Amazon Great Indian Sale starts early for Prime users అమెజాన్ లో.. భలే మంచి చౌకభేరాలు..

Great indian festival amazon begins sale buyers can avail 80 discounts

Great Indian Festival, Ecommerce, Flipkart, Amazon Prime, Amazon India, discount offers, prime members

Amazon India's Great Indian Festival is offering up to 40% off on mobile phones. Amazon's Prime members are getting exclusive deals, discounts and cashbacks on a range of products.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ లో.. భలే మంచి చౌకభేరాలు..

Posted: 01/20/2018 12:49 PM IST
Great indian festival amazon begins sale buyers can avail 80 discounts

భలే మంచి చౌక భేరము.. ఇది విడిచినన్.. అంటూ సాగే పాత పాట గుర్తుకు వస్తుందా..? కానీ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమాజాన్ లో మాత్రం ఈ ఏడాదిలోనే తొలిసారిగా మంచి ఆఫ‌ర్ల‌తో గ్రేట్ ఇండియ‌న్ సేల్ మ‌రోసారి ముందుకు వ‌చ్చేసింది. అర్థరాత్రి నుంచి ప్రారంభం కావాల్సిన ఈ భారీ డిస్కౌంట్ సేల్ 12 గంటలు ముందుగానే అమెజాన్ ప్రైమ్ స‌భ్యుల‌కు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఇక ఇతర కస్టమర్లకు ఇవాళ్టి అర్థారాత్రి 12 గం.ల నుంచి ఈ సేల్ అందుబాటులోకి రానుంది.

కేవలం నాలుగు రోజుల పాటు మాత్రమే అంటే జ‌న‌వ‌రి 24 వ‌ర‌కు మాత్రమే ఈ డిస్కాంట్ సేల్ జ‌ర‌గ‌నుంది. ఈ డిస్కౌంట్ సేల్ లో మొబైల్స్‌, ఎల‌క్ట్రానిక్స్‌, ల్యాప్‌టాప్‌లు, కిచెన్‌, గృహావ‌స‌రాల‌తో పాటు ఫ్యాషన్ పై భారీ డిస్కౌంట్ల‌ను అమెజాన్ ప్ర‌వేశ‌పెట్ట‌బోతోంది. హెచ్‌డీఎఫ్‌సీ కార్డు మీద ప‌ది శాతం అద‌న‌పు క్యాష్‌బ్యాక్‌, అమెజాన్ పే బ్యాలెన్స్ రూపంలో 10 శాతం క్యాష్‌బ్యాక్ ఇవ్వ‌నుంది. ప్రైమ్ స‌భ్యులు యాప్ ద్వారా త‌మ‌కు కావాల్సిన వ‌స్తువుల‌ను ముందుగా కార్ట్‌లో యాడ్ చేసుకుని, సేల్ అధికారికంగా ప్రారంభ‌మైన త‌ర్వాత డ‌బ్బు చెల్లించాల్సి ఉంటుంది.

వ‌న్‌ప్ల‌స్ 5టీ లావా, ఆన‌ర్ వ్యూ10, ఎల్‌జీ వీ30 ప్ల‌స్ స్మార్ట్‌ఫోన్ల‌పై కూడా అమెజాన్ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. వ‌న్‌ప్ల‌స్‌, మోటోరోలా, శాంసంగ్‌, ఆపిల్‌, కూల్‌ప్యాడ్, ఎమ్ఐ, ఆన‌ర్ వంటి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ల‌పై 40 శాతం వ‌ర‌కు, కెమెరాలు, టీవీలు, వైఫై రూట‌ర్లు వంటి ఎల‌క్ట్రానిక్స్‌పై 55 శాతం వ‌ర‌కు, వాషింగ్ మెషీన్లు, మిక్సీలు, మైక్రోవేవ్ ఓవెన్లు వంటి గృహోప‌క‌ర‌ణాల‌పై 50 శాతం వ‌ర‌కు, ఇక ఇత‌ర గృహావ‌స‌ర వ‌స్తువుల‌పై 75 శాతం వ‌ర‌కు, ఫ్యాష‌న్ బ్రాండ్ల‌పై 40-80 శాతం వ‌ర‌కు డిస్కౌంట్లు ఇవ్వ‌నున్న‌ట్లు అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles