vhp's valentine day message in favour of lovers వాలెంటైన్స్ డే: ప్రేమికులకు వరాన్ని అందించిన వీహెచ్పీ

Pravin togadia s valentine s day message in favour of lovers

Pravin Togadia, Valentine’s Day, Chandigarh, Vishva Hindu Parishad, Togadia, Bajrang Dal, lovers, youth right, love, BJP, RSS

The VHP and Bajrang Dal workers have for years been demanding a ban on Valentine’s Day in India, terming it “anti-Hindu” and “anti-Indian”.

వాలెంటైన్స్ డే: ప్రేమికులకు వరాన్ని అందించిన వీహెచ్పీ

Posted: 02/12/2018 07:46 PM IST
Pravin togadia s valentine s day message in favour of lovers

గత కొన్నేళ్లుగా కొనసాగిస్తున్న చర్యల నుంచి ఎట్టకేలకు విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) యూ టార్న్ తీసుకుంది. వాలెంటైన్స్ డే రోజున యువతీ-యువకులు ఎక్కడ ఏకాంతంగా కనిపించినా.. వారిని అడ్డుకుని పెళ్లిళ్లు చేసిన వీహెచ్పీ ఇకపై అలాంటి చర్యలకు పూనుకోవద్దని మరో రెండు రోజుల్లో రానున్న వాలెంటైన్స్ డే ముందు చెప్పింది. వీహెచ్పీ కార్యకర్తలు ప్రేమికుల రోజును నిర్వహించుకోవడాన్ని వ్యతిరేకిస్తూ.. అ రోజున ప్రేమికులు ఎక్కడ కనబడిని చర్యలు తీసుకుంటుంది. అయితే ఈ ఏడాది మాత్రం అందుకు విభిన్నంగా స్పందించింది.

మరో రెండు రోజుల్లో వేలంటైన్స్ డే ఉన్నందున వీహెచ్‌పీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా ఈ సందర్భంగా యువతకు ఇచ్చిన సందేశం ఒకింత ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. యువతీ యువకులకు ప్రేమించే హక్కు ఉందని ఆయన వాలెంటైన్స్ డే రోజు సందేశాన్ని ఇచ్చారు. ప్రేమికుల రోజున ఆందోళనలు లేదా హింస ఉండరాదని ఆయన కోరారు. చండీగఢ్ లో వీహెచ్పీ, భజరంగ్ దళ్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రవీణ్ తొగాడియా తమ కార్యకర్తలకు పలు సలహాలు, సూచలను చేశారు.

 'జంటలు ప్రేమలో పడకుంటే, పెళ్లిళ్లు జరగవు. అలా పెళ్లిళ్లు లేకుంటే ప్రపంచం పురోగతి సాధించదు. అందువల్ల యువతీయువకులకు ప్రేమించే హక్కుంది. వారు ఈ హక్కును పొందాలి' అంటూ ఆయన సందేశమిచ్చారు. ప్రేమికుల రోజు నాడు తమ కార్యకర్తలు ఆందోళనలు, నిరసనలు చేపట్టకుండా వారికి తగిన ఆదేశాలు జారీ చేశామని ఆయన చెప్పారు. తమ కుమార్తెలు, సోదరీమణులకు కూడా ప్రేమించే హక్కుందంటూ సందేశపూర్వకంగా తెలిపామన్నారు. కాగా, వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు కొన్నేళ్లుగా భారత్‌లో ప్రేమికుల రోజును నిషేధించాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pravin Togadia  Valentine’s Day  Chandigarh  Vishva Hindu Parishad  Togadia  Bajrang Dal  BJP  RSS  

Other Articles

 • Haneesha chowdary suicide case

  హనీషా అందుకే సూసైడ్ చేసుకుందా?

  Feb 19 | హైదరాబాద్ లో విద్యార్థిని హనీషా చౌదరి(24) ఆత్మహత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆమె సూసైడ్ కేసులో పోలీసులు మరిన్ని వివరాలు వెల్లడించారు. శివశివానీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ హనీషా చౌదరి ఎంబీఏ... Read more

 • Congress mla harris son mohammed nalapad surrenders in bengaluru pub brawl case

  36 గంటల తరువాత పోలీసులకు లొంగిపోయిన ఎమ్మెల్యే తనయుడు

  Feb 19 | తాను ఎమ్మెల్యే తనయుడిని అన్న అహంకారం నరనరాల్లో జీర్ణించుకుపోయిన ఓ యువకుడికి.. తన అధికార పక్షం కూడా తనను శిక్ష నుంచి కాపాడలేదని తెలియడం.. ఇక స్వయంగా ముఖ్యమంత్రే స్వయంగా తన ట్విట్టర్ ఖాతా... Read more

 • Young and dynamic warangal collector amrapali got married

  కాశ్మీరీ సంప్రదాయంలో కలెక్టర్ అమ్రపాలి కల్యాణం

  Feb 19 | వరంగల్ అర్బన్ జిల్లా డైనమిక్ కలెక్టర్ కాటా ఆమ్రపాలి కల్యాణం కమనీయంగా సాగింది. సంప్రదాయ కాశ్మీరీ దుస్తుల్లో మెరిసినపోయిన కలెక్టరమ్మ, గోవా ఐపీఎస్ అధికారి సమీర్ శర్మ పరిణయం.. జమ్మూ కాశ్మీర్ లో వైభవంగా... Read more

 • Plane crash kills passengers in iran

  ఘోర ప్రమాదం.. 66 మంది దుర్మరణం

  Feb 18 | ఇరాన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ విమానం కూలిపోయిన ఘటనలో 66 మంది దుర్మరణం పాలయ్యారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. టెహ్రాన్ నుంచి... Read more

 • Rgv attended before ccs police

  ముగిసిన వర్మ విచారణ.. మళ్లీ హాజరు కావాలని ఆదేశం

  Feb 17 | వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎట్టకేలకు పోలీసుల ముందు హాజరయ్యాడు. గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' సినిమా నిర్మాణం, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులకు సంబంధించి శనివారం హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల... Read more

Today on Telugu Wishesh