GPS, panic button in buses and taxis compulsory ప్రజారవాణ వాహనాలకు జీపీఎస్, అలారమ్ తప్పనిసరి

All cabs and buses have to install gps panic buttons by apr 1

gps and panic button in public transport,gps and panic button in taxis,gps in taxi,gps in bus,panic button in taxi,alert button in taxi,what is panic button,what is alert button,kaali peeli taxi,transport ministry,nitin gadkari, latest news

The panic button will alert both the transport department and police control rooms to take quick action, as and when pressed by the passenger, and the GPS will help in tracking public transport vehicles.

లైంగికదాడుల నివారణ చర్యలపై దృష్టిసారించిన కేంద్రం..

Posted: 01/18/2018 02:41 PM IST
All cabs and buses have to install gps panic buttons by apr 1

దేశంలో మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు అధికమౌతున్న క్రమంలో వాటిని అరికట్టేందుకు తొలివిడతగా కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ముందుగా రోడ్డు రావాణ మార్గంలో మహిళా ప్రయాణికుల భద్రత కోసం చర్యలను చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1, 2018లోగా అన్ని ప్ర‌జార‌వాణా వాహ‌నాలు, ట్యాక్సీలు, బ‌స్సుల్లో జీపీఎస్ ప‌రిక‌రాలు, పానిక్ బ‌ట‌న్ ఏర్పాటు చేయాల‌ని కేంద్ర ర‌వాణా శాఖ అన్ని రాష్ట్రాలకు అదేశాలను జారీ చేసింది.

ఈ మేర‌కు కేంద్ర రవాణా శాఖ ఓ ట్వీట్ ద్వారా విషయాన్ని వెల్ల‌డించింది. వాహనాల్లో మహిళలపై లైంగిక దాడులు జరగకుండా ప్ర‌జా భ‌ద్ర‌త‌ను పెంచేందుకు ర‌వాణా శాఖ యోచిస్తోంది. గ‌తంలో ఈ నిబంధ‌న‌లు తీసుకువ‌చ్చిన‌ప్ప‌టికీ... కొన్ని రాష్ట్రాలు అమ‌లు చేయ‌క‌పోవ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. జీపీఎస్‌, పానిక్ బ‌ట‌న్ ఏర్పాటు చేయడానికి ఇదే తుది గడువ‌ని, మ‌ళ్లీ పొడిగించ‌బోయేది లేద‌ని స్ప‌ష్టం చేసింది.

బస్సులు, ట్యాక్సీల్లో జీపీఎస్‌, పానిక్‌ బటన్ ఉండ‌టం వ‌ల్ల ప్ర‌మాదాల‌ను నివారించే అవ‌కాశం ఉంది. అయితే మూడు చక్రాల వాహనాలు, ఈ-రిక్షాలకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు కల్పించింది. ఈ జీపీఎస్‌, పానిక్‌ బటన్‌.. రవాణా శాఖ, పోలీస్‌ కంట్రోల్‌ రూంకు అనుసంధానించి ఉంటాయి. ఆపదలో ఉన్న ప్రయాణికులు పానిక్‌ బటన్‌ను నొక్కగానే విషయం పోలీసులకు, రవాణాశాఖకు చేరుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gps  panic button  public transport  taxis  alert button  transport ministry  nitin gadkari  twitter  

Other Articles