Iron rod from Hyderabad Metro falls on moving car | కొత్త కారులోకి దూసుకెళ్లిన మెట్రో ఐరన్ రాడ్..

Iron rod falls from hyd metro construction site

Hyderabad Metro Rail, Hyderabad Metro Rail Construction, L&T Hyderabad Metro, Metro, Malakpet, nampally metro, Hyderabad Metro, Dilsukhnagar, ankita agarwal, Abids, Hyderabad

An iron rod fell on a moving car at Chaderghat from the Hyderabad Metro Rail construction site damaging the car slightly but no one was hurt in the incident.

కొత్త కారులోకి దూసుకెళ్లిన మెట్రో ఐరన్ రాడ్..

Posted: 01/20/2018 04:27 PM IST
Iron rod falls from hyd metro construction site

భాగ్యనగరంలో మెట్రో రైలు నిర్మాణం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి అపశృత్రులు లేకుండా సవ్యంగా సాగిపోయింది. అమీర్ పేట నుంచి ఎల్బీనగర్ మార్గంలో మాత్రం ఇంకా పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం అదేశించడంతో శరవేగంగా పనులు చేస్తున్న ఎల్ అండ్ టీ జాగ్రత్తల చర్యల్లో కాస్త నిర్లక్ష్యం వహిస్తోంది. తాజాగా మ‌ల‌క్‌పేట్ మెట్రో స్టేష‌న్ నిర్మాణం జ‌రుగుతున్న ప్రాంతంలో ఓ ఇనుప రాడ్ జారిప‌డింది.

కింద రోడ్డు మీద వెళ్తున్న కారు ముందుభాగంలోకి చొచ్చుకుని పోయింది. ప్రమాదం నుంచి అబ్దుల్ అజీజ్ సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డిన‌ప్ప‌టికీ.. కొత్త కారు డ్యామేజ్ కావటంతో మెట్రో నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అదే రాడ్డు కొన్ని గడియాల అలస్యంగా పడి ఉంటే తన ప్రాణాలు పోయి ఉండేవని అవేదన వ్యక్తం చేశాడు. అయిత ప్రమాదం జరిగిన విషయమై స్పందిచిన ఎల్ అండ్ టీ మెట్రో ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

హైదరాబాద్ మెట్రో రైలు నిర్మాణంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఎక్కడా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించలేదని, అయితే మలక్ పేటలో ప్రమాదం జ‌రిగినందుకు తాము చింతిస్తున్నామ‌ని, ఇది జ‌ర‌గ‌డానికి గ‌ల కార‌ణాల‌ను విచారిస్తామ‌ని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. అబ్దుల్ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు చాద‌ర్‌ఘాట్ పోలీసులు సెక్ష‌న్ 336 కింద ఎల్ అండ్ టీ మీద కేసు న‌మోదు చేసిన‌ట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Malakpet  nampally metro  LandT  Hyderabad Metro  Dilsukhnagar  ankita agarwal  Abids  

Other Articles