People voted you to power for Ram Mandir: VHP ప్రధానిని టార్గెట్ చేస్తూ ప్రవీణ్ తొగాడియా సంచలన వ్యాఖ్యలు

People voted you for ram mandir not for triple talaq pravin togadia

Aaj Ki Ayodhya, Ayodhya, narendra modi, pravin togadia, ram temple, triple talaq, vishwa hindu parishad, ram mandir, ram mandir construction, ayodhya, ram temple in ayodhya, ayodhya temple. Pravin Togadia, PM Modi, Ram Mandir, Triple Talaq, VHP, BJP

Pravin Togadia stated that the people of the nation voted for him so that they can get Ram Mandir in Ayodhya. Not for making laws on the practice of triple talaq by the Muslim community.

ప్రధానిని టార్గెట్ చేస్తూ ప్రవీణ్ తొగాడియా సంచలన వ్యాఖ్యలు

Posted: 02/10/2018 10:47 AM IST
People voted you for ram mandir not for triple talaq pravin togadia

బడ్జెట్ సమావేశాలు ముగిసిముగియగానే మూడు దేశాల విదేశీ పర్యటలనకు వెళ్లిన ప్రధాన మంత్రి నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా అయనను టార్గెట్ గా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీని ఆయన నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం తీరుపై తోగాడియా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటీవల తన హత్యకు ప్రధాని మోడీ, అహ్మదాబాద్ పోలిస్ కమీషనర్ ఇద్దరూ కలసి కుట్ర పన్నుతున్నారని, కావాలంటే వీరద్దరూ గత నెల రోజులుగా మాట్లాడిన ఫోన్ రికార్డులను బయటపెట్టాలని సంచలన అరోపణలు చేసిన తోగాడియా తాజాగా ప్రధానిని మళ్లీ టార్గెట్ చేశారు. దేశ ప్రజలు బీజేపికి ఓటు వేసి అధికారంలోకి తీసుకువచ్చింది అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసమని ఆయన గుర్తు చేశారు.

అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తికావస్తున్న ఇంకా రామమందిర నిర్మాణం ఎక్కడవేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారి మరింత జాప్యానికి కారణం కావడంపై నేరుగా ఆయన బీజేపీని నిలదీశారు. ప్రజలు మిమ్మల్ని గెలిపించింది రామ మందిర నిర్మాణం కోసమే తప్ప.. ట్రిపుల్‌ తలాక్‌ చట్టాలు చేయడానికి కాదని ఆయన పేర్కొన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి వెంటనే మార్గం సుగమం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pravin Togadia  PM Modi  Ram Mandir  Triple Talaq  VHP  BJP  

Other Articles