Pradeep License Cancelled in Drunk and Drive Case | డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప్రదీప్ కు ఊరట.. లైసెన్స్ రద్దుతో సరిపెట్టారు

Anchor pradeep license cancelled

Anchor Pradeep, Drunk and Drive Case, Licence Cancel, Nampally Court, Anchor Pradeep Drving License

Anchor Pradeep in Drunk and Drive Case. Nampally Court Cancelled Pradeep License for Three Years and imposed 2100 rupees fine.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు.. యాంకర్ ప్రదీప్ లైసెన్స్ రద్దు

Posted: 01/19/2018 03:20 PM IST
Anchor pradeep license cancelled

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ యాంకర్ ప్రదీప్ కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. జైలు శిక్ష విధించని కోర్టు.. డ్రైవింగ్ లైసెన్స్ మూడేళ్లపాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

డిసెంబర్ 31న డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డ సంగతి తెలిసిందే. మోతాదుకు మించి మద్యం సేవించి 178 పాయింట్లు బ్రీత్ అనలైజర్ లో ప్రదీప్ పట్టబడ్డాడు. తర్వాత నాటకీయ పరిణామాల మధ్య కౌన్సిలింగ్ కు హాజరు అయిన ప్రదీప్ నేడు కోర్టులో హాజరయ్యారు. లైసెన్స్ రద్దు చేయడంతో పాటు ప్రదీప్ కు రూ.2,100 జరిమానా కూడా విధించింది. కాగా, ‘డ్రంకెన్ డ్రైవ్ కు వ్యతిరేకంగా మీడియాలో ప్రచారం చేసిన మీరు మద్యం సేవించి వాహనం నడిపితే ఎలా?’ అని ప్రదీప్ ను కోర్టులో ప్రశ్నించినట్టు సమాచారం.

డ్రంకెన్ డ్రైవ్ చేయొద్దంటూ ప్రచారం చేస్తున్న మీరు ఇలాంటి పనులు చేయొద్దని మేజిస్ట్రేట్ తనకు సూచించినట్టు చెప్పాడు. ఇలాంటి సంఘటన మళ్లీ జరగకుండా ప్రయత్నిస్తానని అన్నాడు. ఈ వ్యవహారంలో తనకు మద్దతుగా నిలిచిన అందరికీ తన ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నాడు.

 

మరో వివాదంలో చిక్కుకున్న యాంకర్

కౌన్సిలింగ్ కు హాజరైన ప్రదీప్

శభాష్ ప్రదీప్!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles