Railway capital expenditure of Rs 1.48 lakh crore పరిశ్రమలకు రుణఊతం.. రైల్వేలలో బెంగళూరుకు ప్రాధాన్యం..

Govt allocates railway capital expenditure of rs 1 48 lakh crore

arun jaitley, budget, Railways, railway budget, wifi in railway stations, industries, industries budget, Budget 2018, Budget 2018 Live, Budget session, income tax, lok sabha, Narendra Modi, parliament, rajya sabha, Union Budget, Union Budget 2018, Union Budget 2018-19

All railway stations and trains will have WiFi and 150 kilometres of additional suburban corridors in being planned. RS 17,000 crore is being set aside for Bengaluru Metro says union finance minister arun jaitley during budget presentation for the 2018-19 fiscal year.

బడ్జెట్ 2018-19: పరిశ్రమలకు రుణఊతం.. రైల్వేలలో బెంగళూరుకు ప్రాధాన్యం..

Posted: 02/01/2018 12:26 PM IST
Govt allocates railway capital expenditure of rs 1 48 lakh crore

కేంద్ర విత్త మంత్రి అరుణ్‌ జైట్లీ బడ్జెట్ లో భాగంగా రైల్వేశాఖకు మునుపెన్నడూ లేని విధంగా కేటాయింపులను ఇచ్చారు. రైల్వేలకు 1.48 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించిన కేంద్రం.. అందులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు మాత్రం తాయిలాలు ప్రకటించింది. ఈ ఏడాదిలో ఎన్నికలకు వెళ్లనున్న కర్ణాటక రాష్ట్ర ప్రజానికాన్ని తమ వైపుకు అకర్షించుకోవడంలో భాగంగా బెంగళూరు మెట్రో రైలుకు 17 వేల కోట్ల రూపాయలను కేటాయించిన కేంద్రం.. అదే తరహాలో ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రం గుజరాత్ కు కూడా తాయిలాలను ప్రకటించారు జైట్లీ.

గత ఏడాది సెప్టెంబర్ మాసంలో ప్రధాని నరేంద్రమోడీ, జపాన్ ప్రధాని ముఖ్యఅతిధిగా శంఖుస్థాపనకు నోచుకున్న ముంబై-అహ్మదాబాద్ స్టేషన్ల మద్య బుల్లెట్ రైలుకు మరో అడుగు ముందుకు పడింది. ప్రధాని సొంత రాష్ట్రంలోని వడోదరలో రైల్వే విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో వెలువరించారు. అయితే బుల్లెట్ రైలు ప్రయాణానికి సేవలందించే మానవవనరులను పెంపోందించేందుకు ఈ విశ్వవిద్యాలయం దోహదపడుతుందని చెప్పారు.

ఇక దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యంతో పాటు సిసీటీవీ ఫూటేజీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దీంతో పాటు రోజుకు 25 వేల మంది ప్రయాణికులకు సేవలందించే రైల్వే స్టేషన్లలో ఎస్కలేటర్లను ఏర్పాటు చేయనున్నామని తెలిపింది. దేశ అర్థిక రాజధాని ముంబైలోని రైల్వే ట్రాకు డబ్లింగ్ పనులతో పాటు 160 కిలోమీట్లర మేర విస్తరణకు రూ.11 వేల కోట్ల రూపాయలను కూడా కేంద్రం కేటాయింపులు చేసింది. రైల్వే విద్యుద్దీకరణ యధావిధిగా కోనసాగనున్నట్లు పేర్కోన్నారు. 12వేల వాగన్లు, 5160 కోచులతో పాటు 700 రైలు ఇంజన్లు తయారీ తమ లక్ష్యంగా నిర్ధేశించుకున్నామని చెప్పారు.

ఇప్పటికే నరేంద్రమోడీ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తల సంక్షేమ ప్రభుత్వంగా విమర్శలు ఎదుర్కొంటున్న క్రమంలో జైట్లీ బడ్జెట్ కూడా అదే నిజమనేట్లుగా చిన్న, మాధ్యమిక పారిశ్రామిక వేత్తలతకు ఊతాన్ని ఇచ్చేలా రానున్న అర్థిక సంవత్సర బడ్జెట్ కేటాయింపులను పొందుపర్చింది. ముద్ర పథకం కింద ఔత్సాహిక వాణిజ్యవేత్తలకు రూ. 3 లక్షల కోట్ల రుణాలు అందచేయనున్నట్టు ప్రకటించారు. నైపుణ్యాల అభివృద్దికీ భారీగా నిధులు వెచ్చించనున్నట్టు వెల్లడించారు.  ఉపాధి రంగంలో ముద్ర పథకంతో పెనుమార్పులు చోటుచేసుకుంటాయన్నారు. విద్యారంగంలో మౌలిక వసతుల ఏర్పాటుకు రూ. లక్ష కోట్లు కేటాయించారు. మత్స్యపరిశ్రమ, పశుసంవర్దక రంగాలకూ కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు వర్తింపచేస్తామని చెప్పారు.

ముఖ్యాంశాలివే..

రైల్వేలు

* రైల్వేకు రూ.1,48,000కోట్లు కేటాయింపు
* 18 వేల కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌ డబ్లింగ్‌ పనులకు నిధులు కేటాయింపు
* దేశ వ్యాప్తంగా 600 రైల్వే స్టేషన్లు గుర్తించి వాటి అభివృద్ధి
* 4వేల కిలో మీటర్ల మేర కొత్తగా రైల్వే మార్గం
* 25 వేలమంది ప్రయాణీకులు వచ్చే రైల్వే స్టేషన్లలో ఎస్కలేటర్ల ఏర్పాటు
* అన్ని రైల్లే స్టేషన్లలో వైఫై, సీసీటీవీల ఏర్పాటు
* రైళ్ల ఆధునీకరణకు ముందడుగు. కొత్తగా రైల్వేలకు 12,000 వ్యాగన్లు, 5160కోచ్‌లు, 700 లోకోమోటివ్స్‌.
* భారత్‌ మాల ప్రాజెక్టులో భాగంగా 9 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు పూర్తి చేస్తాం

పరిశ్రమలు

* పరిశ్రమలకు ముద్ర పథకం ద్వారా మరిన్ని రుణాలు
* పరిశ్రమలకు ఆన్‌లైన్‌ ద్వారా రుణాల సరళీకృతం
* చిన్న మధ్య తరగతి పరిశ్రమలకు రూ.3794 కోట్లు
* కార్పోరేట్‌ పన్ను 2శాతం తగ్గింపు
* ఉపాధికల్పనకు వచ్చే మూడేళ్లకుగాను భవిష్యనిధికి 12శాతం నిధులు చెల్లింపు
* జౌళి రంగానికి రూ.7148 కోట్లు

ఇక బడ్జెట్ లోని పలు ముఖ్యాంశాలు:

* అమృత్‌ ప్రోగ్రాం కింద 500 నగరాలకు నీటి సరఫరా. ఇప్పటికే 494 కాంట్రాక్టులకోసం రూ. 19,428 కోట్లు
* 10 ప్రముఖ పర్యాటక ప్రాంతాలు గుర్తించి వాటిని మరింత అభివృద్ధి చేయనున్నాం
* భారత్‌ మాల ప్రాజెక్టులో భాగంగా 9 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు పూర్తి చేస్తాం
* దేశ వ్యాప్తంగా స్మార్ట్‌ సిటీల కింద 99 నగరాలు ఎంపిక. రెండు లక్షల కోట్లు కేటాయింది.
* ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి రూ.లక్షా 5వేల కోట్లు
* ముద్ర యోజనఫండ్‌కోసం రూ.3లక్షల కోట్లు
* ఎస్సీ, ఎస్టీల సంక్షేమ నిధికి 50శాతం నిధుల పెంపుగ్రామీణ ప్రాంతంలోని పేదలకు ఉచిత విద్యుత్‌ కోసం రూ.16 వేల కోట్లు
* వచ్చే ఏడాది కొత్తగా 2కోట్ల మరుగు దొడ్లు నిర్మించి ఇస్తాం
* కౌలు రైతులకు కూడా రుణాలు ఇచ్చేలా కొత్త విధానం
* వచ్చే ఏడాది వ్యవసాయ రుణాలకు రూ.11 లక్షల కోట్లు
* దిగువ తరగతి వారికి ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద 50 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యం
* ఉజ్వల పథకం కింద 4 కోట్ల ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు
* ప్రధానమంత్రి సౌభాగ్య యోజనకు రూ.1600 కోట్లు
* సాగునీటి కోసం నాబార్డుతో కలిసి ప్రత్యేక విధానం
* చేపల పెంపకం, పశుసంవర్థకానికి రూ.10వేల కోట్లు
* జాలర్లకు క్రెడిట్‌ కార్డులు
* ఆపరేషన్‌ గ్రీన్‌కు రూ.500 కోట్లు
* సౌర విద్యుత్‌ను మరింత ప్రోత్సహిస్తాం
* నేషనల్‌ బ్యాంబూ మెషిన్ కు రూ.1200 కోట్లు
* వ్యవసాయ మార్కెట్‌ల అభివృద్ధికి రూ.2000 కోట్లు
* ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు రూ.1400 కోట్లు
* ఫుడ్‌ ఫ్రాసెసింగ్‌ కోసం 42 కేంద్రాలు ఏర్పాటు
* ఆర్గానిక్‌ వ్యవసాయానికి కేంద్రం తోడ్పాటును అందిస్తుంది
* వ్యవసాయ ఎగుమతులను సరళీకృతం చేస్తున్నాం
* పెట్టుబడికి ఒకటిన్నర రెట్లు ఉండేలా మద్ధతు ధర నిర్ణయిస్తాం
* పంట కొనే విషయంలో రాష్ట్రాలతో మాట్లాడి ఓ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం
* వ్యవసాయ రంగం గణనీయంగా అభివృద్ధి చెందింది
* బడ్జెట్‌లో వ్యవసాయంతోపాటు, గ్రామీణరంగం, సంక్షేమ రంగంపై దృష్టి సారించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arun jaitley  Union Budget 2018  income tax  railways  industries  Narendra Modi  parliament  

Other Articles