Blast at Cochin Shipyard kills 5, injures 11 కొచ్చిన్ షిప్ యార్డులో పేలుడు.. విస్పోటనం ధాటికి 5గురు మృతి

Five killed 11 injured after blast inside ship at cochin shipyard

Cochin Shipyard, Cochin Shipyard Blast, Kochi, Blast, ONGC Ship, Cochin, Shipyard blast, Cochin blast, Cochin Shipyard explosion, Sagar Bhushan, ONGC, crime

In a tragic incident, five people were killed in an explosion on a drill ship at the Cochin Shipyard on Tuesday morning. Police officials and firefighters rushed to the spot and all the injured have been shifted to hospitals.

కొచ్చిన్ షిప్ యార్డులో పేలుడు.. విస్పోటనం ధాటికి 5గురు మృతి

Posted: 02/13/2018 01:16 PM IST
Five killed 11 injured after blast inside ship at cochin shipyard

కేరళలోని కొచ్చిన్‌ షిప్ యార్డులో ఘోర ప్రమాదం సంభివించింది. నౌకల నిర్మాణ కేంద్రంలో ఓ నౌకకు మరమ్మతులు చేస్తున్న క్రమంలో పేలుడు సంభవించింది. నౌకలో పేలుడు సంభవించి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక దళాలు హుటాహుటిన ప్రమాదఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదవార్త తెలిసిన వెంటనే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సంబంధిత కొచ్చి షిప్ యార్డు అధికారులతో ఫోన్ లో సంబాషించిన ముఖ్యమంత్రి క్షతగాత్రులకు అత్యుత్వమ వైద్యసేవలను అందించాలని అదేశించానని తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌(ఓఎన్‌జీసీ)కి చెందిన సాగర్‌ భూషణ్‌ నౌకను మరమ్మతుల నిమిత్తం కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ఉంచారు.

కాగా, ఇవాళ అక్కడి సిబ్బంది మరమ్మతులు చేస్తుండగా.. ఒక్కసారిగా నౌకలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. సమాచారమందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. మృతుల్లో ఇద్దరు కేరళకు చెందినవారని తెలుస్తోంది. నౌకలో వాటర్‌ ట్యాంక్‌లో ఈ పేలుడు సంభవించినట్లు ప్రాథమిక సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cochin Shipyard explosion  ONGC rig blast  Sagar Bhushan  crime  

Other Articles

 • Haneesha chowdary suicide case

  హనీషా అందుకే సూసైడ్ చేసుకుందా?

  Feb 19 | హైదరాబాద్ లో విద్యార్థిని హనీషా చౌదరి(24) ఆత్మహత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆమె సూసైడ్ కేసులో పోలీసులు మరిన్ని వివరాలు వెల్లడించారు. శివశివానీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ హనీషా చౌదరి ఎంబీఏ... Read more

 • Congress mla harris son mohammed nalapad surrenders in bengaluru pub brawl case

  36 గంటల తరువాత పోలీసులకు లొంగిపోయిన ఎమ్మెల్యే తనయుడు

  Feb 19 | తాను ఎమ్మెల్యే తనయుడిని అన్న అహంకారం నరనరాల్లో జీర్ణించుకుపోయిన ఓ యువకుడికి.. తన అధికార పక్షం కూడా తనను శిక్ష నుంచి కాపాడలేదని తెలియడం.. ఇక స్వయంగా ముఖ్యమంత్రే స్వయంగా తన ట్విట్టర్ ఖాతా... Read more

 • Young and dynamic warangal collector amrapali got married

  కాశ్మీరీ సంప్రదాయంలో కలెక్టర్ అమ్రపాలి కల్యాణం

  Feb 19 | వరంగల్ అర్బన్ జిల్లా డైనమిక్ కలెక్టర్ కాటా ఆమ్రపాలి కల్యాణం కమనీయంగా సాగింది. సంప్రదాయ కాశ్మీరీ దుస్తుల్లో మెరిసినపోయిన కలెక్టరమ్మ, గోవా ఐపీఎస్ అధికారి సమీర్ శర్మ పరిణయం.. జమ్మూ కాశ్మీర్ లో వైభవంగా... Read more

 • Plane crash kills passengers in iran

  ఘోర ప్రమాదం.. 66 మంది దుర్మరణం

  Feb 18 | ఇరాన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ విమానం కూలిపోయిన ఘటనలో 66 మంది దుర్మరణం పాలయ్యారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. టెహ్రాన్ నుంచి... Read more

 • Rgv attended before ccs police

  ముగిసిన వర్మ విచారణ.. మళ్లీ హాజరు కావాలని ఆదేశం

  Feb 17 | వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎట్టకేలకు పోలీసుల ముందు హాజరయ్యాడు. గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' సినిమా నిర్మాణం, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులకు సంబంధించి శనివారం హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల... Read more

Today on Telugu Wishesh