Hong Kong Police disarm Heavy Wartime Bomb | బాంబు నిర్వీర్యం . నాలుగు వేల మందిని కాపాడిన బాంబ్ స్క్వాడ్

Wartime bomb found in hong kong

Hong Kong, Wartime Bomb, Disposal, Second World War, America, AN-M 65, Hong Kong Police, Explosive Ordnance Disposal Bureau, EOD, Hong Kong Bomb Difuse

After two Wartime bomb disposal operations that lasted 50 hours in total over the past five days, the Hong Kong police unit responsible for disarming explosives can finally take a breather.Fifteen officers from the Explosive Ordnance Disposal Bureau (EOD) worked through the night to defuse a 450kg (1,000lbs) wartime bomb uncovered on Wednesday at a building site in a busy commercial district of the city.

4 వేల మందిని కాపాడిన బాంబ్ స్క్వాడ్

Posted: 02/02/2018 09:59 AM IST
Wartime bomb found in hong kong

హాంకాంగ్ పోలీసులు సుమారు నాలుగు వేల మంది ప్రాణాలు కాపాడారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పేలకుండా పోయిన ఓ బాంబును నిర్వీర్యం చేశారు. దీంతో హాంకాంగ్ ప్రభుత్వం ఊపిరి తీసుకుంది.

రెండో ప్రపంచ యుద్ధంలో హాంకాంగ్ లోని ఈ ప్రాంతం జపాన్ అధీనంలో ఉండేది. ఆ సమయంలోనే అమెరికా ఈ బాంబును జారవిడిచింది. అయితే అది పేలకుండా ఉండిపోయింది. దానిపై మట్టి పేరుకుపోయింది. చుట్టూ నివాస ప్రాంతాలు వెలిశాయి. మారిన కాలానికి అనుగుణంగా ఆ వీధిలో వాణిజ్య సముదాయాలు వెలిశాయి. నిత్యమూ బిజీగా మారిపోయింది. ఇప్పుడు ఆ ప్రాంతంలో నూతన నిర్మాణం చేపట్టాలని భావించి తవ్వకాలు సాగిస్తుండగా, ఆ భారీ బాంబు బయటపడింది. దీంతో ఈ అప్రమత్తమైన అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. యాంటీ బాంబ్ స్క్వాడ్, పోలీసులు సుమారు 50 గంటలపాటు శ్రమించి జాగ్రత్తగా దాన్ని బయటకుతీసి నిర్వీర్యం చేశారు.

ఏఎన్-ఎం 65 బాంబు... ఇది అమెరికా తయారు చేసిన బాంబు. దాదాపు 1000 పౌండ్ల బరువుంది. ఇక ఇది పేలివుంటే ఈ ప్రాంతంలో దాదాపు 4 వేల మంది వరకూ మరణించి వుండేవారని అధికారులు తెలిపారు. గడచిన వారం రోజుల వ్యవధిలో హాంకాంగ్ లో బయటపడిన రెండో బాంబు ఇది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hong Kong  Heavy Bomb  హాంకాంగ్  భారీ బాంబు  

Other Articles