Mobile pics, videos may be allowed as evidence తస్మాత్ జాగ్రత్త: సాక్షాలు ఇకపై మేడ్ ఈజీ

Mobile pics videos may be allowed as evidence

video evidence, mobile evidence, evidence act amendment, Evidence Act, electronic evidence, mobile videos, mobile photos, indian courts, law ministry, new delhi

The Centre is planning to amend the Evidence Act, 1872, in order to incorporate images and videos captured from mobile phone as primary evidence "sufficient for prosecution".

తస్మాత్ జాగ్రత్త: సాక్ష్యాలు ఇకపై మేడ్ ఈజీ

Posted: 01/20/2018 11:57 AM IST
Mobile pics videos may be allowed as evidence

న్యాయస్థానాలలో కేసులు ఇకపై త్వరగా క్లియర్ కానున్నాయి. ఇన్నాళ్లు పలు కేసులకు సాక్షాలు లేకపోవడం వల్ల అనేక కేసులు ఎన్నో ఏళ్లుగా న్యాయస్థానాలలో పెండింగ్ లో వున్నాయి. కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న క్రమంలో న్యాయమూర్తుల సంఖ్య తదనుగూణంగా పెరగడం లేదని ఇప్పటికే విమర్వలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు దృష్టి సారించింది. ముందుగా కేసులను వేగంగా పరిష్కరించి తీర్పు వెలువడేందుకు చర్యలను తీసుకోనుంది. ఈ మేరకు కేంద్రం పలు సవరణలను కూడా చేయనుంది.

ఈ క్రమంలో ఇకపై మోబైల్ ఫోన్లో తీసిన ఫొటోలు, వీడియోలు కూడా సాక్ష్యాధారాలుగా పరిగణించాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇప్పటి వరకు న్యాయస్థానాలు మోబైల్ ఫోన్లతో తీసిన ఫోటోలను వీడియోలను సాక్ష్యాధారాలుగా పరిగణించడం లేదు. మోబైల్‌లో తీసిన ఫొటోలు, వీడియోలను ఎడిట్ చేసి డాక్టరింగ్ చేసే అవకాశం ఉండడంతో వీటిని సాక్ష్యాలుగా పరిగణించడం లేదు. అయితే ఇప్పుడు ‘ఎవిడెన్స్ యాక్ట్, 1872’ను సవరించి వీటిని కూడా చేర్చాలని కేంద్రం  యోచిస్తోంది.

విచారణ సమయంలో వీటిని కూడా ప్రాథమిక సాక్ష్యాలుగా పరిగణనలోకి తీసుకోవాలని యోచిస్తోంది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్, హరియాణా, మహారాష్ట్ర, జమ్ముకశ్మీర్‌ సహా పలు రాష్ట్రాల అభిప్రాయాన్ని కోరింది. ఉత్తరప్రదేశ్‌లో షహరాన్‌పూర్‌లో జరిగిన జాట్ల అలర్లు, రోహ్‌తక్ ఘటన, దళిత వ్యతిరేక అల్లర్ల విషయంలో భద్రతా దళాల లోపంపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

‘‘సెల్యూలార్  ఫోన్ ద్వారా  తీసిన ఫొటోలు, సీసీ టీవీల్లో రికార్డ్ అయిన వీడియోలను కూడా ‘ఎవిడెన్స్ యాక్ట్, 1872’ ప్రకారం సాక్ష్యాధారాలుగా పరిగణించాలి. క్రిమినల్ పీనల్ కోడ్/ఎవిడెన్స్ యాక్ట్‌ను ఈ మేరకు సవరించాలి’’ అని ప్రతిపాదనలో పేర్కొన్నారు. ఈ సవరణలకు ఆమోదం లభించి చట్టంలో చేర్చితే నేరస్తులు ఇక తప్పించుకునే వీలుండదని యూపీ పోలీసు ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles