Reason Behind PK Fans Threw Eggs on Mahesh Kathi | దళితుడని చెప్పుకుని ఇదంతా ఎందుకు? - మహేష్ పై గుడ్ల దాడి చేసిన యువకులు

Mahesh kathi attacked by youth

Mahesh Kathi, Pawan Kalyan Fans, Pawan Fans Nani Satish, Pawan Kalyan Fans Attack, Kathi Mahesh Attacked, Mahesh Kathi Dalit Card, Mahesh Kathi Eggs Attack

Kathi Mahesh attacked by mob in Hyderabad. Pawan Kalyan Fans Claims that they attacked Mahesh Kathi. They did not like Kathi uses caste card, that was the main reason behind attack.

ITEMVIDEOS: మహేష్ కత్తిపై దాడి చేసింది మేమే!

Posted: 01/19/2018 04:24 PM IST
Mahesh kathi attacked by youth

సినీ క్రిటిక్ మహేష్ కత్తిపై కోడిగుడ్ల దాడి వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. మహేష్ పై దాడి చేసింది తామేనంటూ ఇద్దరు యువకులు మీడియా ముందుకు వచ్చారు. ప్రతీ చిన్న విషయానికి మహేష్ కులం ప్రస్తావన తీసుకువస్తుండటంతోనే తాము ఈ దాడికి పాల్పడ్డామని వారు వెల్లడించారు.

ప్రతీ విషయంలో దళితుడినని చెప్పుకునే కత్తి మహేష్ పవన్ ఫ్యాన్స్ తో గొడవ విషయంలో కూడా కుల ప్రస్తావన తీసుకురావటం తమకు నచ్చలేదని వారు చెప్పారు. అందుకే దాడికి పాల్పడ్డామని వివరించారు. గతంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద, ఓ మీడియా ఛానెల్ వద్ద మహేష్ ను కలిసి.. పవన్ ఫ్యాన్స్ తరపున క్షమాపణలు చెప్పి ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలకాలని భావించామని, కానీ, మహేష్ మాత్రం అందుకు సహకరించలేదని వారు వెల్లడించారు.

తాము కేవలం పవన్ ఫ్యాన్స్ గా కాకుండా.. సాధారణ పౌరులుగా కూడా వివాదానికి ముగింపు పలుకుదామని యత్నించామని వివరించారు. కానీ, మహేష్ వ్యవహార శైలి మాత్రం చాలా మరోలా కనిపిస్తోందని వారు అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తాము దాడి చేయాల్సి వచ్చిందని వారు వివరించారు. 

ఇదిలా ఉంటే ఓ టీవీ ఛానెల్ లో డిబేట్ షో తర్వాత మహేష్ కత్తి వెళ్తుండగా.. దారిలో కొందరు తనపై కోడిగుడ్లతో దాడి చేశారంటూ మహేష్ కత్తి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. యువకులను సతీష్, నానిలుగా గుర్తించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles