Bhopal MP Alok Sanjar fined for helmet-less ride మళ్లీ రిపీట్ కాదంటూ జరిమాన కట్టిన ఎంపీ..

Bhopal mp alok sanjar pays fine apologises for helmet less motorcycle ride

bhopal mp, alok sanjar, ekatm yatra, fine, apologises, helmet, Mahendra Jain, traffic police, helmet-less motorcycle ride, mp helmet less ride, Adi Shankaracharya statue, Omkareshwar, MLA Surendra Nath Singh

The matter was brought to the notice of the traffic police after an individual sent the MP's photograph to the WhatsApp number. After paying the fine, Sanjar apologised in a tweet and promised not to repeat the act in future.

ఆదర్శవాది: మళ్లీ రిపీట్ కాదంటూ జరిమాన కట్టిన ఎంపీ..

Posted: 01/19/2018 10:47 AM IST
Bhopal mp alok sanjar pays fine apologises for helmet less motorcycle ride

ఆయన ఓ పార్లమెంటు సభ్యుడు. అందులోనూ ఏకంగా అధికార పార్టీకి చెందిన ఎంపీ. ఇంకేముంది.. అధికారమే తమదైనప్పుడు తమను ప్రశ్నించే ధైర్యం ఎవరికి వుందన్న రేంజ్ లో ఫీలవుతుంటారు కొందరు నేతలు. అయితే అనుకోకుండా తన జీపు సాంకేతిక లోపం తలెత్తగా, బైక్ పై వెళ్లాల్సి రావడంతో హెల్మెట్ లేకుండా ప్రయాణించిన ఈ ఎంపీ మాత్రం ఎటువంటి భేషజాలకు పోకుండా ఫైన్ కట్టారు. అంతేకాదు ఇలాంటి తప్పు మళ్లీ పునరావృతం కాదని కూడా క్షమాపణలు చెప్పాడు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ లో పోస్టు చేయగానే నెట్ జనులు ఆయనను శభాష్ అని ప్రశంసిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని ఓంకారేశ్వర్‌లో 108 అడుగుల ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా విరాళాలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం నిర్వహించిన ‘ఏక్తామ్ యాత్ర’లో భోపాల్ ఎంపీ అలోక్ సంజార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భోపాల్ ఎమ్మెల్యే సురేంద్రనాథ్ సింగ్‌తో కలిసి బైక్ నడిపారు. అయితే, ఎంపీ అలోక్ హెల్మెట్ లేకుండా బండి నడపుతుండడాన్ని గమనించిన ఓ వ్యక్తి ఫొటో తీసి దానిని ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ నంబరుకు పంపించాడు.

దీనికి స్పందించిన పోలీసులు హెల్మెట్ లేకుండా బండి నడిపినందుకు గాను రూ.250 చెల్లించాలంటూ నోటీసులు పంపారు. పోలీసు అధికారి ఈ విషయాన్ని ఫోన్ చేసి చెప్పగానే నేరుగా ట్రాఫిక్ పోలీస్ కార్యాలయానికి వెళ్లిన ఎంపీ  తనకు విధించిన జరిమానాను కట్టేసి, ఇంకెప్పుడూ ఇలా చేయనంటూ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదన్న దానికి వివరణ ఇస్తూ యాత్ర సమయంలో తాను, కార్యకర్తలు ప్రయాణిస్తున్న జీపు మొరాయించడంతో బైక్‌పై వెళ్లాల్సి వచ్చిందని, ఆ సమయంలో హెల్మెట్ పెట్టుకోవడం మర్చిపోయానని అంగీకరించారు. ఇంకెప్పుడూ హెల్మెట్ లేకుండా బండి, సీటు బెల్టు కట్టుకోకుండా కారు నడపకూడదని ఒట్టేసుకున్నట్టు అలోక్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bhopal mp  alok sanjar  ekatm yatra  fine  apologises  helmet  Mahendra Jain  traffic police  

Other Articles