Rumours of Aadhi's accident false ఆ రెండు వార్తల్లోనూ నిజం లేదని తేల్చిన అది పినిశెట్టి

Aadhi pinisetty twitts and rubbishes on false articles online

aadhi, aadhi accident, aadhi bhaagamathie, aadhi rumours, aadhi false articles, aadhi rangasthalam, aadhi pinisetty, accident, bhaagamathie, false news, rumours, tollywood, kollywood

Hav ben seeing rumors that I've met wit an accident... which is absolutely not true!! I am totally alright and keeping myself busy with my ongoing shoots and script works of my next films twitts aadhi pinisetty.

ఆ రెండు వార్తల్లోనూ నిజం లేదని తేల్చిన అది పినిశెట్టి

Posted: 01/22/2018 03:57 PM IST
Aadhi pinisetty twitts and rubbishes on false articles online

ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడు, ప్రముఖ నటుడు ఆది పినిశెట్టికి యాక్సిడెంట్ అయ్యిందని, రంగస్థలం చిత్ర షూటింగ్ చేసి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఇది జరిగిందని దీంతో ప్రస్తుతం ఆయన నడవలేని స్థితిలో ఉన్నాడని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. డాక్టర్లు సీరియస్ అంటున్నారంటూ వచ్చిన వార్తలను అది పినిశెట్టి తోసిపుచ్చాడు. తాను క్షేమంగా వున్నానని, తనకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదని మరీ తేల్చిచెప్పాడు. అయితే అది పినిశెట్టి ప్రమాదానికి సంబంధించిన వార్త తొలుత తమిళనాడులో పుట్టి.. సోషల్ మీడియా ద్వారా వెంటనే తెలుగు రాష్ట్రాలకు పాకింది.

సోషల్ మీడియాలో కాసింత వైరల్ గా కూడా మారింది. దీంతో పినిశెట్టి ప్రమాద వార్తలు, కథనాలు, అసలు ఏమైందీ అంటూ మీడియాలో కూడా తెగ ప్రచారం జరిగింది. సినీ ఇండస్ట్రీలోని చాలా నటులు ఈ వార్తపై నేరుగా ఆది తండ్రి రవిరాజా పినిశెట్టికి ఫోన్ చేసి ఎంక్వయిరీ చేశారు. అప్పటిగానీ వారికి అసలు విషయం బోధపడలేదు. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన ఆది పినిశెట్టి ఈ వార్తలను ఖండించాల్సి వచ్చింది. తాను క్షేమంగా వున్నానని, తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని కూడా ట్విట్టర్ వేదికగా చెప్పాల్సి వచ్చింది.

యాక్సిడెంట్ అయ్యిందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. తనకు ప్రమాదం సంభివించిందని తనతో పాటు తన తండ్రికి కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయని.. ఇందులో నిజం లేదని అన్నారు. ఇక తాను సుకుమార్ దర్శకత్వంలోని రంగస్థలం చిత్ర షూటింగ్ లతో బిజీగా ఉన్నానని చెప్పారు. తనపై ప్రేమాప్యాయతలను చూపించిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. లవ్ ఆల్ అని వివరణ ఇచ్చారు. అంతే కాకుండా భాగమతి సినిమాలో నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదని ఆ సినిమాలో తాను నటించడం లేదని.. త్వరలో విడుదల కానున్న ఆ చిత్ర యూనిట్ కి కూడా శుభాకాంక్షలు తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aadhi pinisetty  accident  bhaagamathie  false news  rumours  tollywood  kollywood  

Other Articles

Today on Telugu Wishesh