Amrutha Sarathy may undergo DNA test డీఎన్ఏ టెస్టుకు సిద్దమౌతున్న అమృత

Amrutha claiming to be jayalalithaa s daughter may undergo dna test

Amrutha Sarathy, Amrutha Sarathy news, J. Jayalalithaa, J. Jayalalithaa news, madras high court, supreme court, tamil nadu news

Amrutha Sarathy, has got in touch with a city-based DNA expert through her lawyer in order to have her DNA testing done at CCMB Hyderabad

వారసురాలి వేట: డీఎన్ఏ టెస్టుకు సిద్దమౌతున్న అమృత

Posted: 01/19/2018 06:29 PM IST
Amrutha claiming to be jayalalithaa s daughter may undergo dna test

జయలలిత కుమార్తెగా చెప్పుకుంటున్న అమృత వ్యవహారం మరోమారు బయటకు వచ్చింది. తాను జయ కుమార్తెనంటూ తెరపైకి వచ్చిన అమృత ఆమధ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాను జయ కుమార్తెనని నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు. అత్యున్నత న్యాయస్థానం సూచన మేరకు ఆ తర్వాత మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 2న ఈ కేసు విచారణకు రానుంది.

అమృత వాదిస్తున్నట్లుగా అమె జయలలిత వారుసురాలని తేల్చాల్సిన కేసులో అత్యంత కీలకమైనది, బలమైనది డీఎన్ఏ ఒక్కటే. దీంతో అమృత హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)ని సంప్రదించినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో తమకు ఇప్పటి వరకు ఎటువంటి నమూనాలు అందలేని సీసీఎంబీ అధికార ప్రతినిధి తెలిపారు. నిజానికి సీసీఎంబీ ప్రైవేటు వ్యక్తుల నుంచి డీఎన్ఏ సేకరించదు. కోర్టు ఆదేశాలపై మాత్రమే ఈ పరీక్షలు నిర్వహిస్తుంది.

ఇక అమృత కేసు విషయానికి వస్తే ఆమె చెబుతున్న తల్లి, తండ్రి ఇద్దరూ లేరు. కాబట్టి ఆమె బంధువుల నుంచి రక్తపు నమూనాలు సేకరించి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఇక జయలలిత మరణించారు కాబట్టి ఆమె రక్త నమూనాలు సేకరించే అవకాశం లేదు. ఆమె అస్థికల డీఎన్ఏను సేకరించే వీలు లేకపోతే ఆమె తోడబుట్టిన వారి నుంచి రక్తనమూనాలు సేకరించి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. ఈ కేసును శాస్త్రరీత్యా నిరూపించడం అంత కష్టమైన పనేమీ కాదని మరోపక్క ట్రూత్ ల్యాబ్స్ డైరెక్టర్ గాంధీ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amrutha Sarathy  J. Jayalalithaa  madras high court  supreme court  tamil nadu  

Other Articles