Rs5 lakh health cover for every Indian ప్రతీ భారతీయుడికి రూ.5లక్షల అరోగ్యబీమా

Arun jaitley announces rs5 lakh health cover for every indian

arun jaitley, budget, health, health cover for every citizen, health budget, education, education budget, budget education, Budget 2018, Budget 2018 Live, Budget session, income tax, lok sabha, Narendra Modi, parliament, rajya sabha, Union Budget, Union Budget 2018, Union Budget 2018-19

Govt’s budget for healthProvides 5 lakh rupees per family per year for medical reimbursement, under National Health Protection Scheme. This will be world’s largest health protection scheme.

ప్రతీ భారతీయుడికి రూ.5లక్షల అరోగ్యబీమా

Posted: 02/01/2018 01:59 PM IST
Arun jaitley announces rs5 lakh health cover for every indian

కార్పోరేట్ అసుపత్రులు తమ చేతివాటం ప్రదర్శించి ప్రజల ప్రాణాలతో చెటగాలమాడుతున్న క్రమంలో వాటిపై జాతీయస్థాయిలో ఏదైనా కొత్త సవరణలు తీసుకువస్తారని అశించిన ప్రజలకు నిరాశపర్చిన కేంద్ర బడ్జెట్.. ప్రజారోగ్యానికి ప్రాధాన్యతను కనబరుస్తున్నామని చెప్పింది. పేదలకు ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల  అరోగ్యభీమా పథకాన్ని కల్పిస్తామని చెప్పిన కేంద్రమంత్రి జైట్లీ, ఈ పథకంతో దేశంలోని పది కోట్ల కుటుంబాలకు లభ్ది చేకూరనుందని కూడా చెప్పారు. ప్రపంచంలోనే ప్రభుత్వ అధ్వర్యంలో చేపట్టే అతిపెద్ద అరోగ్యపథకంగా ఈ పథకం గుర్తింపుకు కూడా సాధిస్తుందని మంత్రి అశాభావం వ్యక్తం చేశారు.

ఆయుష్మాన్ భవ సహా పలు ఆరోగ్య కార్యక్రమాలు, పథకాలను పరిపుష్టం చేస్తామని చెప్పారు. ఆరోగ్య రక్షణ పథకాలను పలు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని, కానీ కావాల్సిన స్థాయిలో ఆరోగ్య సంరక్షణ అందించాలని తాము కోరుకుంటున్నట్టు జైట్లీ చెప్పారు. అంతేకాక 1.5 లక్షల ఆరోగ్య సంరక్షణ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు కూడా చెప్పారు. ఇవి ప్రతి ఒక్క గృహదారుడికి దగ్గరగా ఉంటాయని, ఈ సెంటర్లు ప్రజలకు అవసరమైన డ్రగ్స్‌ను, డయాగ్నోసిస్‌ను ఉచితంగా అందించనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం ద్వారా ప్రజలకు హెల్త్‌ కవర్‌ అందుబాటులో ఉండే పథకం కెనడా దేశంలో అవలంభవుతోంది.

ప్రస్తుతం మనదేశం కూడా ప్రజలకు మెడికల్‌ ఇన్సూరెన్స్‌ ఇచ్చేందుకు నిర్ణయించింది. మెడికల్‌ ఇన్సూరెన్స్‌తో పాటు కొత్తగా 24 మెడికల్‌ కాలేజీలను ఏర్పాటుచేయనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుత కాలేజీలను కూడా ఆధునీకరించనున్నట్టు తెలిపారు. దీంతో దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఒక ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఉండేలా చూసుకోనున్నారు. దీంతో ప్రజల ఆరోగ్యంపై కూడా ఈ సారి ప్రభుత్వం ఈసారి ఎక్కువగా దృష్టిసారించినట్టు తెలిసింది.

వైద్య, విద్యా రంగాలలో ముఖ్యాంశాలివే..

*    టీబీ పేషెంట్ల సరంక్షణకు రూ.670 కోట్లతో ప్రత్యేక నిధి
*    ఇప్పటికే ఉన్న జిల్లా ఆస్పత్రులను మెడికల్‌ కాలేజీలుగా అభివృద్ధి
*    కొత్తగా 24 మెడికల్‌ కాలేజీలకు అనుమతి
*    ప్రతి మూడు పార్లమెంటరీ స్థానాలకు కలిపి కనీసం ఒక ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు
*    టీబీ రోగులకు వైద్యం సమయంలో నెలకు రూ.500
*    ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల వరకు హెల్త్‌ స్కీం (ఆయుష్మాన్‌ భవ పథకం). రూ.330 చెల్లిస్తే కుటుంబానికి బీమా
*    ఆయుష్మాన్‌ భవ పథకంతో అందరికీ ఆరోగ్యం
*    ప్రపంచంలోనే అతి పెద్ద జాతీయ ఆరోగ్య భద్రతా పథకం.. పది కోట్ల మందికి లబ్ధి
*    ఆరోగ్య రంగానికి భారీగా నిధులు. రూ.లక్షా 38 వేల కోట్ల నిధులు కేటాయింపు

విద్య

*    కొత్తగా 18 ఆర్కిటెక్చర్‌ కాలేజీలు
*    స్కూల్‌ టీచర్ల శిక్షణకు ప్రత్యేక స్కూళ్లు
*    డిజిటల్‌ విద్యావిధానానికి మరింత చేయూత
*    విద్యారంగంలో మౌలిక అభివృద్ధికి రూ.లక్షకోట్లతో రైజ్‌ నిధి
*    విద్యాభివృద్ధి కోసం జిల్లా కేంద్రంగా ప్రణాళిక
*    నవోదయ పాఠశాలల తరహాలో కొత్తగా ఏకలవ్య పాఠశాలలు
*    ఈ ఏడాది నుంచి పీఆర్‌ఎఫ్‌(ప్రధానమంత్రి రిసెర్చ్‌ ఫెలోషిప్‌). టాప్‌ వెయ్యి మంది బీటెక్‌ విద్యార్థులు
*   నాణ్యతతో కూడిన విద్యను అందించేందుకు అన్ని రాష్ట్రాలతో కలిసి మేం పనిచేయనున్నాం.
*    గ్రూప్‌ సీ, డీలలో ఇంటర్వ్యూలను రద్దు చేశాం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arun jaitley  Union Budget 2018  income tax  health  education  Narendra Modi  parliament  

Other Articles