్ సయీద్ ను ఉగ్రవాదిగా గుర్తించింది. అంతర్జాతీయంగా పాకిస్థాన్ పై పెరిగిన ఒత్తిడి నేపథ్యంలోనే పాక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే హఫీజ్ సయ్యీద్ ను ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదిగా ప్రకటించింది. అయితే దీనిని అప్పట్లో పాకిస్థాన్ అంగీకరించకలేదు. అంతేకాదు అతనిపై ఎలాంటి చర్యలు చేపట్టరాదని పాకిస్థాన్ న్యాయస్థానాలు కూడా తేల్చిచెప్పాయి.

కాగా, అగ్రరాజ్య, ఐక్యరాజ్య సమితిలతో పాటు అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగిన క్రమంలో తాజాగా పాకిస్థాన్ హఫీజ్ సయ్యీద్ ను ఉగ్రవాదిగా ప్రకటించింది. జమాత్‌ ఉల్‌ దవా కార్యాలయాల ముందున్న బారికేడ్లను తొలగించిన తర్వాత పాక్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఉగ్రవాద సంస్థలుగా పేర్కొని నిషేధం విధించిన లష్కరే తోయిబా, జమాత్‌ ఉల్‌ దవా, హర్కత్‌ ఉల్‌ ముజాహిదీన్‌ తదితర సంస్థలను 1997లో సవరించిన ఉగ్రవాద వ్యతిరేక చట్టం పరిధిలోకి తీసుకొచ్చే ఆర్డినెన్స్‌పై పాక్‌ అధ్యక్షుడు మమ్‌నూన్‌ హుస్సేన్‌ సంతకం చేశారు.

మొత్తం 27 నిషేధిత ఉగ్రవాద సంస్థలను ఈ పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ ఆర్డినెన్స్‌ వెంటనే అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం.. నిషేధిత ఉగ్రవాద సంస్థల ఆస్తులను వెంటనే నిలిపివేయనున్నారు. ఇదిలా ఉండగా.. జమాత్‌ ఉల్‌ దవా కార్యాలయాల ముందు ఏర్పాటుచేసిన బారికేడ్లను తొలగించారు. భద్రతా కారణాల దృష్ట్యా దశాబ్దం కిందట ఈ బారికేడ్లను ఏర్పాటు చేశారు. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో జమాత్‌ ఉల్‌ దవా ప్రధాన కార్యాలయం సహా 26 ప్రాంతాల్లోని బారికేడ్లను తొలగించినట్లు లాహోర్‌ డీఐజీ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jaish-e-Mohammad  Jamaat-ud-Dawah  Hafiz Saeed  Mamnoon Hussain  pakistan  president  terrorism  

Other Articles