Students forced to 'duck walk' around playground డక్ వాక్ తో విద్యార్థి ప్రాణాలు తీసిన కార్పోరేట్ పాఠశాల..

Students forced to duck walk around playground as punishment

class 10th student, cctv footage, prayer meeting, thiru vi ka nagar, chennai, parents, duck walk, punishment, corperate school

CCTV footages from the school revealed the latecomers were allegedly forced to do a 'duck walk' in the playground, which the victim's parents suspect could have been the reason for his death.

ITEMVIDEOS: డక్ వాక్ తో విద్యార్థి ప్రాణాలు తీసిన కార్పోరేట్ పాఠశాల..

Posted: 01/19/2018 09:15 AM IST
Students forced to duck walk around playground as punishment

కార్పోరేట్ పాఠశాలల అడగాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. బాహ్య ప్రపంచానికి తామ క్రమశిక్షణ ఎంత విధిగా పాటిస్తామో చూపించుకుని ప్రచారానికి వినియోగించుకునే పాఠశాలలు అదే స్పూర్తిని విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించేందుకు మాత్రం వినియోగించడంలేదు. కేవలం శిక్షలను వేసి.. ఫీజలును సక్రమంగా వసూలు చేయడంలో మాత్రమే ఈ పాఠశాలలు తమ కార్పోరేట్ ప్రతిభను కనబరుస్తున్నాయన్న విమర్శలు వున్నాయి.

తాజాగా పాఠశాలకు ఆలస్యంగా వచ్చినందుకు గానూ కొందరు విద్యార్థులను లేట్ కమ్మర్ గా ముద్రించిన ఉపాధ్యాయులు వారితో డక్ వాక్ చేయించారు. అయితే అనారోగ్యంగా వున్న విద్యార్ధులపై కనీసం శ్రద్ద తీసుకోని టీచర్లు విద్యార్ధి చెప్పినా వినిపించుకోకుండా అందరిమాదిరిగానే పనిష్ మెంట్ పూర్తి చేయాలని అదేశించారు. దీంతో చేసేది లేక పాఠశాల మైదానంలో పనిష్ మెంట్ కోసం వెళ్లిన విద్యార్థి తిరిగిరాని లోకాలకు చేరుకున్నాడు.

ఈ క్రమంలో మోకాళ్లపై నడుస్తూ, అలసిపోయిన ఓ విద్యార్థి కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటన చెన్నైలోని ఓ కార్పొరేట్ స్కూల్‌లో చోటు చేసుకుంది. దీంతో ఆ బాలుడి కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై ఆ బాలుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్కూల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles