Prakash Raj's acerbic take on Darwin row కేంద్రమంత్రికి ప్రకాష్ రాజ్ దిమ్మదిరిగే బదులు..

Prakash raj s biting reply to union minister satyapal singh

#JustAsking, prakash raj, anathkumar hegde, Satyapal Singh, prakash raj anathkumar hegde, prakash raj Satyapal Singh, Darwin's theory, anti-Dalit remark, congress, BJP

Union Minister Anantkumar Hegde denied having made any anti-Dalit remark and criticised the Congress for "deliberately trying to sully" his image on the issue.

కేంద్రమంత్రికి ప్రకాష్ రాజ్ దిమ్మదిరిగే బదులు..

Posted: 01/22/2018 04:24 PM IST
Prakash raj s biting reply to union minister satyapal singh

తన సోదరి గౌరీ లంకేష్ హత్య విషయంలో ప్రధాని మౌనాన్ని వీడాలని సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్‌ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ బీజేపి నేతలు టార్గెట్ చేయడంతో.. ఆయన బీజేపి నేతలకు జస్ట్ ఆస్కింగ్ కేవలం అడుగుతున్నా.. అన్న పేరుతో ప్రశ్నలను సంధిస్తూ.. బీజేపి నేతల దిమ్మదిరిగే కౌంటర్లు వేస్తున్నారు. ఇటీవల కర్ణాటక పర్యటనలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ అథిత్యనాథ్.. హనుమంతుడి భూమిపై ముస్లింరాజు శతజయంతి ఉత్సవాలా అని ప్రశ్నించడంతో.. గతంలో బీజేపి హయాంలో ఇలాంటి ఉత్సవాల జరిగినప్పటి ఫోటోలను పోస్ట్ చేసి.. అప్పుడు లేని అభ్యంతరాలు ఎన్నికలు జరిగేముందు ఎందుకని ప్రశ్నించి సంచలనానికి తెరలేపారు.

తాజాగా మరోసారి ట్విటర్‌ వేదికగా కేంద్ర మంత్రి సత్యపాల్‌ సింగ్‌ కు విలక్షణ నటుడు సూటిగా చురకలు అంటించాడు. ‘‘మనిషి కోతి నుంచి పుట్టాడన‍్న విషయాన్ని మన పూర్వీకులు చూడలేదని మంత్రి చెబుతున్నారు. కానీ, అయ్యా.. అందుకు భిన్నమైన పరిస్థితులను మనం ఇప్పుడు చూస్తున్నామన్న విషయాన్ని మీరు అంగీకరించకుండా ఉండగలరా?  మనిషి కోతిలాగా మారి గతాన్ని తవ్వుతూ మళ్లీ రాతి యుగం కాలం నాటికి తీసుకెళ్తున్నాడు’’ అంటూ ప్రకాశ్ రాజ్ మంత్రిని ఉద్దేశించి ట్వీట్‌ చేశారు.

కాగా, ఛార్లెస్‌ డార్విన్‌ ప్రతిపాదించిన జీవపరిణామక్రమ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి సత్యపాల్‌ సింగ్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మానవజాతి భూమి మీద అలాగే ఉండేదని.. కాబట్టి డార్విన్‌ సిద్ధాంతం పూర్తిగా తప్పని ఆయన చెప్పారు. తక్షణమే ఈ సిద్ధాంతాన్ని కళాశాలలు, పాఠశాలల్లో అధ్యాపకులు బోధించడం ఆపాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రిపై నెట్ జనులు కూడా తీవ్రస్థాయిలో విమర్శల కామెంట్లు పెడుతున్నారు.

ఇక మరోవైపు కేంద్రమంత్రి అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన తప్పుబట్టారు. తన కారును నిలవరించిన దళితుల పట్ల రోడ్డుపై కుక్కలు మెరిగితే.. తాము పట్టించుకోమని.. తాము బెదరబోము, పట్టించుకోమని చేసిన వ్యాఖ్యలను ప్రకాష్ రాజ్ దుయ్యబట్టారు. తన కారును నిలవరించి నిరసన తెలిపింది దళితులని.. అంటే కేంద్రమంత్రి దళితులను కుక్కలుగా అభివర్ణిస్తారా అంటూ మండిపడ్డారు. దళితుల పట్ల బీజేపి నేతలకు, కేంద్రమంత్రులకు ఉన్న ప్రేమ ఇదేనా..? అని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : #JustAsking  prakash raj  anathkumar hegde  Satyapal Singh  congress  BJP  

Other Articles