Passport delivery is basic service, says Sushma పాస్ పోర్టు డెలివరీ ప్రాథమిక సేవ: సుష్మాస్వరాజ్

Mea set to launch 236 popsk throught nation says sushma swaraj

Post Office Passport service Kendra (POPSK), Sushma Swaraj, Ministry of External Affaitrs, tamil nadu, Sri Lanka, Lankan navy, Karaikal, puducherry

External Affairs Minister Sushma Swaraj said that the Government was continuously working towards taking passport services virtually to the doorsteps of citizens residing even in remote villages.

దేశవ్యాప్తంగా 236 పీవోపీఎస్కే కేంద్రాలు.. పాస్ పోర్టుల జారీ వేగం..

Posted: 01/20/2018 05:19 PM IST
Mea set to launch 236 popsk throught nation says sushma swaraj

దేశ ప్రజల ముంగిట్లోకి పాస్ పోర్టులను అత్యంత వేగంగా తీసుకువెళ్లాలన్న ఉద్దేశ్యంతోనే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. అందులో భాగంగానే తమ శాఖ కూడా వేగిరంగా సేవలను అందిస్తుందని అన్నారు. గతంలో కంటే క్రిందటేడాది తమ ప్రభుత్వం 19 శాతం మేర అధికంగా దేశ ప్రజలకు పాస్ పోర్టులను అందించగలిగిందని అన్నారు.

భవిష్యత్తులో వీలైనంత త్వరగా పాస్‌ పోర్టును అందించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా మొత్తం 236 పొష్టాఫీసు పాస్ ఫోర్టు కేంద్రాలను తెరవాలని కూడా తమ ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇప్పటికే 60కి పైగా పోస్టాఫీసు పాస్ పోర్టు కేంద్రాలను ఏర్పాటు చేశామని, త్వరలోనే మిగతా వాటిని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. పాస్‌ పోర్టు పొందేందుకు ప్రస్తుతం ఉన్న పద్ధతిని మరింత సులభతరం చేయాలని చూస్తున్నామన్నారు.

పుదుచ్చేరిలో ముఖ్యమంత్రి వి. నారాయణ స్వామి, మంత్రులు హాజరైన వేదికపై పోస్టాఫీసులో పాస్ పోర్టు కేంద్రాన్ని (పీవోపీఎస్కే) అమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎనిమిదేళ్లలోపు చిన్నారులు, వృద్ధులకు పాస్‌ పోర్టు పొందేందుకు ప్రస్తుతం ఉన్న ఛార్జీలో 10శాతం రాయితీ కల్పించనున్నామన్నారు. ఈ పీవోపీఎస్కే కేంద్రాల ద్వారా పొరుగున ఉన్న జిల్లాలు, రాష్ట్రాలు పాస్ ఫోర్టు సేవలు పొందుతాయని ఆమె చెప్పారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles