Amma two-wheeler scheme to begin from February 24 సగం ధరకే టూవీలర్.. అయినా అభ్యర్థుల కరువు..

Women can buy bikes at 50 subsidy under amma scheme in tamil nadu

amma election promise, tamil nadu, J Jayalalithaa, birth anniversary of J Jayalalithaa, Amma Two Wheeler Scheme, 50 per cent government subsidy, Tamil Nadu Women, Amma Scheme, two wheeler amma scheme, bike subsidy, conditions, driving license, tamil nadu

The Amma Two Wheeler Scheme which would allow women to purchase mopeds by availing 50 per cent government subsidy will begin from February 24.

సగం ధరకే టూవీలర్.. అయినా ఆదరణ కరువు..

Posted: 01/23/2018 04:27 PM IST
Women can buy bikes at 50 subsidy under amma scheme in tamil nadu

సగం ధరకే ద్విచక్రవాహనాలను అందజేస్తామని ప్రకటన ఇచ్చి కౌంటర్లను ఏర్పాటు చేసినా.. తమళనాడులో మహిళలు పెద్దగా అసక్తిని కనబర్చడం లేదు. ఇందులో కూడా ఏదైనా మోసం వుందా..? అందుకనే వారు వెనకంజ వేస్తున్నారా..? అన్న అనుమానాలు కలుగుతున్నాయా.? అదేం లేదు. ఇది ఏకంగా ప్రభుత్వమే ఇస్తున్న పథకం. మరోలా చెప్పాలంటే.. మరోమారు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు చేసే మహిళలకు ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసేందుకు తాము 50 శాతం రాయితీని కల్పిస్తామని తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఎన్నికలకు ముందు 2016 మే 4న ప్రకటించారు.

అయితే అమ్మ మరణం తరువాత పార్టీ పాలన సాగిస్తున్నా.. అదరణ మాత్రం కరువైందన్న వార్తల నేపథ్యంలో.. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 24 అమ్మ జయంతిని పురస్కరించుకుని అమ్మ అమలు చేయని ఎన్నికల హామీని అమలు చేయాలని సంకల్పించింది. రాష్ట్రంలో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న అమ్మాయిలకు సగం ధరకే ద్విచక్ర వాహనాలను 'అమ్మ బైక్'ల పేరిట అందించే వినూత్న పథకం ప్రకటించింది. ఈ పథకం ద్వారా బైక్ లను తీసుకోదలచిన వారు ఫ్రిబవరి 5 వరకు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కూడా తెలిపింది. అయితే ఇందుకు మహిళల నుంచి స్పందన కరవైంది.

ప్రతి జిల్లా, మండలాల్లో దరఖాస్తులు స్వీకరించే శిబిరాలు ఏర్పాటు అయినా మహిళలు మాత్రం స్పందించలేదు. దీనికి అధికారులు పెట్టిన కండీషన్లే కారణం. ఈ టూవీలర్స్ కోసం దరఖాస్తు చేసుకునే అమ్మాయికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్న నిబంధన పలువురి ఆగ్రహానికి కారణమైంది. దీనికి తోడు ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నట్టు సర్టిఫికెట్, 40 ఏళ్లలోపు వయసున్నట్టు ధ్రువీకరణను అధికారులు అడుగుతున్నారు. బండ్లే లేని తాము డ్రైవింగ్ లైసెన్సులు ఎందుకు తీసుకుంటామని ప్రశ్నిస్తున్న అమ్మాయిలు, అసలు బైకులను ఎవరికి ఇవ్వాలని చూస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles