Asad thanks Modi for uniting Muslims ప్రధానికి థ్యాంక్స్ చెప్పిన హైదరాబాద్ ఎంపీ..

Asaduddin owaisi thanks pm modi for uniting muslims

Majlis-e-Ittehadul Muslimeen, Asaduddin Owaisi, Triple talaq bill, PM Modi, Narendra Modi, Muslims, politics

All India Majlis-e-Ittehadul Muslimeen president Asaduddin Owaisi thanks Prime Minister Narendra Modi in Uniting the muslims throught the country.

ప్రధానికి థ్యాంక్స్ చెప్పిన హైదరాబాద్ ఎంపీ.. ఎందుకంటే..!

Posted: 01/20/2018 05:49 PM IST
Asaduddin owaisi thanks pm modi for uniting muslims

కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కారుపై వీలు చిక్కినప్పుడల్లా విమర్శనాస్త్రాలు సంధించే మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఈ సారి మాత్రం కొంత ఢిఫరెంట్ గా స్పందించారు. ప్రధాని మోడీ సహా బీజేపి పార్టీపై వాటి అనుసంధాన సంస్థలు అర్ఎస్ఎస్ పై ప్రతిసారి విమర్శలు చేసే ఓవైసీ తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ట్రిపుల్ తలాక్ అంశాన్ని ప్రధాని మోడీ లేవనెత్తడం వల్లే దేశవ్యాప్తంగా వున్న ముస్లింలందరూ ఏకమయ్యారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అందుకే మోడీకి కృతజ్ఞతలని తెలిపారు.

తాజాగా కర్నూలులో పర్యటించిన ఎంపీ ఒవైసీ మాట్లాడుతూ.. ముస్లిం మహిళలపై కేంద్రానికి నిజంగా ప్రేమ ఉంటే బడ్జెట్‌లో రూ.2 వేల కోట్లు కేటాయించి.. ప్రతీ మహిళకు రూ.25 వేలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతే కాదు ఎవరైనా పలుమార్లు తలాక్ చెబితే వారిని సంఘ బహిష్కరణ చేయాలని ఎంపీ పిలుపు నిచ్చారు.  ముస్లిం వ్యవస్థలో ఎన్నో మార్పులు చేర్పులు వస్తున్నాయని..అందరూ చైతన్య వంతులు అవుతున్నారని ఆయన అన్నారు.

సమస్యలేవైనా ఉంటే మత పెద్దల వద్ద పరిష్కరించుకోవాలని అసదుద్దీన్ సూచించారు. ట్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. ట్రిపుల్ తలాక్ బిల్లు ముస్లిం మహిళలకు వ్యతిరేకమన్న బీజేపి ప్రచారంలో కూడా సత్యములేదని అన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణంపై స్పందిస్తూ.. ఆ సమస్య కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మాట్లాడబోనని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles