Warangal Collector Amrapali Marriage Fixed ప్రేమించిన కలెక్టర్.. ఐపీఎస్ ప్రియుడితో పెళ్లిపీటలెక్కనుంది..

Warangal collector amrapali marriage fixed with ips officer

Warangal district, dynamic lady collector. Amrapali. dynamic lady collector, Amrapali, sameer sharma, marriage, junior IAS officer, Delhi, superintendent of police, Warangal, telangana

Warangal district, dynamic lady collector Amrapali is going to marry in the next month. The 35-year-old passionate government officer will marry another IAS officer hailing from Delhi.

ITEMVIDEOS: ప్రేమించిన కలెక్టర్.. ఐపీఎస్ ప్రియుడితో పెళ్లిపీటలెక్కనుంది..

Posted: 01/22/2018 02:57 PM IST
Warangal collector amrapali marriage fixed with ips officer

వరంగల్‌ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. 2011 బ్యాచుకు చెందిన ఓ ఐపీఎస్ అధికారి  సమీర్ శర్మను ఆమ్రపాలి ప్రేమవివాహం చేసుకోబోతున్నారు. అయితే ఇద్దరూ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ విభాగానికి చెందిన వారే కావడంతో కుటుంబ పెద్దలు కూడా వారి ప్రేమను అంగీకరించడంతో పెద్దల సమక్షంలోనే వారి వివాశం జరగనుంది. ఈ మేరకు వరంగల్‌ కలెక్టర్‌ ఆమ్రపాలి వెల్లడించారు. ఫిబ్రవరి 18న పెద్దల సమక్షంలో తమ పెళ్లి జరగనుందని ఆమె తెలిపారు.

అయితే తనకన్నా ఓ ఏఢాది చిన్నవాడైన సమీర్ శర్మతో అమె ప్రేమలో పడింది. ఉత్తరాదికి చెందిన సమీర్ కేంద్రపాలిత ప్రాంతమైన డయ్యూలో ఎస్సీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  కాగా, ఈ నెల 27 నుంచి ఆమ్రపాలి సెలవులో వెళ్లనున్నట్టు సమాచారం. తెలంగాణలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన తరువాత వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ గా ఆమ్రపాలి 2016 అక్టోబరు 11న బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమె వరంగల్ జిల్లా రూరల్ కలెక్టర్ గా కూడా అదనపు బాద్యతలు నిర్వహిస్తున్నారు.

ఆపై పాలనలో తనదైన ముద్ర వేస్తూ వరంగల్ పరిధిలో అభివృద్ధిని పరిగెత్తించారు. బహిరంగ మల విసర్జన లేని జిల్లాగా వరంగల్ ను తీర్చిదిద్దడంలో తనదైన పాత్రను పోషించారు. కేంద్రం నుంచి పలు అవార్డులు అందుకున్న ఆమె, ప్రస్తుతం వరంగల్ రూరల్‌ జిల్లాకు కలెక్టర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అమ్రపాలిని కాబోయే భర్త ప్రస్తుతం ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 18న వీరి వివాహం పెద్దల సమక్షంలో జరగనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles