Kathua girl's murder: SIT arrests 28-yr-old SPO రక్షకుడు కాదు వీడు ఫైశాచిక పశువు

Cop arrested for rape and murder of minor nomad girl in kathua

minor rape, J&K crime branch, Jammu minor murder, police officer arrested, Deepak Khujaria, nomadic tribes, police officer rapes minor, Mehbooba Mufti government

In a major breakthrough, SIT of Crime Branch of Jammu and Kashmir police has arrested Special Police Officer (SPO) Deepak Khajuria for his alleged involvement in kidnapping and killing an eight-year-old girl in Kathua district

రక్షకుడు కాదు వీడు ఫైశాచిక పశువు

Posted: 02/10/2018 02:02 PM IST
Cop arrested for rape and murder of minor nomad girl in kathua

పోలీసులను రక్షకులుగా భావిస్తాం.. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి శభాష్ పోలీస్ అనేట్టు కూడా చేసిన రక్షక భటులు కూడా వున్న ఈ వ్యవస్థలోనే డబ్బుకోసం కక్కుర్తి పడి తిమ్మిని భమ్మిని చేసిన వారు లేకపోలేదు. ఇక తాజాగా వెలుగుచూసిన ఓ ఘటనలో వీడు పోలీసేనా.? పైశాచిక మృగమా.? అని యావత్ సమాజం ప్రశ్నించేలా.. సభ్య సమాజం తలదించుకునే చర్యలకు పాల్పడ్డాడు. కిడ్నాపైన బాలికను వెతికి పట్టుకుని.. తల్లిదండ్రులకు అప్పగించేందుకు బదులు ఆమెను బంధించి అత్యాచారానికి పాల్పడి ఆపై దారుణంగా చంపేశాడు.

జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. దర్యాప్తులో భాగంగా విచారించిన పోలీసులు సదరు పైశాచిక మృగం తోలు కప్పుకున్న పోలీసు అధికారిని కటకటాలు వెనక్కి నెట్టారు. పోలీసుల వివారాల ప్రకారం.. జమ్ముకు 80 కిలోమీటర్ల దూరంలో ఉండే కతువా జిల్లా, రసనా గ్రామంలోని నోమాద్ తెగకు చెందిన 8 ఏళ్ల బాలిక జనవరి 10న గుర్రాలను మేపుతుండగా కిడ్నాపైంది. తమ కుమార్తె కనిపించడం లేదని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆమెను వెతికిపట్టుకునేందుకు పోలీసులు ఏర్పాటు చేసిన ప్రత్యేక టీములో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్‌పీవో) దీపక్ ఖుజారియా (28) కూడా ఉన్నాడు. ఈ క్రమంలో కిడ్నాప్ కు గురైన బాలికను గుర్తించిన ఖుజారియా ఆమెను తల్లిదండ్రులకు అప్పగించకుండా వేరే ప్రాంతంలో అమెను వారం రోజుల పాటు బంధించి మరో బాలుడితో కలిసి బాలికపై అఘాయిత్యానికి ఒడిగ్గటాడు. అనంతరం బాలికను దారుణంగా హత్య చేసి పొలాల్లో పడేశాడు.

సరిగ్గా వారం తర్వాత జనవరి 17న పొలాల్లో కనిపించిన బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న క్రైమ్ బ్రాంచ్ ప్రత్యేక దర్యాప్తు బృందం పోలీసులు ఈ ఘటన వెనక దీపక్ ఖజురియా హస్తం ఉందని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బాలికపై అత్యాచారం, హత్య వెనుక దీపక్ హస్తం ఉందనేందుకు అన్ని సాక్ష్యాలు ఉన్నట్టు అదనపు డైరెక్టర్ జనరల్ అలోక్ పురి తెలిపారు. దీపక్ తన నేరాన్ని అంగీకరించినట్టు పేర్కొన్నారు. కాగా, తమకు న్యాయం చేయాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలిక బంధువులు, నోమా తెగవారు ఆందోళన చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Tension at peak on second day at sabarimala 144 section imposed

  రెండో రోజు అదే సీన్..శబరిమల వద్ద ఉద్రిక్తత.. 144 సెక్షన్..

  Oct 18 | దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శబరిమల ఆలయం తలుపులు తెరిసిన తరువాత ఆలయ ప్రవేశం చేసి.. అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన మహిళా భక్తులకు రెండో రోజు కూడా చుక్కెదురవుతుంది. ఆలయంలోకి ప్రవేశించేందుకు... Read more

 • Navaratri fest concludes today kanaka durga devi in two alankarams today

  నేడే విజయదశిమి.. మధ్యాహ్నం నుంచి రాజరాజేశ్వరిగా.. దుర్గమ్మ

  Oct 18 | ఇంద్రకిలాద్రిపై గత ఎనమిది రోజులుగా అంగరంగ వైభవంగా సాగుతోన్న కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఇశాళ సాయంత్రం అమ్మవారు రాజరాజేశ్వరి రూపంలో భక్తులకు అభయప్రధానం చేసిన తరువాత దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు... Read more

 • Tirumala bramostavam concludes with chakra snanam

  ముగిసిన శ్రీవారి బ్రహోత్సవాలు.. వైభవంగా చక్రస్నానం..

  Oct 18 | తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు తొమ్మిదవ రోజున చక్రస్నానంతో ముగింపుకు చేరుకున్నాయి. నిన్న సాయంత్రం శ్రీవారు అశ్వవాహనంపై నిర్వహించిన ఊరేగింపుతో వాహనసేవలు ముగింపుకు చేరుకున్నాయి. తిరుమల నవరాత్రి  బ్రహోత్సవాలలో భాగంగా ఈ ఉదయం స్వామివారికి... Read more

 • Jaswant singh s son manvendra singh joins congress ahead of elections

  అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపికి షాక్..

  Oct 17 | రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 7న జరుగనున్న నేపథ్యంలో అధికార బీజేపి నేతృత్వంలోని వసుంధర రాజే ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపి మాజా సినియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ తనయుడు... Read more

 • Ap cops go to tn village to arrest criminal villagers lock them inside house

  దొంగల వెంటపడ్డారు.. గ్రామస్థులకు బంధీలయ్యారు..

  Oct 17 | దొంగలు, దోపిడీ ముఠాల నాయకులను పట్టుకునేందుకు పోలీసులు చేపట్టే ఆపరేషన్లు అంత సజావుగా సాగవు. చాలాసార్లు పోలీస్ అధికారుల నుంచి దొంగలు తప్పించుకుంటారు. ఈ క్రమంలో దొంగల ముఠా నుంచి పోలీసులకు అనేక సవాళ్లు... Read more

Today on Telugu Wishesh