Pawan Kalyan teaches hindu rituals to wife anna lezhneva లెజినోవాకు అచారాలు నేర్పిన పవన్

Pawan kalyan to start his visit to kondagattu temple with fans

Pawan Kalyan Political Yatra, Anna lezhneva, Anna lezhneva religious rituals, Anna lezhneva tilak to pawan kalyan, Anna lezhneva breaks coconut, Anna lezhneva veera tilak to pawan kalyan, Pawan Kalyan Political Journey, Pawan Kalyan Kondagattu Anjaneya Swami Temple, pawan kalyan, janasena, kondagattu temple, karimnagar, telangana, andhra pradesh, politics

Actor turned politician, Jana sena chief power star pawan kalyan to start his indefinite political yatra from kondagattu, as a part his wife Anna lezhneva performed religious rituals at his house.

ITEMVIDEOS: అప్రహిత రాజకీయ యాత్రకు పవన్.. సీఎం.. సీఎం అంటూ ఫ్యాన్స్ నినాదాలు..

Posted: 01/22/2018 11:29 AM IST
Pawan kalyan to start his visit to kondagattu temple with fans

జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కల్యాన్ కొండగట్టు అంజనేయ స్వామి అలయ దర్శనానికి బయలుదేరి వెళ్లారు. సుమారు మరో రెండు గంటల వ్యవధిలో ఆయన కొండగట్టు అంజనేయ స్వామి అలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడి నుంచి కరీంనగర్ కు చేరుకుని అక్కడ పార్టీ నేతలు, క్రీయాశీలక కార్యకర్తలతో భేటీ కానున్నారు. అనంతరం ఆయన తన అప్రహిత యాత్ర వివరాలను తెలపనున్నారు.

యాత్ర ప్రారంభం నేపథ్యంలో పెద్దఎత్తున్న జనసేన కార్యాలయం వద్దకు తరలివచ్చిన అభిమానులు, పార్టీ కార్యకర్తలకు అభివాదం చేసేందుకు పవన్ కల్యాన్ తన కారు ఎక్కి రూప్ పై నిలబడి అభివాదం చేశారు. అంతే అలా పవన్ అభివాదం చేయగానే కార్యకర్తలు సీఎం.. సీఎం అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో అక్కడే వున్న మీడియా యాత్ర గురించి ఏమైనా వివరాలను తెలిపాల్సిందిగా కోరగా, అన్ని కొండగట్టులోనే అంజనేయ స్వామి దర్శనం అయిన తరువాత వివరిస్తానని చెప్పారు.

కొండగట్టులో స్వామి దర్శనం తరువాత ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించనున్నట్టు జనసేన వర్గాలు వెల్లడించాయి. పవన్ కాన్వాయ్ లో దాదాపు 30కి పైగా వాహనాలు ఉన్నాయి. జనసేన నాయకులు, పవన్ అభిమానులు ఆయన వెంట యాత్రకు బయలుదేరి వెళ్లారు. అయితే యాత్ర ప్రారంభానికి ముందు పవన్ కల్యాన్ కు ఆయన సతీమణి అన్నా లెజినోవా నవ్వు తెప్పించారు. అదేలా..? ఏంటీ కారణం అంటి..

రాజకీయ యాత్ర నేపథ్యంలో ఇంట్లో హారతినిచ్చిన పవన్ కల్యాన్ భార్య లెజినోవా అయనతో పాటు జనసేన కార్యాలయానికి కూడా తరలివచ్చింది. ఇక అక్కడి నుంచి కొండగట్టుకు బయలుదేరుతున్న పవన్ కు పార్టీ కార్యాలయంలో అమె పవన్ కల్యాన్ ఎక్కి ప్రయాణించే కారుకు హిందూ సంప్రదాయం మేరకు కొబ్బరికాయ కొట్టింది. అయితే మన సంప్రదాయాలు అంతగా తెలియని అమె మొదటి ప్రయత్నంలో విఫలం కాగా, రెండో ప్రయత్నంలో మాత్రం సక్సెస్ కాగానే జనసేన కార్యకర్తలు జై జనసేన అంటూ అమె గొంతుకు మద్దతుపలికారు.

అయితే అమె అమాయకత్వాన్ని చూసిన పవన్ నవ్వుతూ నిల్చున్నారు. ఇక అంతకుముందు అన్నా, పవన్ కు ఎదురు వచ్చి తిలకం దిద్దుతున్న వేళ, ఆమెకు తిలకం ఎలా పెట్టాలో తెలియలేదు. ఆమె చూపుడు వేలితో కుంకుమను చేతికి తీసుకోబోగా, స్పందించిన పవన్, ఆ వేలితో కాదని, కుడి చేయి ఉంగరపు వేలితో ఇలా కుంకుమ దిద్దాలని చూపించారు. ఆపై అన్నా ఆయనకు అలానే కుంకుమ దిద్దగా, ఈ ఘటన మొత్తం మీడియా కెమెరాలకు చిక్కి వైరల్ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles